ETV Bharat / city

Dh on Omicron Variant: ఒమిక్రాన్ ముప్పు ఎప్పుడైనా రావొచ్చు.. బీ కేర్​ఫుల్ - Corona third wave

Dh on Omicron Variant: కరోనా పూర్తిగా నిర్మూలన కాలేదని.. ఎప్పుడైనా మూడో ముప్పు వచ్చే ప్రమాదముందని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాస్ తెలిపారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ అప్రమత్తంగా లేకపోతే కొత్త వేరియంట్ ఒమిక్రాన్, మూడో ముప్పుపై వస్తున్న అసత్య ప్రచారాలే నిజమవుతాయని హెచ్చరించారు. ఇవాళ్టి నుంచి మాస్కు ధరించని వారికి రూ.1000 జరిమానా విధిస్తామని చెప్పారు.

DH on Omicron
DH on Omicron
author img

By

Published : Dec 2, 2021, 1:50 PM IST

Updated : Dec 2, 2021, 4:41 PM IST

మాస్కు ధరించకపోతే వెయ్యి రూపాయల ఫైన్

Dh on Omicron Variant: కొవిడ్ కొత్త వేరియంట్ కలకలంరేపుతున్న నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. రాష్ట్రవ్యాప్తంగా మాస్కులు లేకుండా కనిపించే వారికి రూ. 1,000 జరిమానా విధించాలని పోలీస్​ శాఖకు సూచించినట్టు ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాస రావు ప్రకటించారు. వ్యాక్సినేషన్​పై ప్రభుత్వ అనుమతితో కఠిన నిబంధనలు రూపొందించనున్నట్టు ఆయన స్పష్టం చేశారు. హోటల్, రెస్టారెంట్, పార్కుల వంటి ప్రదేశాలకు వెళ్లేందుకు వ్యాక్సిన్ వేసుకున్న ధ్రువపత్రాన్ని తప్పనిసరి చేయనున్నామన్న ఆయన... టీకా తీసుకోని వారిని భవిష్యత్తుల్లో పబ్లిక్ ప్రదేశాలకు అనుమతించబోమని పేర్కొన్నారు.

దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన 35 ఏళ్ల మహిళలకు కొవిడ్ పాజిటివ్​గా నిర్ధరణ అయ్యిందన్న డీహెచ్ ఆమెను టిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామన్నారు. మహిళ శాంపిళ్లను జీనోం సీక్వెన్సింగ్ కోసం పంపామన్న డీహెచ్... సదరు మహిళకు ఒమిక్రాన్ సోకిందో లేదో తెలియాలంటే మరో రెండు రోజులు ఆగాల్సి ఉందని స్పష్టం చేశారు. ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం గుర్తించిన రిస్క్ దేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన 325 మంది ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తున్నామన్నారు.

Dh on Omicron Variant: కరోనా మూడో ముప్పు ఎప్పుడైనా వచ్చే అవకాశముందని డీహెచ్ శ్రీనివాస్ తెలిపారు. ఒమిక్రాన్ నివారణకు ప్రతిఒక్కరు తమ వంతు ప్రయత్నం చేయాలని కోరారు. కొత్త వేరియంట్​ కట్టడిపై ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సుదీర్ఘంగా చర్చించినట్లు చెప్పారు. ఒమిక్రాన్ వేరియంట్​ బారిన పడకుండా ఉండాలంటే.. జాగ్రత్తగా ఉండటమొక్కటే మార్గమని అన్నారు. మాస్కు ధరించి, భౌతికదూరం పాటించాలని సూచించారు. ఇవాళ్టి నుంచి మాస్కు ధరించని వారికి రూ.1000 జరిమానా విధిస్తామని హెచ్చరించారు.

Omicron cases: ప్రజలు కొవిడ్ నిబంధనలు తప్పక పాటించాలని, అందరు కరోనా టీకా రెండు డోసులు వేసుకోవాలని డీహెచ్ సూచించారు. రాష్ట్రంలో 25 లక్షల టీకా డోసులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఇక నుంచి వ్యాక్సినేషన్ తప్పనిసరి చేసే ప్రతిపాదనలు చేస్తున్నట్లు వెల్లడించారు. జాగ్రత్తలు పాటించకపోతే ఒమిక్రాన్​పై, కరోనా మూడో ముప్పుపై ఇప్పుడు జరుగుతున్న అసత్య ప్రచారాలే నిజమవుతాయన్నారు. విద్యాసంస్థల్లో పలువురి విద్యార్థులకు కరోనా పాజిటివ్ వస్తోందని.. వైరస్ ఇంకా పూర్తిగా నిర్మూలన కాలేదని స్పష్టం చేశారు.

Omicron Variant : ఒమిక్రాన్ ఏ క్షణంలోనైనా భారత్​లోకి రావొచ్చని డీహెచ్ అన్నారు. బుధవారం రోజున యూకే, సింగపూర్ నుంచి వచ్చిన 325 ప్రయాణికులకు టెస్ట్ చేశామని అందులో ఒకరికి పాజిటివ్ వచ్చిందని ఆ వ్యక్తిని టిమ్స్​లో చేర్పించామని తెలిపారు. ఆ వ్యక్తి టెస్ట్ రిపోర్టును జీనోమ్​కు పంపామని.. అది ఒమిక్రాన్​ వేరియంటా కాదా అనేది రెండ్రోజుల్లో తేలుతుందని చెప్పారు.

"ఒమిక్రాన్ ముప్పు త్వరలో తెలంగాణకూ వ్యాపిస్తుంది. కానీ మనం చాలా అప్రమత్తంగా ఉండి దాన్ని కట్టడి చేద్దాం. కొత్త వేరియంట్ సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నారు. వ్యాక్సినేషన్ తక్కువగా జరుగుతున్న ప్రాంతాల్లో ఎక్కువగా వ్యాపించే ప్రమాదముంది. అందుకే టీకా రెండు డోసులు తీసుకోని వాళ్లంతా వెంటనే వ్యాక్సిన్ తీసుకోవాలి. మూడు రోజుల్లో 3 దేశాల నుంచి 26 దేశాలకు విస్తరించింది. కొత్త వేరియంట్ డెల్టా కంటే ప్రమాదకరమని, దానికంటే 6 రెట్లు వేగంగా విస్తరిస్తోందని నిపుణులు చెబుతున్నారు. అందుకే వ్యాక్సిన్ తీసుకోండి.. ప్రాణాలు కాపాడుకోండి. ప్రభుత్వానికి, ఆరోగ్య అధికారులకు సహకరించండి. అందరం కలిసి పని చేస్తేనే కరోనా మహమ్మారి, ఒమిక్రాన్ వేరియంట్ పని పట్టగలం. మన రాష్ట్రం నుంచి ఆ మహమ్మారి పారద్రోలగలం."

- శ్రీనివాస్, ప్రజారోగ్య సంచాలకులు

ఇవీ చదవండి :

కరోనా కొత్త వేరియంట్ విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డీహెచ్​ శ్రీనివాసరావు తెలిపారు. ఒమిక్రాన్​ను ఎదుర్కునేందుకు ప్రభుత్వం అన్ని రకాల సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు(corona cases telangana) నిలకడగానే ఉన్నాయని.. ప్రజలంతా కొవిడ్​ నిబంధనలు పాటించాలని సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

Shamshabad Airport Covid Alert: కొత్త కరోనా వేరియంట్ ఒమిక్రాన్ నేపథ్యంలో విదేశాల నుంచి భారత్‌కు వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు అమలవుతోన్నాయి. విదేశీ మంత్రిత్వ శాఖ ఆదేశాలకు 11 దేశాల నుంచి హైదరాబాద్ వచ్చే ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్, ఆర్‌టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆ పరీక్షల ఫలితాల్లో పాజిటివ్ వస్తే గచ్చిబౌలి టిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స, క్వారంటైన్‌లోకి పంపుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

Omicron Variant Cases: ఒమిక్రాన్​.. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కొత్త రకం. దక్షిణాఫ్రికా కొత్త వేరియంట్​పై సమాచారం ఇచ్చే వరకు ఎవరికీ తెలియదు. కానీ, ఈ వైరస్​ వ్యాప్తి అక్టోబర్​లోనే ప్రారంభమైనట్లు స్పష్టమవుతోంది. నైజీరియాలో అక్టోబర్​లో సేకరించిన నమూనాల్లో కొత్త వేరియంట్​ బయటపడింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

Omicron Variant: ఒమిక్రాన్ వేరియంట్ క్రమంగా విస్తరిస్తూ ప్రపంచాన్ని కలవరపాటుకు గురిచేస్తోంది. అమెరికా, దక్షిణ కొరియా సహా పలు దేశాల్లో బుధవారం తొలిసారి ఈ రకం వైరస్ వెలుగుచూసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

Last Updated : Dec 2, 2021, 4:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.