ETV Bharat / city

ఈటీవీ భారత్​ ముఖ్యాంశాలు - topnews

TELUGU LATEST TOP NEWS
TELUGU LATEST TOP NEWS
author img

By

Published : Dec 21, 2021, 5:56 AM IST

Updated : Dec 21, 2021, 10:01 PM IST

21:53 December 21

టాప్​ న్యూస్​@ 10PM

  • 'అర్థం చేసుకుంటే.. ఇండియా బెస్ట్ '

CM KCR in Christmas Celebrations: హైదరాబాద్‌ ఎల్బీస్టేడియంలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న సీఎం కేసీఆర్​.. రాష్ట్ర ప్రజలందరికీ పండగ శుభాకాంక్షలు తెలిపారు. వేడుకల్లో భాగంగా కేక్​ కట్​ చేశారు. భయంకరమైన కరోనా వల్ల గతేడాది క్రిస్మస్​ వేడుకలు జరుపుకోలేకపోయామన్నారు. మళ్లీ ఇలా అందరినీ కలుసుకుని పండుగ జరుపుకోవటం సంతోషంగా ఉందని తెలిపారు.

  • హైదరాబాద్​కు రాష్ట్రపతి

President hyderabad tour: రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్ దక్షిణాది విడిది పర్యటన ఖరారైంది. ఈ నెల 29న రాష్ట్రానికి రాష్ట్రపతి రానున్నారు. వచ్చే నెల మూడో తేదీ వరకు శీతాకాల విడిది చేయనున్నారు. రాష్ట్రపతి పర్యటన కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది. రామ్​నాథ్ కోవింద్ పదవీకాలం వచ్చే జూలైతో ముగియనున్న నేపథ్యంలో ఇదే చివరి దక్షిణాది విడిది కానుంది.

  • యూట్యూబ్​లో చూసి భార్యకు ప్రసవం​..!

Man Tries Delivery To Wife: యూట్యూబ్​లో చూసి గర్భవతిగా ఉన్న భార్యకు ఆపరేషన్ చేశాడు ఓ ప్రబుద్ధుడు. ఈ ఘటనలో శిశువు మృతిచెందగా, భార్య పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన తమిళనాడులో జరిగింది.

  • 'పుష్ప' టీమ్​కు అక్షయ్​ కంగ్రాట్స్​

కొత్త సినిమా అప్డేట్స్​ వచ్చాయి. ఇందులో 'పుష్ప', 'రైటర్​', 'సెల్యూట్​', 'అర్జున ఫల్గుణ' చిత్రాల సంగతులు ఉన్నాయి.

  • 'గత ఐదేళ్లలో రూ. 6,801 కోట్లు'

Sports Ministry News: గడిచిన ఐదేళ్లలో క్రీడాభివృద్ధికి రూ. 6,801 కోట్లను వెచ్చించినట్లు జాతీయ క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్​ తెలిపారు. లోక్​సభలో ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నకు ఈ మేరకు రాత పూర్వక సమాధానాన్ని ఇచ్చాడు.

20:48 December 21

టాప్​ న్యూస్​@ 9PM

  • 'కిషన్‌రెడ్డికి బాధ్యత లేదా.. '

ministers meets Piyush goyal : ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత కోసం... కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌తో రాష్ట్ర మంత్రుల బృందం సమావేశం ముగిసింది. ధాన్యం సేకరణపై లిఖితపూర్వక హామీ ఇవ్వాలని మంత్రులు, ఎంపీలు డిమాండ్‌ చేశారు. ఈ విషయంపై రెండ్రోజుల్లో స్పష్టత ఇస్తామని కేంద్ర మంత్రి వెల్లడించారు.

  • మరో 4 ఒమిక్రాన్ కేసులు

తెలంగాణలో కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గత 24 గంటల వ్యవధిలో తెలంగాణలో మరో 4 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి.

  • హోంగార్డులకు న్యూయర్ గిఫ్ట్‌

రాష్ట్రంలో హోంగార్డులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త వినిపించింది. గౌరవ వేతనం పెంచుతూ.. న్యూఇయర్​ గిఫ్ట్​ ఇచ్చింది

  • బిల్లుకు రాజ్యసభ ఆమోదం

Electoral Reforms Bill Passed: ఓటరు ఐడీని ఆధార్​తో అనుసంధానం చేసే బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు బిల్లును సభలో ప్రవేశ పెట్టగా, రాజ్యసభ మూజువాజీ ఓటుతో ఆమోదించింది. ఈ తీర్మానాన్ని సభ మూజువాణి ఓటుతో తిరస్కరించగా, నిరసనగా ఆయా పార్టీలు వాకౌట్‌ చేశాయి.

  • హాకీలో భారత్‌ ఓటమి

ASIAN CHAMPIONS HOCKEY TROPHY: ఆసియా హాకీ ఛాంపియన్స్‌ ట్రోఫీలో భారత్​కు పరాజయం ఎదురైంది. సెమీఫైనల్‌లో జపాన్‌ చేతిలో 3-5 తేడాతో ఓడిపోయింది.

19:54 December 21

టాప్​ న్యూస్​@ 8PM

  • దళితబంధు నిధులు విడుదల

రాష్ట్రంలో ఎంపిక చేసిన నాలుగు జిల్లాల్లోని నాలుగు మండలాల్లో దళితబంధు పథకం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఆ మొత్తాన్ని ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆయా జిల్లాల కలెక్టర్ల ఖాతాల్లో జమ చేసింది.

  • ఎస్​ఐ ఉద్యోగాల్లో ట్రాన్స్​జెండర్లకు రిజర్వేషన్​

Reservation for transgenders: స్పెషల్ రిజర్వ్​ సబ్​- ఇన్​స్పెక్టర్ ఉద్యోగాల కోసం పురుషులు, మహిళలతో పాటు ట్రాన్స్​జెండర్ల నుంచి కూడా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కర్ణాటక పోలీసు శాఖ తెలిపింది. ఈ ఉద్యోగాల్లో ట్రాన్స్​జెండర్లకు ఒక శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నట్లు ప్రకటించింది.

  • ఐఓసీ రిఫైనరీలో మంటలు

Fire at IOC refinery: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ) రిఫైనరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించగా.. మరో 44 మంది గాయపడ్డారు. బంగాల్​ పూర్వ మెదినీపుర్ జిల్లాలోని హల్దియా ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది.

18:54 December 21

టాప్​ న్యూస్​@ 7PM

  • హోంగార్డులకు శుభవార్త

రాష్ట్రంలో హోంగార్డుల గౌరవ వేతనం పెరిగింది. హోంగార్డులకు గౌరవవేతనం 30 శాతం పెంచుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. పెరిగిన వేతనాలు 2021 జూన్ నుంచి వర్తిస్తాయని వెల్లడించింది.

  • లోక్​సభ కోసం ప్రత్యేక యాప్​

LS Mobile App: లోక్​సభ సమావేశాలను లైవ్​లో చూసేందుకు వీలుగా యాప్​ను రూపొందించింది కేంద్రం. దీనిని స్పీకర్​ ఓం బిర్లా మంగళవారం ప్రారంభించారు. 'ఎల్​ఎస్​ మెంబర్​ యాప్'​ను సభ్యులందరూ డౌన్​లోడ్​ చేసుకోవాలని పేర్కొన్నారు.

  • మరో ఎంపీపై వేటు- ఎందుకంటే!

Derek O'Brien suspended: రాజ్యసభ రూల్​బుక్​ను ఛైర్మన్ స్థానం వైపు విసిరిన నేపథ్యంలో టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రియన్​పై సస్పెన్షన్ వేటు పడింది.

  • బాలకృష్ణతో గొడవపై రవితేజ

Unstoppable with Raviteja: గతంలో హీరోలు బాలకృష్ణ, రవితేజ మధ్య వివాదం జరిగిందంటూ వార్తలొచ్చాయి. 'అన్​స్టాపబుల్' తాజా ఎపిసోడ్​లో సందడి చేసిన వీరిద్దరూ దీనిపై క్లారిటీ ఇచ్చారు. దీనికి సంబంధించిన ప్రోమోను చూసేయండి..

17:45 December 21

టాప్​ న్యూస్​@ 6PM

  • న్యూ ఇయర్ వేడుకలు రద్దు

రాష్ట్రంలో కొవిడ్​-19 వ్యాప్తి, ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్న క్రమంలో కర్ణాటక సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధించింది. డిసెంబరు 30 నుంచి జనవరి 2 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఆంక్షలు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది.

  • 'ఓటర్‌ ఐడీ-ఆధార్‌ లింక్' బిల్లుకు ఆమోదం

  • కళ్లలో కారం చల్లి.. కత్తులతో దాడులు!

Bokkamanthulapadu knife attack : భార్యాభర్తల మధ్య గొడవ... కాస్తా ఇరు కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. ఇరు కుటుంబసభ్యులు క్షణికావేశంలో కత్తులతో దాడులు చేసుకొని... ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. ఈ ఘర్షణలో ఒకరు మృతి చెందగా.. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. గ్రామంలో జరిగిన కత్తులతో దాడులతో స్థానికులు ఉలిక్కిపడ్డారు.

  • సినిమా టికెట్లపై హైకోర్టు స్పష్టత

AP HC On Cinema Tickets : సినిమా టికెట్లపై ఇచ్చిన ఆదేశాలపై ఏపీ హైకోర్టు స్పష్టతనిచ్చింది. ఆ రాష్ట్రంలోని అన్ని థియేటర్లకు తమ ఆదేశాలు వర్తిస్తాయని ధర్మాసనం స్పష్టం చేసింది.

  • ద్రవిడ్ రికార్డుపై విరాట్ కన్ను

Kohli Dravid Record: దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్​ను ఎలాగైనా కైవసం చేసుకోవాలని భారత జట్టు ఆత్రుతగా ఎదురుచూస్తోంది. కొత్త కోచ్ రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షణలో అందుకు తగ్గట్లే శ్రమిస్తున్నారు ఆటగాళ్లు. అయితే ఈ సిరీస్ ద్వారా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ రికార్డును తన ఖాతాలో వేసుకునే అవకాశం ఉంది. అదేంటంటే!

16:49 December 21

టాప్​ న్యూస్​@ 5PM

  • గోయల్‌తో కొనుగోళ్ల భేటీ

ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత కోసం.... కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌తో రాష్ట్ర మంత్రుల బృందం భేటీ అయింది. మంత్రి నిరంజన్‌ రెడ్డి సహా పలువురు ఎంపీలు గోయల్‌తో సమావేశమయ్యారు.

  • 30 చోట్లు.. రూ.125 కోట్లు

IT Raids News: కోల్​కతా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల వేళ ఆ రాష్ట్రంలో ఐటీ డిపార్ట్​మెంట్​ సోదాలు కలకలం సృష్టించాయి. పన్ను ఎగవేతపై అసనోల్ మెట్రోపాలిటన్ సిటీలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఐటీ అధికారులు. కోట్ల సొమ్మును స్వాధీనం చేసుకున్నారు.

  • 'చిన్నారులకు ఇప్పుడే అవసరం లేదు'

Children Covid Vaccine: 12 ఏళ్ల లోపు చిన్నారులకు ఇప్పుడే టీకాలు ఇవ్వడం అంత అత్యవసరమేమీ కాదని నేషనల్‌ టెక్నికల్‌ అడ్వైజరీ గ్రూప్‌ ఆన్‌ ఇమ్యునైజేషన్‌(ఎన్‌టీఏజీఐ) సభ్యుడు ఒకరు తాజాగా ఓ జాతీయ మీడియాతో అన్నారు. ఇదే విషయాన్ని కేంద్రానికి కూడా చెప్పినట్లు పేర్కొన్నారు.

  • పార్లమెంటులో కరోనా..

Covid In Parliament: సోమవారం వరకు లోక్‌సభకు హాజరైన బీఎస్పీ ఎంపీ కున్వార్‌ దానిష్‌ అలీ కరోనా బారినపడ్డారు. తనను కలిసిన వారంతా కొవిడ్‌ పరీక్షలు చేయించుకోవాలని, స్వీయ నిర్బంధంలో ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

  • 'కేజీఎఫ్'​ స్పెషల్​ వీడియో

Yash KGF 2 Movie: కన్నడ స్టార్​ యశ్​ హీరోగా వచ్చిన 'కేజీఎఫ్'​ చిత్రం విడుదలై నేటితో మూడేళ్లైంది. ఈ సందర్భంగా ఓ స్పెషల్​ వీడియోను రిలీజ్​ చేసింది చిత్రబృందం.

15:44 December 21

టాప్​ న్యూస్​@ 4PM

  • 'సీఎంపై విచారణలకు డిమాండ్ చేయండి'

ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంపై తెరాస తీవ్రస్థాయిలో చేస్తున్న ఆందోళనలను సీరియస్​గా తీసుకున్న కేంద్రం.. దీటుగా ఎదుర్కునేందుకు సమాయత్తమవుతోంది. ఈ నేపథ్యంలో భాజపా రాష్ట్ర ముఖ్య నేతలతో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా సమావేశమయ్యారు. పార్లమెంట్‌లోని అమిత్ షా ఛాంబర్‌లో నిర్వహించిన ఈ భేటీకి మంత్రి పీయూష్ గోయల్ కూడా హాజరయ్యారు.

  • వారి ఖాతాల్లో రూ.1000 కోట్లు

Modi UP Visit: ఉత్తర్​ ప్రదేశ్​ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ.. ప్రయాగ్​ రాజ్​లో కన్యా సుమంగళ యోజనను ప్రారంభించారు. ఈ క్రమంలో మహిళల బ్యాంకు ఖాతాల్లో రూ.1,000 కోట్లు జమ చేశారు. బాలికల సంరక్షణ కోసం మరో రూ.20కోట్లపైగా నిధులను విడుదల చేశారు.

  • 'ఆ బాధ్యత మీపై లేదా?'

Kishan Reddy on Paddy Procurement: దిల్లీలో రాష్ట్ర భాజపా ఎంపీలు ముఖ్యనేతలతో కలిసి కిషన్ రెడ్డి... కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ను కలిశారు. ధాన్యం కొనుగోళ్ల అంశంపై ఆయన మాట్లాడారు.

  • 'చైనా సమాచారం ఇస్తేనే ముందడుగు'

ప్రపంచదేశాలను ఒమిక్రాన్ కలవరపరుస్తున్న వేళ కరోనా పుట్టుకకు సంబంధించి చైనా మరింత సమాచారాన్ని అందించేందుకు ముందుకు వస్తేనే కొవిడ్​పై పోరాటంలో ముందడుగు పడుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ- డబ్ల్యూహెచ్​ఓ సూచించింది.

  • సౌతాఫ్రికాకు ఎదురుదెబ్బ

Anrich Nortje Injury: టీమ్ఇండియాతో టెస్టు సిరీస్​కు ముందు దక్షిణాఫ్రికా జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్​ ఎన్రిచ్ నోర్జ్టే గాయం కారణంగా ఈ సిరీస్​కు దూరమయ్యాడు.

14:41 December 21

టాప్​ న్యూస్​@ 3PM

  • రాష్ట్ర ముఖ్య నేతలతో అమిత్‌ షా భేటీ

రాష్ట్ర భాజపా ముఖ్య నేతలతో అమిత్‌ షా సమావేశమయ్యారు. అమిత్ షాతో భాజపా రాష్ట్ర నేతల భేటీకి కేంద్రమంత్రి పీయూష్ గోయల్ కూడా హాజరయ్యారు.

  • 'ధాన్యం కొనుగోళ్లపై సీఎం అబద్ధాలు '

Piyush Goyal on Cm kcr: తెలంగాణ ప్రభుత్వం రైతులను గందరగోళ పరుస్తోందని కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఆరోపించారు. దిల్లీలో ధాన్యం సేకరణపై మాట్లాడిన ఆయన... సీఎం కేసీఆర్ అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు.

  • చప్పట్లు కొడితే.. మోటార్​ ఆన్

Clap Motor Nagarkurnool : సమస్య ఎదురైనప్పుడే.. పరిష్కారం మార్గం కోసం ఆలోచనలు మొదలవుతాయి. వాటికి కాస్త ప్రయత్నం జోడిస్తే అనుకున్న లక్ష్యం చేరడం అసాధ్యమేం కాదు. ఇలా.. తన తండ్రికి ఎదురైన ఓ ప్రాణాపాయ పరిస్థితి ఆ కుర్రాడిని కదిలించింది. ప్రయోగాలు వైపు నడిపించి.. సరికొత్త పరిష్కారం కనుక్కునేలా చేసింది. ఇంతకీ.. ఆ కుర్రాడు ఎవరూ..? అతను కనుగొన్న ఆ నూతన పరిష్కారం ఏంటి? తెలియాలంటే.. ఈ స్టోరీ చూడాల్సిందే.

  • బాలయ్యతో 'పుష్ప'రాజ్​..!

Unstoppable with NBK: 'అఖండ'తో భారీ విజయాన్ని అందుకున్న నందమూరి బాలకృష్ణ.. మళ్లీ తన తన తొలి టాక్​ షో 'అన్​స్టాపబుల్​ విత్ ఎన్​బీకే'తో బిజీ అయ్యారు. ఇటీవలే ఈ కార్యక్రమానికి రాజమౌళి, రవితేజ విచ్చేయగా.. తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ షోలో సందడి చేశారు.

  • 'పూర్తి ఫిట్​నెస్​తో ఉన్నా..'

Kidambi Srikanth Pressmeet: ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్​షిప్​లో రజతం సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు భారత షట్లర్ కిదాంబి శ్రీకాంత్. ఈ టోర్నీలో పతకం సాధించి చరిత్ర సృష్టించిన ఇతడు.. హైదరాబాద్ చేరుకున్నాక మీడియాతో ముచ్చటించాడు.

13:58 December 21

టాప్​న్యూస్​@ 2PM

  • ఏక కాలంలో ఇద్దరు శత్రువులపై గురి..!

రష్యా నుంచి కొనుగోలు చేసిన అత్యాధునిక ఆయుధ వ్యవస్థ ఎస్​-400 రక్షణ వ్యవస్థను భారత్ తన సరిహద్దుల్లో మోహరించింది. దీనితో దేశీయ గగనతలం శత్రుదుర్భేద్యం కానుంది. ఈ నేపథ్యంలో ఎస్‌-400 గగనతల రక్షణ వ్యవస్థ పనితీరు, ఉపయోగాలపై ప్రత్యేక కథనం..

  • టీఎంసీదే 'కోల్​కతా' పీఠం

KMC election 2021 results: కోల్​కతా మున్సిపల్ కార్పొరేషన్​లో టీఎంసీ మంచి ఫలితాలు సాధించింది. ఇప్పటికే 54 సీట్లను గెలుచుకోగా.. మరో 78 స్థానాల్లో ముందంజలో ఉంది. ఈ ఫలితాలు జాతీయ రాజకీయాల విజయమని పేర్కొన్నారు మమత.

  • ఇంటర్‌ బోర్డు కార్యాలయం వద్ద ఉద్రిక్తత

High Tension at Inter Board office : హైదరాబాద్‌ నాంపల్లిలోని ఇంటర్‌ బోర్డు కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం ఫలితాల తీరును నిరసిస్తూ.... ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థి నాయకులు ఆందోళనకు దిగారు. విద్యార్థులు, విద్యార్థి నేతలు ఇంటర్‌ బోర్డు కార్యాలయం వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్నారు. ఇంటర్ ఫస్టియర్‌ విద్యార్థులందరినీ పాస్ చేయాలని నినాదాలు చేశారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ నేపథ్యంలో ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.

  • హుజూర్‌నగర్ నియోజకవర్గానికి రూ.28.30 కోట్లు విడుదల

funds released to huzurnagar constituency : సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీ మేరకు నియోజకవర్గం అభివృద్ధి కోసం​ రూ.28.30 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. హుజూర్‌నగర్‌లో 607 పనుల కోసం రూ.28.30 కోట్లు ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం నిధులను విడుదల చేసింది.

  • కోహ్లీకి బౌలింగ్ చేయడం అదృష్టం

Southee on Kohli: టీమ్ఇండియా టెస్టు సారథి విరాట్ కోహ్లీ వన్డే, టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంపై స్పందించాడు న్యూజిలాండ్ పేసర్ టిమ్ సౌథీ. ప్రస్తుత పరిస్థితుల్లో పరిమిత ఓవర్ల క్రికెట్‌ సారథ్య బాధ్యతలకు దూరంగా ఉండటం అతడిపై భారం తగ్గిస్తుందని పేర్కొన్నాడు.

12:56 December 21

టాప్​న్యూస్​@ 1PM

  • వ్యాపారి ఇంట్లో అక్రమ ఆయుధాలు

Weapons seized: రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో స్థిరాస్తి వ్యాపారి ఇంట్లో ఎస్​వోటీ పోలీసులు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నారన్న సమాచారంతో తనిఖీలు నిర్వహించారు. గగన్‌పహాడ్‌లోని హైమద్ ఇంట్లో ఎస్‌వోటీ పోలీసులు సోదాలు చేసి... రెండు తుపాకులు, 30 తూటాలు స్వాధీనం చేసుకున్నారు.

  • 200 దాటిన ఒమిక్రాన్​ కేసులు

Omicron Cases in India: దేశంలో ఒమిక్రాన్​ కేసుల సంఖ్య 200 దాటింది. ఈ విషయాన్ని కేంద్రం వెల్లడించింది. ఒమిక్రాన్​ బాధితుల్లో ఇప్పటివరకు 77 మంది డిశ్చార్జ్‌ అయినట్లు పేర్కొంది.

  • పంజాబ్‌లో ఎస్‌-400 మోహరింపు

  • థియేటర్‌/ఓటీటీలో వచ్చే సినిమాలివే!

నేచురల్ స్టార్ నాని నటించిన 'శ్యామ్​ సింగరాయ్', 1983 ప్రపంచకప్​ నేపథ్యంలో తెరకెక్కిన '83' ఈ వారం థియేటర్లలో విడుదల కానున్నాయి. వాటితో పాటు క్రిస్మస్​ కానుకగా ఈ వారం థియేటర్​, ఓటీటీలలో సందడి చేయనున్న సినిమాలివే!

  • హే సినామిక' అంటూ దుల్కర్

మలయాళ స్టార్​ నటుడు దుల్కర్​ సల్మాన్ నటిస్తోన్న కొత్త చిత్రం 'హే సినామిక'. కాజల్ అగర్వాల్, అదితీ రావు హైదరీ కథానాయికలు. బృందా దర్శకుడు. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా తెరకెక్కుతోంది.

11:43 December 21

టాప్​న్యూస్​@ 12PM

  • పీయూష్ అపాయింట్‌మెంట్‌

కేంద్రమంత్రి పీయూష్ గోయల్​ను భాజపా రాష్ట్ర ముఖ్యనేతలు కలవనున్నారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి నేతృత్వంలోని బృందం మధ్యాహ్నం 12:30గంటలకు భేటీ కానుంది. ధాన్యం కొనుగోలు అంశంపై చర్చించనున్నట్లు సమాచారం.

  • ఏడుగురికి పునర్జన్మనిచ్చాడు

అవసరానికి అవయవం లభ్యం కాకపోవడంవల్ల చాలా మంది రోగులు అర్ధాంతరంగా మృత్యు ఒడికి చేరుతున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన ఆ తల్లిదండ్రులు.. బ్రెయిన్​ డెడ్​ అయిన తమ కుమారుడి అవయవాలను దానం చేశారు. జన్మనిచ్చి పెంచుకున్న కుమారుడు దూరమైనా... మరో ఏడుగురిలో తన అవయవాలను సజీవం చేశారు.

  • ఇళ్లల్లోకి దూరిన ఎలుగుబంట్లు

ఒడిశా మల్కాన్‌గిరి జిల్లాలో అడవులకు సమీపంలో ఉన్న గ్రామాల్లో.. వన్యప్రాణులు స్థానికులను బెంబేలెత్తిస్తున్నాయి. తరచూ ఏనుగుల గుంపు గ్రామాల్లోకి రావడం సహజం కాగా ఇప్పుడు ఎలుగుబంట్లు కూడా వస్తున్నాయి. ఆయా గ్రామాల ప్రజలకు కునుకులేకుండా చేస్తున్నాయి.

  • వైట్‌హౌస్‌ ఉద్యోగికి కరోనా

White House covid: శ్వేతసౌధంలో పనిచేసే ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయ్యింది. ఆ ఉద్యోగి మూడు రోజుల క్రితమే బైడెన్​తో కలిసి ప్రయాణించినట్లు శ్వేతసౌధ అధికార ప్రతినిధి వెల్లడించారు. దీంతో అప్రమత్తమై అధ్యక్షుడికి పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు.

  • అమ్మే ఎక్కువ ట్రోల్ చేస్తుంది

బయట కంటే ఇంట్లోనే తనను ఎక్కువగా ట్రోల్ చేస్తారని అన్నారు సంగీత దర్శకుడు ఎస్​ఎస్​ తమన్​. ఇటీవలే బాలయ్య నటించిన 'అఖండ'తో సెన్సేషన్ క్రియేట్ చేసిన అతడు.. ఈటీవీలో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా' షోకు హాజరయ్యారు. ఈ సందర్భంగా తనపై జరిగే ట్రోలింగ్​ సహా వ్యక్తిగత జీవితం గురించిన ఆసక్తికర విశేషాలను పంచుకున్నారు.

10:59 December 21

టాప్​న్యూస్​@ 11AM

  • 'భీమ్లా నాయక్' కొత్త రిలీజ్ డేట్ ఇదే

పవర్​స్టార్ పవన్ కల్యాణ్, రానా కీలకపాత్రల్లో నటించిన 'భీమ్లా నాయక్' సంక్రాంతి రేసు నుంచి తప్పుకొంది. జనవరి 12న రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం ఫిబ్రవరి 25కి వాయిదా పడింది. ఈ విషయాన్ని నిర్మాతల మండలి అధికారికంగా ప్రకటించింది.

  • భాజపా పార్లమెంటరీ మీటింగ్

శీతాకాల సమావేశాల నేపథ్యంలో భాజపా పార్లమెంటరీ పార్టీ మీటింగ్ నిర్వహించింది. పార్టీకి చెందిన ఎంపీలు ఈ భేటీకి హాజరయ్యారు. సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.

  • అమెరికాలో తొలి ఒమిక్రాన్ మరణం

US first Omicron death: అమెరికాలో తొలి ఒమిక్రాన్ మరణం నమోదైంది. టెక్సస్​కు చెందిన ఓ బాధితుడు మరణించినట్లు స్థానిక యంత్రాంగం వెల్లడించింది. మరోవైపు, దేశంలో నమోదవుతున్న కొత్త కేసుల్లో 73 శాతం ఒమిక్రాన్ వేరియంట్​కు సంబంధించినవే ఉన్నాయని సీడీసీ వెల్లడించింది. న్యూయార్క్​లో నమోదైన కేసుల్లో ఒమిక్రాన్ వాటా 90 శాతంగా ఉందని పేర్కొంది. ఒమిక్రాన్ వ్యాప్తి వారం రోజుల్లోనే ఆరు రెట్లు పెరిగిందని తెలిపింది.

  • వివాహేతర సంబంధం వద్దు అన్నందుకు..

Boy killed in MP: ఆరేళ్ల బాలుడిని ఓ వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. బాలుడి తల్లి నిందితుడితో వివాహేతర సంబంధానికి నిరాకరించడమే ఇందుకు కారణమని పోలీసులు తెలిపారు.

  • డీమార్ట్​లో క్యారీ బ్యాగ్స్​ కొంటున్నారా?

D Mart Carry Bags: ముద్రిత లోగో ఉన్నా లేకున్నా వినియోగదారులకు ఉచితంగానే చేతి సంచులు(క్యారీబ్యాగ్స్‌) ఇవ్వాలంటూ హైదరాబాద్‌ జిల్లా వినియోగదారుల కమిషన్‌-3 సంచలన తీర్పు వెలువరించింది. వినియోగదారుల వద్ద చేతి సంచి కోసం వసూలు చేసిన రూ.3.50 తిరిగి చెల్లించడంతో పాటు, పరిహారంగా రూ.1,000, న్యాయ సేవాకేంద్రానికి రూ.1,000 చెల్లించాలని హైదర్‌నగర్‌ డీమార్ట్‌ శాఖను ఆదేశించింది.

