ETV Bharat / city

Viveka Murder Case: ' మూడు రోజుల్లోనే వివేకాను హత్య చేయాలన్నారు'

Viveka Murder Case: వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు దస్తగిరి... పులివెందుల మెజిస్ట్రేట్ ఎదుట అప్రూవర్‌గా మారిన తర్వాత ఇచ్చిన వాంగ్మూలంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2019 మార్చి 13, 14, 15... 3 రోజుల్లోనే వివేకాను హత్య చేయాలని.. ఎర్రగంగిరెడ్డి పథకం రచించినట్లు దస్తగిరి తెలిపాడు. ఈ తేదీల్లో నైట్‌ వాచ్‌మన్‌ ఉండడని తెలుసుకుని.. హత్య చేశామని వివరించాడు. వివేకాను హత్య చేస్తే.. భారీ మొత్తంలో డబ్బు ముట్టజెప్తామని.. అంతా తాము చూసుకుంటామని భాస్కర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి భరోసా ఇచ్చారని తెలిపాడు.

Viveka
Viveka
author img

By

Published : Mar 17, 2022, 6:09 AM IST

Viveka Murder Case: ‘మాజీ మంత్రి వై.ఎస్‌.వివేకానందరెడ్డి ఇంటివద్ద నైట్‌ వాచ్‌మన్‌గా పనిచేసే పి.రాజశేఖర్‌ 2019 మార్చి 13, 14, 15 తేదీల్లో కాణిపాకం వెళ్తున్నారంటూ ఆయన పీఏ ఎంవీ కృష్ణారెడ్డి.. ఎర్ర గంగిరెడ్డికి సమాచారం ఇచ్చారు. దీంతో ఆ మూడు రోజుల్లోనే వివేకాను చంపేయాలని, అందుకు ప్రణాళిక రూపొందించుకోవాలని గంగిరెడ్డి నాతోనూ, సునీల్‌యాదవ్‌, ఉమాశంకర్‌రెడ్డిలతోనూ చెప్పారు’ అని ఈ కేసులో నిందితుడు, అప్రూవర్‌గా మారిన షేక్‌ దస్తగిరి వెల్లడించారు. వివేకా హత్యకు 2019 ఫిబ్రవరి 10న గంగిరెడ్డి ఇంట్లోనే ప్రణాళిక రూపొందిందని చెప్పారు. వివేకా ఇంటి లోపలికి వెళ్లటానికి నైట్‌ వాచ్‌మన్‌ రాజశేఖర్‌, జిమ్మి అనే కుక్కే అడ్డంకిగా ఉంటాయని ఆ సందర్భంలో తాను ఎర్ర గంగిరెడ్డితో చెప్పానని పేర్కొన్నారు. అయితే వివేకా పీఏ కృష్ణారెడ్డితో మాట్లాడి, వాచ్‌మన్‌ను అక్కడ లేకుండా చేస్తానని గంగిరెడ్డి చెప్పారన్నారు. తర్వాత 2019 మార్చి 1 నుంచి గంగిరెడ్డి వివేకా వెంటే ఉంటూ.. ఆయన ఎప్పుడు, ఎక్కడికి వెళుతున్నారనే విషయాల్ని సునీల్‌యాదవ్‌, ఉమాశంకర్‌రెడ్డిలతో పాటు తనకూ చెప్పేవాడని తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరి 21న సీఆర్‌పీసీలోని సెక్షన్‌ 306(4)(ఏ) కింద పులివెందుల ఫస్ట్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు. ఆ ప్రతులు తాజాగా వెలుగుచూశాయి. అందులోని ప్రధానాంశాలివీ..

మేం ఉన్నామని చెప్పాం కదా..

వివేకాను చంపాలని ఎర్ర గంగిరెడ్డి చెప్పిన రెండు, మూడు రోజుల తర్వాత సునీల్‌యాదవ్‌ ఓ రోజు నాకు కోటి రూపాయలు ఇచ్చారు. ఇంత డబ్బు ఎవరిచ్చారని అడిగాను. ‘దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి.. ఎర్ర గంగిరెడ్డికి ఇస్తే ఆయన నాకు ఇచ్చాడు’ అని సునీల్‌ చెప్పాడు. ఆ తర్వాత వివేకానందరెడ్డిని హత్య చేయాలా? వద్దా? అనేది నిర్ధారించుకోవడానికి నేను సునీల్‌ను సంప్రదించాను. అతను నన్ను ఎర్ర గంగిరెడ్డి ఇంటికి తీసుకెళ్లి, శివశంకర్‌రెడ్డికి ఫోన్‌ చేశాడు. శివశంకర్‌రెడ్డి నాతో ఫోన్లో మాట్లాడుతూ.. ‘ఎర్ర గంగిరెడ్డి ఎలా చెబితే అలా చేయండి. మేం ఉన్నామని చెప్పాం కదా. మళ్లీ అనుమానం ఎందుకు?’ అని ప్రశ్నించారు.

డబ్బులు కావాలంటే అడగమన్నారు..

* వివేకా హత్య కేసు దర్యాప్తు సీబీఐ చేతుల్లోకి వెళ్లిన తర్వాత నేను, సునీల్‌, ఉమాశంకర్‌రెడ్డి... ఈశ్వరయ్యతోటలో కడప ఎంపీ వై.ఎస్‌.అవినాష్‌రెడ్డి తండ్రి వై.ఎస్‌.భాస్కర్‌రెడ్డిని, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిని కలిశాం. సీబీఐకి కేసు అప్పగించారు కదా.. మా పరిస్థితి ఏంటని అడిగాం. ‘మేం చూసుకుంటాం లే. ఇబ్బంది లేదు. డబ్బులేవైనా కావాలంటే అడగండి ఇస్తాం’ అని వారు మాతో అన్నారు.

* 2020 మార్చి 3న దిల్లీలో విచారణకు హాజరు కావాలంటూ సీబీఐ నాకు నోటీసిచ్చింది. దాన్ని పట్టుకుని బయపురెడ్డి ఇంట్లో శివశంకర్‌రెడ్డిని కలిశాను. ‘సీబీఐ వాళ్లు ఎంత కొట్టినా మా పేర్లు బయటపెట్టకు. నీకు కావాల్సినంత డబ్బిస్తాం. జీవితం సెటిల్‌ చేస్తాం. నీతో పాటు భరత్‌యాదవ్‌ కూడా దిల్లీ వస్తాడు. సీబీఐ అధికారులు నిన్ను ఏం అడుగుతున్నారో ఆ వివరాలు మాకు చెబుతాడు’ అని శివశంకర్‌రెడ్డి, బయపురెడ్డి, విద్యారెడ్డిలు నాతో చెప్పారు. నాలుగైదు రోజులపాటు భరత్‌ నాతోపాటు దిల్లీలోనే ఉన్న తర్వాత సీబీఐ అధికారులకు అనుమానం వస్తుందేమోనని పులివెందులకు వచ్చేశాడు. నేను దిల్లీలో రెండున్నర నెలలున్నా సీబీఐ అధికారులకు నిజం చెప్పలేదు. పులివెందులకు తిరిగొచ్చిన తర్వాత నన్ను కలిసి దిల్లీలో సీబీఐ అధికారులతో ఏం చెప్పావు? అని ఆరా తీశారు.

వాంగ్మూలం ఏమిచ్చావని శివశంకర్‌రెడ్డి అడిగారు

కడపలో సీబీఐ అధికారులు విచారించినప్పుడు వారితో నిజం చెప్పాను. తర్వాత ప్రొద్దుటూరు కోర్టులో న్యాయమూర్తి ఎదుట అదే విషయమై వాంగ్మూలం ఇచ్చాను. తర్వాత భరత్‌యాదవ్‌, శివశంకరెడ్డి నన్ను కలిశారు. వాంగ్మూలంలో ఏం చెప్పావని అడిగారు. అయితే ప్రాణభయంతో వారికి నిజం చెప్పలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల గురించి తప్ప ఇంకేమీ చెప్పలేదన్నాను.

