ETV Bharat / city

రోడ్డు విస్తరణను అడ్డుకున్న వైకాపా కౌన్సిలర్లు.. చెప్పుతో కొట్టుకున్న తెదేపా నేత - proddatur

proddatur road works: ఏపీలోని వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా గవిని కూడలిలో ఉన్న జెండా చెట్టును తొలగింపును వైకాపా కౌన్సిలర్లు, నేతలు అడ్డుకున్నారు. దాంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. ముందస్తు సమాచారం లేకుండా ప్రజల అభిప్రాయాలు తీసుకోకుండా జెండా చెట్టును ఎలా కూల్చివేస్తారంటూ వైకాపా మైనార్టీ కౌన్సిలర్లు మండిపడ్డారు. ఇంత గొడవ జరుగుతున్నా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పట్టించుకోకపోవటం బాధాకరమన్నారు.

proddatur road works
వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో తీవ్ర ఉద్రిక్తత
author img

By

Published : Jun 27, 2022, 8:55 PM IST

proddatur road works: ఏపీలోని వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు రోడ్డు విస్తరణ పనుల్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. గవిని కూడలి నుంచి ఎర్రగుంట్ల బైపాస్ వరకూ.. రోడ్డు విస్తరణ పనులు తలపెట్టారు. ఇందులో భాగంగా జెండా చెట్టు తొలగింపునకు వైకాపా కౌన్సిలర్లు, నాయకులే అడ్డుతగిలారు. పోలీసులు వారిని అరెస్టు చేసి.. ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్​కు తరలించారు. వైకాపా కౌన్సిలర్ల మద్దతుదారులు ఠాణా వద్దకు చేరుకున్నారు.

రోడ్డు విస్తరణ అడ్డుకున్న వైకాపా కౌన్సిలర్లు.. చెప్పుతో కొట్టుకున్న తెదేపా నేత

ముందస్తు సమాచారం లేకుండా ప్రజల అభిప్రాయాలు తీసుకోకుండా జెండా చెట్టును ఎలా కూల్చివేస్తారంటూ వైకాపా మైనార్టీ కౌన్సిలర్లు మండిపడ్డారు. అడ్డుకోబోయిన తమను అరెస్టు చేసి స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అధికార పార్టీలో ఉన్నామో.. లేక ప్రతిపక్షంలో ఉన్నమో అర్థం కావటం లేదన్నారు. ఇంత గొడవ జరుగుతున్నా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పట్టించుకోకపోవటం బాధాకరమన్నారు.

చెప్పుతో కొట్టుకున్న తెదేపా నేత : ప్రొద్దుటూరు గవిని కూడలిలో జెండాచెట్టు కూల్చివేతపై.. తెదేపా మాజీ కౌన్సిలర్ తనయుడు ఖలీల్ చెప్పుతో కొట్టుకుని నిరసన తెలిపారు. ముస్లిం ఓట్లతో రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన రాచమల్లు ప్రసాదరెడ్డి ఇప్పుడు తమ మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.