అటవీ అధికారులపై ప్రభుత్వ విప్ రేగాకాంతారావు మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు. కొందరు అధికారుల వల్లే అడవులు నాశనమవుతున్నాయని ఆరోపించారు. భూములు అధికారుల కబ్జాలో ఉంటే శిక్షకు ఒప్పుకుంటారా అని ప్రశ్నించారు. నిజంగా వారు నిజాయితీపరులైతే సీబీఐ విచారణకు సిద్ధం కండి అని సవాల్ విసిరారు.
తన వాదన తప్పయితే కేసులు పెట్టమని రేగా కాంతారావు అన్నారు. తమ భూములు బలవంతంగా లాక్కుంటే ఊరుకోమని స్పష్టం చేశారు. అటవీ అధికారులకు ఎవరిచ్చిన పట్టాలు చెల్లుతాయని ప్రశ్నించారు. పార్టీకీ విధేయుడినేనని.. ప్రజలకు, పార్టీకి నష్టం జరిగితే చూస్తూ ఊరుకోనని స్పష్టం చేశారు.