SSC Paper Leak in AP : ఏపీలో పదో తరగతి పరీక్షలు కొనసాగుతున్నాయి. అయితే ప్రశ్నాపత్రాలు లీకేజీ వార్తలు కలకలం రేపుతున్నాయి. పరీక్షలు ప్రారంభమైన రోజునుంచే ప్రశ్నపత్రాలు లీకైనట్లు వదంతులు రాగా.. అధికారులు విచారణ చేపట్టి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. తాజాగా ఈ రోజు సత్యసాయి జిల్లా ఆమడగూరు పాఠశాల నుంచి పదో తరగతి ఆంగ్లం పేపర్ లీకైంది. ఉదయం 10 గంటలకే వాట్సాప్‌లో ప్రశ్నాపత్రం వైరల్ అయింది.
10th Paper Leak in AP : కరోనా కారణంగా రెండేళ్ల తర్వాత పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి.. అయినా ప్రభుత్వం కనీస జాగ్రత్తలు పాటించడం లేదు. పరీక్ష ప్రారంభం కాగానే ప్రశ్నాపత్రాలు బయటకు వచ్చేస్తున్నాయి. ఈ లీక్‌లను నియంత్రించడంలో అధికార యంత్రాంగం విఫలమవుతోంది. మొదటిరోజు తెలుగు ప్రశ్నాపత్రం సామాజిక మాధ్యమాల్లో రాగా.. రెండో రోజు హిందీ పేపర్ బయటకు వచ్చేసింది. తాజాగా.. ఇవాళ జరుగుతున్న ఆంగ్లం ప్రశ్నాపత్రం లీకైంది.
పేపర్ లీక్ అవుతున్నా.. అడ్డుకోవడంలో మాత్రం అధికారులు విఫలమవుతున్నారని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలకు అన్యాయం జరుగుతుందని వాపోతున్నారు. అధికారులు సత్వరమే చర్యలు తీసుకుని పేపర్ లీక్‌ను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి :