ETV Bharat / city

Alternative crops in Telangana: 'ప్రత్యామ్నాయ పంటల సాగుకు అవే ప్రధాన సమస్యలు' - marketing and climate issues are main obstacles for alternate crop cultivation

Alternative crops in Telangana: రాష్ట్రంలో పెరిగిన వరి, పత్తి సాగు విస్తీర్ణంతో దిగుబడులు అంచనాలకు మించి పెరిగాయి. ఓ వైపు ఉప్పుడు బియ్యాన్ని కొనేది లేదని కేంద్రం సైతం స్పష్టం చేయడంతో కల్లాల్లో, కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. దీంతో ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలని ప్రభుత్వం అధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. కానీ సంప్రదాయ పంటలకు వాతావరణం అనుకూలించినంతగా ప్రత్యామ్నాయ పంటలకు అనుకూలిస్తుందా అనేది ఆలోచించాల్సిన విషయం. ఈ అంశంపై నిన్న హైదరాబాద్​లో జరిగిన సదస్సులో రైతులు, వ్యవసాయ, ఆర్థిక శాస్త్రవేత్తలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు.

alternate crops cultivation
ప్రత్యామ్నాయ పంటల సాగుపై సదస్సు
author img

By

Published : Dec 15, 2021, 7:33 AM IST

Alternative crops in Telangana: ప్రత్యామ్నాయ పంటలకు మార్కెటింగ్‌తో పాటు నిల్వ, వాతావరణం ప్రధాన సమస్యలని రైతులు, వ్యవసాయ, ఆర్థికశాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. ఈ విధానం అమలు ప్రణాళికాబద్ధంగా జరగాలని, యాసంగికే కాక రెండు సీజన్లకూ కలిపి ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ప్రత్యామ్నాయ పంటలకు సెప్టెంబరు ఆఖరు లేదా అక్టోబరులో విత్తనం నాటాలని చెప్పారు. ఆలస్యమైతే ఉష్ణోగ్రతలు తగ్గి విత్తనం మొలకెత్తదని, జనవరిలో వేస్తే నీటి సమస్య తలెత్తుతుందని స్పష్టం చేశారు. పంటల మార్పిడిలోనూ స్థిరత్వం అవసరమని, ఈ సీజన్‌లో ఒక పంట, మరో ఏడాది ఇంకో పంట అంటే గందరగోళం ఏర్పడుతుందన్నారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పంటల సాగు అంశంపై రైతు స్వరాజ్యవేదిక ఆధ్వర్యంలో సదస్సు జరిగింది.

హైదరాబాద్‌లో మంగళవారం జరిగిన ఈ సదస్సుకు వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్లు, డైరెక్టర్లుగా పనిచేసిన జలపతిరావు, రాజిరెడ్డి, భాస్కర్‌రెడ్డి, ప్రసాదరావు, వి.ఎం.రెడ్డి, వ్యవసాయ ఆర్థిక శాస్త్రవేత్త డి.నరసింహారెడ్డి, కేంద్రీయ వర్సిటీ ఆచార్యులు రమణమూర్తి, వేదిక ప్రతినిధులు కిరణ్‌కుమార్‌ విస్సా, కన్నెగంటి రవి, తెజస అధ్యక్షుడు కోదండరాం, రైతుసంఘాల నేతలు సారంపల్లి మల్లారెడ్డి, కోదండరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సదస్సులో వివిధ జిల్లాల రైతులు మాట్లాడారు. వారి నుంచి వ్యక్తమైన అభిప్రాయాలు.. సూచనలు ఇవీ..

సదస్సులో మాట్లాడుతున్న మహిళా రైతు లక్ష్మమ్మ
  • గత పదేళ్లలో రాష్ట్రంలో వరి, పత్తి సాగు విస్తీర్ణం భారీగా పెరిగింది. యంత్రాల అందుబాటు, సులువైన సాగు, కనీసధరకు కొనుగోలు తదితరాలు వరికి అనుకూలించాయి.
  • గతంలో వానాకాలంలో సన్న, యాసంగిలో దొడ్డు రకం వేేసేవారు. దోమపోటుతో సన్నరకం దెబ్బతినడంతో రెండు సీజన్లలోనూ దొడ్డు సాగు పెరిగింది.
  • ఇప్పటివరకు వరి వేసినచోట హఠాత్తుగా వేరే పంట సాగు సాధ్యమా అనేది పరిశీలించాలి, నేల స్వభావాన్నీ పరిగణనలోకి తీసుకోవాలి.
  • మొక్కజొన్న సహా కొన్ని పంటలకు చిలకలు, కోతుల బెడద ఎక్కువ. వరికి ఇలాంటివి ఉండవు.
  • ప్రభుత్వం రాయితీతో వేరే పంటల విత్తనాలు సరఫరా చేయడంతో చిరుధాన్యాల సాగు దెబ్బతింది.
  • 18 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉంటే వేరుసెనగ మొలకెత్తదు. నవంబరు, డిసెంబరులో ఉష్ణోగ్రత 5-8 డిగ్రీల వరకు తగ్గుతుంది. దీన్నీ పరిగణించాలి.
  • యాసంగిలో సెనగ సహా మరికొన్ని పంటలను భారీగా వేయాలని ప్రభుత్వం సూచించింది. అయితే వీటికి మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించడం ప్రధానం.

ఇదీ చదవండి: Sugarcane farmers problems: చెరుకును వెంటాడుతున్న కష్టాలు.. తక్కువ ధరకే తెగనమ్ముతున్న రైతులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.