ETV Bharat / city

సోమవారం తెలుగు రాష్ట్రాల రవాణాశాఖ అధికారుల భేటీ - సోమవారం తెలుగు రాష్ట్రాల రవాణాశాఖ అధికారుల భేటీ

తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల ర‌వాణా శాఖ అధికారులు సోమవారం భేటీ కానున్నారు. కిలోమీటర్ బేసిస్‌లో ఆర్టీసీ అధికారుల ఒప్పందం ఇరురాష్ట్రాల ఆర్టీసీ అధికారులు సమావేశమై చర్చించనున్నారు.

సోమవారం తెలుగు రాష్ట్రాల రవాణాశాఖ అధికారుల భేటీ

author img

By

Published : Sep 12, 2020, 12:53 PM IST

Updated : Sep 12, 2020, 2:30 PM IST

తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల ర‌వాణా శాఖ అధికారులు సోమవారం భేటీ కానున్నారు. హైద‌రాబాద్‌లో జ‌రిగే ఈ స‌మావేశానికి ఇరు రాష్ట్రాల ఆర్టీసీ ఎండీలు, అధికారులు హాజ‌రుకానున్నారు. కిలోమీటర్ బేసిస్‌లో ఆర్టీసీ అధికారుల ఒప్పందం ఇరురాష్ట్రాల ఆర్టీసీ అధికారులు సమావేశమై చర్చించనున్నారు. లాక్‌డౌన్ కార‌ణంగా తెలుగురాష్ట్రాల మ‌ధ్య ఆర్టీసీ రాక‌పోక‌లు నిలిచిపోయిన విష‌యం తెలిసిందే. కేవ‌లం అత్య‌వ‌స‌ర స‌ర్వీసుల‌కు మాత్ర‌మే ప్రస్తుతం ఇరు రాష్ట్రాల మ‌ధ్య అనుమ‌తి ఉంది.

మంత్రుల స్థాయి భేటీ లేదు:

తొలత ఇరురాష్ట్రాల రవాణాశాఖ మంత్రులు సమావేశమవుతారనే వార్తలు రాగా.. మంత్రుల స్థాయి భేటీ లేదని తెలంగాణ రవాణా శాఖ మంత్రి అజయ్‌కుమార్‌ స్పష్టం చేశారు.

అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులపై మంత్రుల స్థాయి భేటీ లేదు. ఏపీ రవాణాశాఖ మంత్రితో ఎలాంటి అధికారిక భేటీ నిర్ణయం కాలేదు. కిలోమీటర్ బేసిస్‌లో ఆర్టీసీ అధికారుల ఒప్పందం తర్వాతే మంత్రుల భేటీ జరుగుతుంది. ప్రస్తుతం అధికారుల స్థాయి సమావేశాలు కొనసాగుతుంటాయి. - మంత్రి అజయ్‌కుమార్, తెలంగాణ రవాణా శాఖ మంత్రి.‌

ఇవీ చూడండి: గ్రేటర్ ఎన్నికల్లో విజయం కోసం కాంగ్రెస్​ వ్యూహరచన

Last Updated : Sep 12, 2020, 2:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.