నిరుద్యోగులు ఎన్నాళ్ల నుంచో వేచిచూస్తున్న ఉద్యోగాల భర్తీ పర్వంలో... ఇవాళ కీలక ఘట్టం ప్రారంభం కానుంది. గ్రూప్-1, పోలీసు, ఇతర విభాగాల యూనిఫాం పోస్టులకు నేటి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. 503 గ్రూప్ వన్ పోస్టుల కోసం ఈనెలాఖరు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. టీఎస్పీఎస్సీవెబ్సైట్లో లింక్ అందుబాటులో ఉంటుంది. గ్రూప్ వన్‌కు అప్లై చేసే అభ్యర్థులు... రాష్ట్రపతి నూతన ఉత్తర్వులకు అనుగుణంగా ముందు ఓటీఆర్ సవరించుకోవాలి. టీఎస్పీఎస్సీ వెబ్‌సైట్‌కు వెళ్లి ఓటీఆర్ ఐడీ, పుట్టిన తేదీ నమోదు చేస్తే.. మొబైల్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ నమోదు చేస్తే దరఖాస్తు చేసేందుకు అవకాశం వస్తుంది. ఓటీఆర్ డేటా బేస్ ప్రకారం పేరు, పుట్టిన తేదీ, విద్యార్హతలు, కమ్యునిటీ తదితర వివరాలన్నీ కనిపిస్తాయి. ఈ వివరాలు సరైనవని నిర్దారిస్తే కన్‌ఫామ్‌పై క్లిక్ చేయాలి. ఏమైనా పొరపాట్లు ఉంటే... నో ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
వివరాలు సరి చేసుకున్న తర్వాత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్ధులందరూ తప్పనిసరిగా దరఖాస్తు ప్రాసెస్ రుసుం 200 రూపాయలు, పరీక్ష ఫీజు 120 రూపాయలు చెల్లంచాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ , దివ్యాంగులు, మాజీ సైనిక ఉద్యోగులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. ఇందుకోసం తాము నిరుద్యోగులమంటూ డిక్లరేషన్ సమర్పించాలి. ఇతర రాష్ట్రాలకు చెందిన అభ్యర్ధులకు పరీక్ష ఫీజు నుంచి ఎటువంటి మినహాయింపు లేదని టీఎస్పీఎస్సీ స్పష్టం చేసింది. ఫీజు చెల్లించిన అనంతరం దరఖాస్తు పీడీఎఫ్ కాపీని భద్రపరుచుకోవాలి. ప్రిలిమినరి పరీక్షకు ప్రతి అభ్యర్ధి 12 జిల్లా పరీక్ష కేంద్రాలను ప్రాధాన్యక్రమంలో ఎంపిక చేసుకోవాలి. జిల్లా కేంద్రాల్లో గ్రూప్ వన్ పరీక్ష నిర్వహించనున్నారు.
పోలీసు, ఇతర విభాగాల యూనిఫాం పోస్టులకూ ఇవాళ్టి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈనెల 20 వరకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగనుంది. www.TSLPRB.in వైబ్‌సైట్‌లో లింకును అందుబాటులో ఉంటుంది. పోలీసు శాఖలో 541 ఎస్‌ఐ, 14 వేల 881 కానిస్టేబుళ్ల ఉద్యోగాలకు..నోటిఫికేషన్లు ఇచ్చారు. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌లో 12 ఎస్‌ఐ, 390 కానిస్టేబుళ్లు పోస్టులను.... భర్తీ చేయనున్నారు. అగ్నిమాపకశాఖలో 26 స్టేషన్ ఫైర్ ఆఫీసర్‌లు, 610 ఫైర్ మెన్ కొలువులకు...... నేటి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. జైళ్ల శాఖలో 8 డిప్యూటీ జైలర్లు, 146 వార్డర్లు, రవాణ శాఖలో 63 ట్రాన్స్‌పోర్ట్ కానిస్టేబుళ్లు, ఎక్సైజ్ శాఖలో 614 ప్రొహిబిషన్ ఎక్సైజ్ కానిస్టేబుళ్ల.... పోస్టులు కూడా భర్తీ చేయనున్నారు. ఇవాళ ఉదయం 8 గంటల నుంచి ఈనెల 20 వ తేదీ రాత్రి 10 గంటల వరకు అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని పోలీసు నియామక మండలి అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి: