ETV Bharat / city

కొత్త సచివాలయ భవన నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ సిద్ధం - hyderabad news

నూతన సచివాలయ భవన నిర్మాణం కోసం టెండర్ల ప్రక్రియకు రహదార్లు, భవనాల శాఖ పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. రూ.400 కోట్లతో అనుమతులు మంజూరు చేస్తూ... ఉత్తర్వులు జారీ చేసింది. టెండర్ల ప్రక్రియ చేపట్టేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు.

tenders for new secretariat in hyderabad

author img

By

Published : Aug 12, 2020, 4:36 AM IST

కొత్త సచివాలయ భవన నిర్మాణం కోసం టెండర్ల ప్రక్రియను చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. మంత్రివర్గ ఆమోదం నేపథ్యంలో కొత్త సచివాలయ భవన నిర్మాణానికి రహదార్లు, భవనాల శాఖ పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. రూ.400 కోట్లతో అనుమతులు మంజూరు చేస్తూ... ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రాథమిక అంచనాలుగా ఈ మొత్తాన్ని అధికారులు ప్రతిపాదించారు. దీంతో టెండర్ల ప్రక్రియ చేపట్టేందుకు కసరత్తు ప్రారంభించారు. ఆర్కిటెక్ట్​లు నిర్మాణ నమూనా... అంచనాలను ఖరారు చేసే పనిలో పడ్డారు. వీలైనంత త్వరగా టెండర్లు పిలిచేందుకు ఆర్ అండ్ బీ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ప్రక్రియ పూర్తయి నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారంలో నిర్మాణ సంస్థ ఎంపిక పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు.

ఇవీ చూడండి: కరోనా అనుమానం: ఫ్యానుకు ఉరివేసుకుని మహిళ ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.