ETV Bharat / city

సభాక్షేత్రంలోకి అస్త్రశస్త్రాలతో తెలుగుదేశం పార్టీ..!

ఏడాదిన్నర కాలంలో ప్రభుత్వ వైఫల్యాలు, రైతు సమస్యలు, ప్రజలపై వివిధ రూపాల్లో మోపుతున్న భారం, తదితర అంశాలపై ఏపీ ప్రభుత్వాన్ని అసెంబ్లీ వేదికగా నిలదీయాలని ప్రధాన ప్రతిపక్షం తెదేపా నిర్ణయించింది. శాసనసభలో మాట్లాడే అవకాశం దక్కకపొతే వాకౌట్ చేయటం... శాసనమండలికి సభ్యులు పూర్తిస్థాయిలో హాజరుకావటం వంటి వ్యూహరచనతో శీతాకాల సమావేశాల్లో పాల్గొనేందుకు సిద్ధం అయ్యింది. నాలుగు ప్రధాన డిమాండ్ల పరిష్కారంతో పాటు 15అంశాలపై చర్చకు అవకాశం కల్పిస్తూ.. కనీసం 10రోజులైనా సమావేశాలు నిర్వహించాలనే ప్రతిపాదనను బీఏసీ ముందు ఉంచనుంది.

author img

By

Published : Nov 29, 2020, 10:28 PM IST

telugudesam-party-mlas-ready-to-assembly-session
సభాక్షేత్రంలోకి అస్త్రశస్త్రాలతో తెలుగుదేశం పార్టీ..!

అసెంబ్లీ శీతాకాల సమావేశాలు కనీసం పదిరోజుల పాటు నిర్వహణ, ప్రజా సమస్యలు ప్రస్తావించడానికి ప్రశ్నోత్తరాలను నిర్వహించటం, వివిధ సమస్యలపై లఘు చర్చల నిర్వహణ, అసెంబ్లీ కవరేజీకి అన్ని మీడియా సంస్థలను అనుమతించాలనే నాలుగు ప్రధాన డిమాండ్లను పరిష్కరించాలని... ఏపీలో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తోంది.వరుస విపత్తులు-రైతు సమస్యలు, టిడ్కో ఇళ్ల పంపిణీపై నిర్లక్ష్యం, అక్రమ వసూళ్లు... బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలపై దాడులు, దేవాలయాలపై దాడులు, పోలవరం ప్రాజెక్టు పనులపై నిర్లక్ష్యం - ఎత్తు తగ్గింపు ప్రయత్నాలు, వైకాపా అవినీతి కుంభకోణాలు, ఇసుక దోపిడీ, మద్యం మాఫియా, రాజధాని రైతుల ఆందోళనలు వంటి అంశాలపై సభావేదికగా సమగ్ర చర్చ జరగాలని తెదేపా డిమాండ్ చేస్తోంది.

సభావేదికగానే ఎండగడతామని ధీమా

కరోనా బాధితులను ఆదుకోవడంలో వైఫల్యం, నిత్యావసరాల ధరల పెరుగుదల, పన్నుల పెంపు-పేదలపై భారం, రహదారుల మరమ్మతుల్లో నిర్లక్ష్యం, టోల్ విధింపు, పీపీఏల రద్దు, మూతపడుతున్న పరిశ్రమలు, పెరుగుతోన్న నిరుద్యోగం, సంక్షేమ పథకాల రద్దు, సబ్​ప్లాన్ల నిర్వీర్యం.. వంటివి చర్చనీయాంశాలుగా చేపట్టాలని తెదేపా శాసనసభాపక్షం నిర్ణయించింది. నూతన ఇసుక విధానం - మైనింగ్ దోపిడీ, నరేగా బిల్లుల చెల్లింపు నిలిపివేత, మితిమీరిన అప్పులు, దుబారా వ్యయం, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ వంటి అంశాలపై సభావేదికగానే ప్రభుత్వాన్ని ఎండగడతామని ధీమా వ్యక్తం చేస్తోంది.

బహిష్కరించాలన్న ప్రతిపాదన

గత సమావేశాల్లో ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం కల్పించని పరిణామాలను దృష్టిలో పెట్టుకుని.. ప్రభుత్వ వైఖరికి నిరసనగా సమావేశాల్ని బహిష్కరించాలన్న ప్రతిపాదన పార్టీ ఎమ్మెల్యేల్లో వ్యక్తమైంది. దీనిపై సభ్యులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. సమావేశాలకు వెళ్లకుండా ఉంటేనే మంచిదని కొందరు, వెళ్లాల్సిందేనని మరికొందరు అభిప్రాయపడ్డారు. మండలి సమావేశాలకు హాజరై, శాసనసభను బహిష్కరించి ‘మాక్‌ అసెంబ్లీ’ పేరుతో నిరసన నిర్వహించే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఒకే పార్టీ సభ్యులు మండలికి హాజరై, శాసనసభ సమావేశాల్ని బహిష్కరించడం సరికాదని కొందరు వారించారు. ఒకవేళ శానససభతో పాటు మండలి సమావేశాల్ని బహిష్కరిస్తే... ప్రజలపై భారం మోపే పలు బిల్లులను ప్రభుత్వం సులభంగా ఆమోదింపచేసుకుంటుందనే అభిప్రాయం వ్యక్తమైంది. ముఖ్యంగా ఆస్తిపన్ను పెంపు బిల్లుకు సంబంధించి అసెంబ్లీ సమావేశాల ముందే ఆర్డినెన్స్ తీసుకురావటం, ప్రజలపై విపరీత భారం మోపే యత్నాలపై గట్టిగా గళం వినిపించాలని తెదేపా యోచిస్తోంది.

అందుబాటులో ఉండాల్సిందే..

ప్రజా సమస్యలు, చర్చించాల్సిన అంశాలు చాలా ఉన్నందునా... కరోనా పేరుతో అసెంబ్లీ సమావేశాల్ని నాలుగు రోజులకే పరిమితం చేయడం సరికాదని తెదేపా శాసనసభాపక్షం స్పష్టం చేస్తోంది. శాసన మండలికి తెదేపా సభ్యులు సరిగా హాజరు కాకపోతే కోరం ఉన్న సమయాన్ని అదునుగా చూసుకుని ప్రభుత్వం వివాదాస్పద బిల్లుల్ని ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకునే అవకాశముందనే అంచనాకు తెలుగుదేశం వచ్చింది. మండలిలో సభ్యులు పూర్తి సమయం అందుబాటులో ఉండాల్సిందేనని అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే ఏ బిల్లునైనా మండలిలో అడ్డుకుని తీరుతామని ఎమ్మెల్సీలు స్పష్టం చేస్తున్నారు.

ర్యాలీగా సమావేశాలకు..

సమావేశాలు జరిగినన్ని రోజులూ సభ ప్రారంభానికి ముందు.. అసెంబ్లీ ఆవరణ బయట రోజుకో అంశంపై నిరసన కార్యక్రమం చేపట్టాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. సచివాలయం బయట ఉన్న అగ్నిమాపక కేంద్రం నుంచి ర్యాలీగా చంద్రబాబు అధ్యక్షతన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశాలకు వెళ్లనున్నారు.

ఇవీ చూడండి: బస్తీ పోరులో ఓటేయాలంటే ఈ నిబంధనలు తప్పనిసరి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.