09:48 December 21

టాప్​న్యూస్​@ 10AM

  • ఇల్లాలిగా వచ్చి.. దోచుకెళ్లింది

డాలీ కీ డోలీ' సినిమా తరహాలో రంగారెడ్డిలో ఓ ఉదంతం వెలుగు చూసింది. ఈ సినిమాలో హీరోయిన్ ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. ఇంట్లో వారి అందరికీ స్వీట్​ చేసి.. దానిలో మత్తుమందు కలుపుతుంది. అందరూ తిన్న తర్వాత.. ఆ ఇంట్లోని డబ్బు, నగలు తీసుకుని అక్కడి నుంచి ఉడాయిస్తుంది. ఇదే తరహాలో రంగారెడ్డి జిల్లాలోని యాచారం మండలంలో చోటు చేసుకుంది. మెట్టింటికి వచ్చిన కొత్త పెళ్లి కూతురు ఇంట్లోని నగదుతో పరారైంది.

  • భారీగా తగ్గిన కరోనా వ్యాప్తి

India Covid cases: దేశంలో కొత్తగా 5,326‬ కొవిడ్ కేసులు నమోదయ్యాయి. మరో 453 మంది ప్రాణాలు కోల్పోయారు. సోమవారం 64,56,911 మందికి టీకాలు అందించారు.

  • చైనాకు 'పొరుగు' పోటు

దక్షిణాసియాపై ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తున్న చైనాకు కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. పలు పొరుగు దేశాలతో నెలకొన్న సమస్యలు డ్రాగన్‌కు తలనొప్పిగా మారాయి. భారత్​తో పాటు శ్రీలంక, బంగ్లాదేశ్​, మయన్మార్​, పాకిస్థాన్​లతో మైత్రి బలహీనపడినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

  • జపాన్​తో నాకౌట్‌ సమరం

Hockey Champions Trophy: హాకీ ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీలో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్.. నేడు సెమీఫైనల్స్​ ఆడనుంది. ఈ మ్యాచ్​లో జపాన్‌తో తలపడనుంది.

  • లాభాల్లో మార్కెట్లు- సెన్సెక్స్ 600 ప్లస్​

Stock Market LIVE Updates: స్టాక్ మార్కెట్లు (Stock Market today) మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్​ (Sensex today) 620 పాయింట్లకుపైగా లాభంతో 56,447 వద్ద ట్రేడవుతోంది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ (Nifty today) 181 పాయింట్లకుపైగా పెరిగి 16,795 వద్ద కొనసాగుతోంది.

08:57 December 21

టాప్​న్యూస్​@ 9AM

  • తెలంగాణలో రెడ్ అలర్ట్

Telangana Weather Update : తెలంగాణను చలిపులి వణికిస్తోంది. రోజురోజుకు తగ్గుతున్న ఉష్ణోగ్రతలతో చలితీవ్రత పెరుగుతుండటం వల్ల వాతావరణ శాఖ రాష్ట్రంలో రెడ్ అలర్ట్ ప్రకటించింది. మునుపెన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు తగ్గుతుడటం వల్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. వృద్ధులు, గర్భిణులు, చిన్నారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

  • ఒమిక్రాన్ భయాలు- రక్షణ చర్యలే తక్షణావసరం

Omicron in India: ఇటీవల వెలుగులోకి వచ్చిన ఒమిక్రాన్ వేరియంట్ భారత్ సహా ప్రపంచదేశాలను వణికిస్తోంది. ఆందోళనకర వైరస్‌ రకంగా డబ్ల్యూహెచ్ఓ గుర్తింపు పొందిన ఈ వేరియంట్ తెలుగు రాష్ట్రాల్లోనూ అడుగుపెట్టింది. కాబట్టి, తొలిదశ, రెండోదశల్లో కొవిడ్‌ విజృంభించినప్పుడు పాటించిన జాగ్రత్తలన్నింటినీ మళ్లీ పూర్తిస్థాయిలో తీసుకోవాల్సిందేనని వైద్యవర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

  • భర్త నేలకొరుగుతున్నా.. జెండా ఎగరేసి!

భారత స్వాతంత్య్ర సమరంలో మహిళలూ కీలక పాత్ర పోషించారు. వారిలో ఎక్కువ మంది- సంపన్న కుటుంబాల నుంచి వచ్చినవారు, తల్లిదండ్రులను చూసి ప్రేరణ పొందినవారు, కళాశాలల్లో ప్రభావితులైన వారే! అయితే చదువుసంధ్యలేవీ లేకున్నా.. పూట గడవని పరిస్థితుల్లో ఉన్నా.. దేశభక్తితో స్వాతంత్య్రం కోసం రంగంలోకి దిగి ఎవరికీ తెలియకుండా మిగిలిపోయిన స్త్రీ మూర్తులూ ఉన్నారు. వారిలో తలచుకోవాల్సిన ఓ పేరు... తారా రాణి శ్రీవాస్తవ. భర్త నేలకొరుగుతున్నా వెనక్కి తగ్గక త్రివర్ణ పతాకాన్ని ఎగరేసిన ధీశాలి ఆమె.

  • కిదాంబి శ్రీకాంత్‌కు టాప్‌ సీడింగ్‌

Kidambi Srikanth: ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో రజతం సాధించి జోరుమీదున్న భారత స్టార్‌ షట్లర్ కిదాంబి శ్రీకాంత్‌ 'ఇండియా ఓపెన్‌' బ్యాడ్మింటన్‌ టోర్నీ సింగిల్స్‌ టాప్​ సీడింగ్ దక్కింది. వచ్చే నెల 11న దిల్లీలో ఆరంభమయ్యే ఈ టోర్నీ కోసం మరో స్టార్‌ షట్లర్‌ పి.వి. సింధుతో పాటు స్టార్‌ షట్లర్‌ సైనా నెహ్వాల్‌, మాల్విక బన్సోద్‌, ఆకర్షి కశ్యప్‌, అస్మిత కూడా ఆడుతున్నారు.

  • శ్యామ్​ సింగరాయ్'​ విడుదలయ్యాకే

Shyam Singha Roy: "స్క్రీన్‌ప్లే పరంగా.. విజువల్‌ పరంగా చాలా కొత్తగా ఉండే సినిమా 'శ్యామ్‌ సింగరాయ్‌'. కచ్చితంగా ప్రేక్షకులకు ఓ సరికొత్త అనుభూతిని అందిస్తుంది" అన్నారు రాహుల్‌ సంకృత్యాన్‌. 'టాక్సీవాలా' చిత్రంతో సినీప్రియుల్ని మెప్పించిన దర్శకుడాయన. ఇప్పుడు నాని హీరోగా 'శ్యామ్‌ సింగరాయ్‌' సినిమాని తెరకెక్కించారు. వెంకట్‌ బోయనపల్లి నిర్మాత. సాయిపల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్‌ కథానాయికలు. ఈ చిత్రం ఈనెల 24న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకున్నారు రాహుల్‌.

07:57 December 21

టాప్​న్యూస్​@ 8AM

  • ముఖ్యనేతలతో నేడు షా భేటీ

Amit Shah Meets Telangana BJP Leaders : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా భాజపా రాష్ట్ర ముఖ్యనేతలతో ఇవాళ భేటీ కానున్నారు. ధాన్యం కొనుగోళ్లపై తెరాస ఆందోళనల నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.

  • మునిగిన ఓడ- 17మంది మృతి

Madagascar ship sinking: 130 మంది ప్రయాణికులతో వెళ్తున్న సరకు రవాణా నౌక హిందూ మహాసముద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనలో 17 మంది చనిపోయారు. మరో 68 మంది గల్లంతయ్యారు.

  • ఏడేళ్లలో రూ.1.09 లక్షల కోట్లు

CSR spending: కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్ఆర్) కింద గత ఏడేళ్ల వ్యవధిలో వివిధ కంపెనీలు రూ.1.09 లక్షల కోట్లు ఖర్చు చేశాయని కేంద్ర మంత్రి ఇంద్రజిత్ సింగ్ తెలిపారు. వివిధ సామాజిక కార్యక్రమాల కోసం వీటిని వెచ్చించాయని చెప్పారు. మరోవైపు, మాల్యా, నీరవ్, చోక్సీ ఆస్తుల విక్రయం ద్వారా రికవరీ అయిన మొత్తంపై లోక్​సభలో వివరాలు తెలియజేశారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.

  • సఫారీ గడ్డపై ఈసారైనా?

న్యూజిలాండ్‌లో ఎప్పుడో గెలిచారు.. ఇంగ్లాండ్‌లోనూ విజయాలందాయి.. ఇటీవలి పర్యటనలో సిరీస్‌ దాదాపుగా సొంతమైంది. వెస్టిండీస్‌లో పెద్దగా కష్టపడకుండానే గెలిచేస్తున్నారు. ఆస్ట్రేలియాలో గత రెండు పర్యటనల్లోనూ సిరీస్‌ విజయాలు దక్కాయి. కానీ ఉపఖండం అవతల ఒక్క దేశంలో మాత్రం టీమ్‌ఇండియాకు టెస్టు సిరీస్‌ గెలుపు దశాబ్దాలుగా అందని ద్రాక్షే.

  • మురిపించేది.. వచ్చే ఏడాదే

2020లో తొలి దశ కరోనా వల్ల ఆ ఏడాది సినిమా క్యాలెండర్‌ మొత్తం మారిపోయింది. చిత్రీకరణలు ఆగిపోయాయి. విడుదల తేదీలు మారిపోయాయి. ఆ ఒత్తిడంతా 2021పై పడింది. విడుదల కోసం సినిమాలు పోటీపడ్డాయి.

06:44 December 21

టాప్​న్యూస్​@ 7AM

  • ప్రభుత్వం చేసిన అప్పులు

Debt of Telangana 2021: ఈ ఏడాది నవంబర్‌ నాటికి రాష్ట్రం రూ.2,37,747 కోట్ల అప్పు చేసిందని కేంద్ర ఆర్థిక శాఖ లోక్​సభకు తెలిపింది. దేశీయ అప్పుగా రూ.2,34,912 కోట్లు అప్పు చేయగా.. రూ.2,835 కోట్లు విదేశీ అప్పు చేసిందని వెల్లడించింది.

  • 'నిబంధనల భారాన్ని తగ్గిస్తాం'

ముందస్తు బడ్జెట్‌ సంప్రదింపుల్లో భాగంగా సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ కార్పొరేట్‌ దిగ్గజాలతో సమావేశమయ్యారు. ఆర్థిక వ్యవస్థ పురోగతికి ఊతమిచ్చే చర్యలకు కట్టుబడి ఉన్నామని చెబుతూ, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని వారికి వివరించారు.

  • వార్షిక సమావేశాలు వాయిదా

ప్రపంచ ఆర్థిక వేదికను వాయిదా వేస్తూ వరల్డ్​ ఎకనామిక్​ ఫోరం నిర్ణయం తీసుకుంది. ఒమిక్రాన్​ అంతకంతకూ వ్యాప్తి చెందుతోన్న నేపథ్యంలో వచ్చే ఏడాది వేసవిలో నిర్వహించాలని నిర్ణయించింది.

  • ఫ్రీగా మొబైల్స్​ , ట్యాబ్‌లు!

Free Smartphone Tablets UP: ఉత్తర్​ప్రదేశ్​లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా కోటిమంది విద్యార్థులకు ఉచితంగా స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌లు పంపిణీ చేయనుంది. డిసెంబర్‌ 25న తొలి దశ పంపిణీని ప్రారంభించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

  • స్లమ్ గర్ల్' ర్యాప్​.. యమ హైప్​!

Viral Rapper Sania Mistry: ర్యాప్ సాంగ్స్​ అనగానే చాలామందికి ముందుగా రిచ్​నెస్ గుర్తుకొస్తుంది. కానీ ముంబయిలోని శివాజీ నగర్ మురికివాడల్లో నివసించే ఈ బాలిక అందుకు విభిన్నం. తన పేదరికం, కష్టాలనే ర్యాప్ సాంగ్స్​గా పాడుతోంది. సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇంతకీ ఈ బాలిక కథేంటో చూసేద్దాం పదండి..

