భారతదేశం నుంచి నైరుతి రుతుపవనాలు బుధవారం ఉపసంహరించబడ్డాయని హైదరాబాద్ వాతవరణ కేంద్రం ప్రకటించింది. దిగువ ట్రోఫోస్పియర్ స్థాయి వద్ద ఈశాన్య దిశగా గాలులు వీయడం ద్వారా తమిళనాడు, పుదుచ్చేరి, కోస్తాంధ్ర, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో ఈశాన్య రుతుపవన వర్షాలు ప్రారంభమయ్యాయని తెలిపింది.
ఉత్తర తమిళనాడు తీరానికి దగ్గరలో నైరుతి బంగాళాఖాతంలో 3.1 కి.మీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వెల్లడించింది. రాగల మూడు రోజుల్లో రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.
ఇదీ చదవండిః అక్టోబర్ 29న మరో అల్పపీడనం..!