ETV Bharat / city

Telangana News Today : తెలుగు రాష్ట్రాల్లోని పల్లె కుటుంబాలపైనే అత్యధిక అప్పుల భారం - telugu villages debt

Telangana News Today : అప్పుల ఊబిలో కూరుకుపోయిన కుటుంబాలు అత్యధికంగా తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నాయని.. ముఖ్యంగా అవి గ్రామాల్లోనే ఉన్నాయని నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ నిర్వహించిన సర్వేలో తేలింది. తెలంగాణలో 30.2% పట్టణ, 67.2% గ్రామీణ కుటుంబాలు అప్పుల ఊబిలో కూరుకుపోయినట్లు వెల్లడించింది.

Telangana News Today
Telangana News Today
author img

By

Published : Nov 30, 2021, 7:35 AM IST

Telangana News Today : గ్రామీణ ప్రాంతాల్లో అప్పుల ఊబిలో కూరుకుపోయిన అత్యధిక కుటుంబాలు తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నాయి. నేషనల్‌ శాంపిల్‌ సర్వే ఆర్గనైజేషన్‌ నిర్వహించిన ఆల్‌ ఇండియా డెట్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సర్వే (ఏఐడీఐఎస్‌) 2018 ప్రకారం దేశవ్యాప్తంగా పట్టణప్రాంతాల్లో 22.4%, గ్రామీణ ప్రాంతాల్లో 35% కుటుంబాలు అప్పుల్లో కూరుకుపోయాయి. అందులో తెలంగాణలో 30.2% పట్టణ, 67.2% గ్రామీణ కుటుంబాలు ఉండగా... ఆంధ్రప్రదేశ్‌లో 44.9% పట్టణ, 62.8% గ్రామీణ కుటుంబాలపై ఈ భారం పడింది. అత్యధిక అప్పుల భారం ఉన్న పట్టణ కుటుంబాల్లో కేరళ ప్రథమస్థానంలో ఉంది. అదే గ్రామీణ అప్పుల్లో తెలంగాణ మొదటి, ఆంధ్రప్రదేశ్‌ రెండోస్థానంలో ఉన్నాయి.

రాష్ట్రాలకు తగ్గిపోతున్న పన్నుల్లో వాటా

village families debt telangana : కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రాలకు వచ్చే పన్నుల వాటా ఏటా తగ్గుతూ వస్తోంది. 2018-19లో ఏపీకి రూ.32,787.03 కోట్ల వాటా రాగా 2019-20 నాటికి అది రూ.28,242.39 కోట్లు, 2020-21నాటికి రూ.24,460.59 కోట్లకు తగ్గిపోయింది. ఇదే సమయంలో తెలంగాణకు వరుసగా రూ.18,560.88 కోట్లు, రూ.15,987.59 కోట్లు, రూ.12,691.62 కోట్లు మాత్రమే వచ్చింది. జాతీయస్థాయిలోనూ అన్ని రాష్ట్రాలకూ కలిపి 2018-19లో రూ.7,61,454 కోట్లు, 2019-20లో రూ.6,50,677 కోట్లు, 2020-21లో రూ.5,94,996 కోట్లు విడుదలయ్యాయి.

  • ఇదీ చదవండి

తెలంగాణలో 13.74 శాతం ప్రజలు పేదలని నీతి ఆయోగ్‌ విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. దేశంలోని వివిధ రాష్ట్రాలు, జిల్లాల స్థితిగతులను తెలుసుకోవడానికి నీతిఆయోగ్‌ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-4 నిర్వహించింది. ఇప్పటివరకు పేదరికాన్ని ఆదాయం, వినియోగం, ఖర్చు ఆధారంగా అంచనా వేస్తూ రాగా... ఈసారి విద్య, వైద్యం, ప్రజలకు అందుబాటులో ఉన్న మౌలికవసతుల ఆధారంగా మదించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.