అవినాష్‌రెడ్డి రమ్మంటున్నారని పిలిచారు

కడప ఎంపీ వై.ఎస్‌.అవినాష్‌రెడ్డి.. తోట దగ్గరకు రమ్మంటున్నారంటూ ఓ రోజు భరత్‌ యాదవ్‌ నన్ను పిలిచాడు. నేను వెళ్లలేదు. ఆ తర్వాత భరత్‌, పులివెందులకు చెందిన న్యాయవాది ఓబుల్‌రెడ్డి నన్ను హెలిప్యాడ్‌ వద్దకు పిలిచారు. అక్కడికి వెళ్లిన తర్వాత ఓబుల్‌రెడ్డి నాతో మాట్లాడుతూ.. ‘నువ్వు న్యాయమూర్తి ఎదుట ఇచ్చిన వాంగ్మూలం యథాతథంగా నాతో చెప్పు’ అని అడిగారు. ఎమ్మెల్సీ ఎన్నికల గురించి మాత్రమే చెప్పానని సమాధానమిచ్చాను. ‘నువ్వు నాకు నిజం చెప్పావో.. అబద్ధం చెప్పావో తెలియదు కానీ జాగ్రత్తగా మసలుకో. అనవసరపు మాటలు మాట్లాడకు’’ అని ఓబుల్‌రెడ్డి నన్ను హెచ్చరించారు. తర్వాత పులివెందులలో సునీల్‌యాదవ్‌, ఉమాశంకర్‌రెడ్డి తరఫు న్యాయవాదులు నా వాంగ్మూలాన్ని బహిర్గతం చేశారు. అప్పుడు భరత్‌ నా ఇంటికొచ్చి ‘నువ్వు వాళ్ల మీద చెప్పి.. చాలా పెద్ద తప్పు చేశావ్‌. వాళ్లు నిన్ను వదలరు. చంపేస్తారు. ప్రెస్‌మీట్‌ పెట్టి ఇప్పటి వరకూ చెప్పిందంతా అబద్ధమని చెప్పు’ అని అన్నాడు. నన్ను చంపేస్తామని ఈ రోజుకీ బెదిరిస్తున్నారు. భద్రత కల్పించాలని సీబీఐ ఎస్పీ, కడప ఎస్పీకి లేఖ రాశాను. కడప ఎస్పీ పులివెందుల పోలీసులకు ఆ విషయం చెప్పారు. అయినా వారు నా భద్రత గురించి పట్టించుకోవట్లేదు.

ఎంపీ ఎన్నికల్లో గెలిస్తే నీకు డబ్బులిస్తానన్నారు

వివేకాను హత్య చేసిన రోజు రాత్రి గంగిరెడ్డి బెంగళూరు భూ వివాదం సెటిల్‌మెంట్‌కు సంబంధించిన డబ్బులివ్వాలని వివేకాను అడిగారు. ‘ఆ డబ్బులు ఎందుకు అడుగుతావ్‌. నీకు ఇచ్చేవైతే ఇచ్చేస్తాను కదా! ఎంపీ ఎన్నికలు వస్తున్నాయి. దానిలో పెడితే ఎక్కువ వస్తాయి. అందులో గెలిస్తే నీకు డబ్బులిస్తా’’ అని వివేకా గంగిరెడ్డితో అన్నారు. వివేకాను అంతమొందించిన తర్వాత వై.ఎస్‌.రాజారెడ్డి ఆసుపత్రిలోని బాత్‌రూమ్‌లోకి వెళ్లి నా దుస్తులపై పడిన రక్తపు మరకల్ని, ముఖం, కాళ్లూ, చేతులూ కడుక్కున్నా.

- షేక్‌ దస్తగిరి

ఇదీ చూడండి: Govt Jobs: ఒకటికి మించి పోస్టులకు ఎంపికైతే.. ప్రభుత్వం పక్కా ప్రణాళిక

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.