Tension In Amaravati Farmers Padayatra: ఆంధ్రప్రదేశ్ కొవ్వూరు నియోజకవర్గ చాగల్లులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హోంమంత్రి తానేటి వనిత అనుచరులు.. అమరావతి రైతుల పాదయాత్ర మార్గంలో నల్లబెలూన్లు పట్టుకుని నిరసన తెలిపారు. పోలీసులు వైకాపా శ్రేణులను రోడ్డు మీద వరకూ అనుమతించి నిరసన తెలిపేందుకు వీలుగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. వైకాపా శ్రేణులు రహదారికి ఓ వైపు నల్లబెలూన్లతో నిల్చుంటే.. మరోవైపు పార్టీ జెండాలతో తెదేపా, భాజపా, జనసేన కార్యకర్తలు నిలబడ్డారు. పరస్పరం కవ్వింపు చర్యలకు దిగారు.
స్థానిక మహిళలు పాదయాత్రికులకు స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున చాగల్లు సెంటర్‌కు చేరుకున్నారు. పోలీసులు స్థానిక మహిళలను వెనక్కి పంపించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, అఖిల పక్షాల నేతలకు మధ్య తోపులాట జరిగింది. పాదయాత్రకు మద్దతు తెలిపేందుకు వచ్చిన వారిని పోలీసులు నెట్టివేయటంతో పోలీసులు, అఖిలపక్ష కార్యకర్తల మధ్య స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది.
ఈ క్రమంలోనే అటువైపు వచ్చిన 108 వాహనం ఆ ఉద్రిక్తతలో చిక్కుకుంది. 108 వాహనం వెళ్లే మార్గంలో వైకాపా శ్రేణులు అడ్డుగా ఉండటంతో పోలీసులు వాహనాన్ని దారి మళ్లించి పంపారు.
ఇవీ చదవండి: మును'గోడు' పట్టని పార్టీలు.. ప్రచారాల్లో పరస్పర ఆరోపణలకే పరిమితం
ఇంకా తగ్గని ఆకలి బాధలు.. హంగర్ ఇండెక్స్‌లో భారత్‌కు 107 స్థానం!