05:37 December 21

టాప్​ న్యూస్​@ 6AM

  • తెరపైకి కొత్త ప్రతిపాదన!

Employees Allocation: ఉద్యోగులకు కొత్తస్థానాలు కేటాయించినా... ఈ విద్యాసంవత్సరం పూర్తయ్యేవరకు ప్రస్తుత స్థానాల్లోనే కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పిల్లల విద్యాభ్యాసానికి ఆటంకం కలగకుండా ఈ ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. మరో నాలుగైదు రోజుల్లో మొత్తం ఉద్యోగుల బదలాయింపు ప్రక్రియను పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత కొలువుల భర్తీ కోసం ఖాళీలను నిర్ధారిస్తారు.

  • రూ. లక్ష 27 వేల కోట్ల మద్యం తాగేశారు

Liquor sales in Telangana:రాష్ట్రంలో మద్యం భారీగా అమ్ముడుపోతోంది. గడిచిన ఆరేళ్ల కాలంలో రూ.లక్ష 27 వేల కోట్లకుపైగా విలువైన 19.38 కోట్లు కేసుల లిక్కర్‌, 23.62 కోట్లు కేసుల బీర్లను తాగేశారు. అన్ని రంగాలపై కరోనా ప్రభావం పడినా మద్యం విక్రయాలపై మాత్రం ఆ జాడ ఎక్కడా కనిపించలేదు. ఐటీ రంగంతోపాటు ఇతర ప్రైవేటు ఉద్యోగులు ఎక్కువ భాగం ఇంటి వద్ద నుంచే ఉద్యోగాలు చేస్తున్నందున బీర్ల అమ్మకాలు తగ్గినా... లిక్కర్‌ విక్రయాలు మాత్రం క్రమంగా పెరిగినట్లు అబ్కారీ శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

  • జనరిక్‌తోనే విరుగుడు

generic medicine: రోజురోజుకు మెడిసిన్​ ధరలు పెరిగిపోతున్నాయి. జీవనశైలి వ్యాధులు సహా ఇతర వ్యాధులకు ఔషధాలు వినియోగించాల్సి రావడంతో వేలకు వేలు ఖర్చులవుతున్నాయి. ఇది సామాన్యుడికి మోయలేని భారమవుతోంది. అదే జనరిక్​ మందులు అందుబాటులోకి వస్తే ప్రజలకు కాస్త ఉపసమనం కలగనుంది. వీటి వాడకంపై ప్రజల్లో మరింత అవగాహన కలిగించాల్సి ఉంది.

  • ఘోర రోడ్డు ప్రమాదం..

PEDDAPALLI ACCIDENT: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని గంగానగర్‌ వద్ద ప్రమాదం జరిగింది. రెండు లారీలు పరస్పరం ఢీకొని.. ఆటోపై పడ్డాయి. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు దుర్మరణం చెందారు. మరికొంత మంది గాయపడ్డారు.

  • మినుము వైపు మొగ్గు..

Alternative Crops: వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు సాగుచేయాలన్న ప్రభుత్వ సూచనతో పాలమారు జిల్లాలో రైతులు మినుము వైపు మొగ్గు చూపుతున్నారు. కనీస మద్దతు ధర కంటే బహిరంగ మార్కెట్​లో అధిక ధర పలుకుతుండడంతో మినుము సాగుకు మొగ్గుచూపుతున్నారు.

  • భారత్‌లో ఒమిక్రాన్‌ తీవ్రత...

ఒమిక్రాన్‌ ప్రాబల్యం, రోగనిరోధకత నుంచి తప్పించుకోవడం లేదా తీవ్రతపై ఇంకా స్పష్టమైన ఆధారాలు లభించలేదని ఇండియన్‌ సార్స్‌-కోవ్‌-2 జీనోమిక్స్‌ కన్సార్టియం (ఐఎన్​ఎస్​ఏసీఓజీ) వెల్లడించింది. ప్రపంచ దేశాలతో పాటు భారత్​లోనూ కేసులు వెలుగు చూస్తున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేసింది.

  • బూస్టర్‌ డోసుగా ముక్కుద్వారా తీసుకునే టీకా..!

ముక్కు ద్వారా తీసుకునే టీకాను బూస్టర్‌ డోసుగా ఇచ్చేందుకుగాను తుదిదశ ప్రయోగాలకు అనుమతి ఇవ్వాలని భారత ఔషధ నియంత్రణ సంస్థను కోరింది భారత్​ బయోటెక్​ కోరింది. ఈ మేరకు డీసీజీఐకి తాజాగా దరఖాస్తు చేసుకున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది.

  • కోటి మందికి ఫ్రీగా మొబైల్స్​ , ట్యాబ్‌లు!

  • కేంద్ర ఖజానాలోకి రూ. 4.55లక్షల కోట్లు

Central Taxes On Petrol Diesel: పెట్రోల్‌, డీజిల్‌పై పన్నుల రూపంలో కేంద్ర ఖజానాకు రూ.4.55లక్షల కోట్ల మేర ఆదాయం లభించింది. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వశాఖ సహాయ మంత్రి రామేశ్వర్‌ తెలి వెల్లడించారు.

  • వైరల్ వీడియో..!

Australia Cricket News: ఆస్ట్రేలియాలోని మహిళల దేశవాళీ క్రికెట్‌లో ఓ వింత ఘటన జరిగింది. ఒక బ్యాటర్‌ క్రీజులో బ్యాటింగ్‌ చేస్తుండగా బౌలర్‌ విసిరిన బంతి వికెట్లకు తాకి బెయిల్స్‌ కిందపడ్డాయి. అయినా, దాన్ని ఎవరూ గుర్తించలేదు. దీంతో ఆ బ్యాటర్‌ ఔటవ్వకుండా బతికిపోయింది.

Last Updated : Dec 21, 2021, 10:01 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.