ETV Bharat / city

పర్యటక రంగాన్ని ముంచేసిన కరోనా.. భారీ నష్టాలు - telangana tourism updates

సుందరమైన ప్రాంతాలు, అందమైన జలపాతాలు, అలనాటి చారిత్రక కట్టడాలు.. ఇలా అనేకమైన అందాలు తెలంగాణ సొంతం. రాచరికపు ఆనవాళ్లు నుంచి ఆధునిక కట్టడాల వరకు.. ప్రపంచ దేశాల పర్యాటకులను కనువిందు చేస్తున్నాయి. చార్మినార్ సొగసు చూసి మురిసి.. వరంగల్ వేయి స్తంభాల్లోని కళకు కితాబిచ్చి.. యాదాద్రీశుడిని దర్శించుకుని పరవశించి.. అనంతగిరుల అందాల్లో సేదతీరుతుంటారు పర్యాటకులు. కానీ ఇదంతా కరోనాకు ముందు.. ప్రస్తుతం ఆయా ప్రాంతాలన్నీ వెలవెలబోతున్నాయి. ఫలితంగా రాష్ట్ర ఖజానాకు భారీ గండి పడింది. రాష్ట్ర పర్యాటక రంగం మొత్తం కరోనా దెబ్బకు కుదేలైంది.

Telangana tourism
పర్యటక రంగాన్ని ముంచేసిన కరోనా.. భారీ నష్టాలు
author img

By

Published : Nov 14, 2020, 5:22 PM IST

సహజమైన అటవీ అందాలతో పాటు... వరంగల్ ఖిల్లా, తోరణాలు, వేయి స్తంభాల ఆలయం, చార్మినార్, మక్కా మసీదు, గోల్కొండ కోట, నల్గొండలోని నాగార్జునకొండ ఇలా అనేక చారిత్రక కట్టడాలు, ప్రదేశాలకు తెలంగాణ నెలవు. భద్రాచలం రామయ్య, యాదాద్రి నరసింహుడు, వేములవాడ రాజన్న, గద్వాల జోగులాంబ ఇలా అనేకమైన ప్రవిత్ర ఆలయాలు కొలువైన ప్రాంతం తెలంగాణ. కుంటాల జలపాతం, అనంతగిరులు పచ్చదనం కలగలిసి అన్ని రకాల పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థకే ఏటా సుమారు రూ.80 కోట్లకు పైగా ఆదాయం వస్తోంది. కరోనా ప్రభావంతో రాబడికి భారీగా గండి పడింది.

నాడు కళకళ..

2019 జనవరి నుంచి డిసెంబర్ వరకు 8,30,35,894 మంది తెలంగాణను సందర్శించినట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. అందులో అత్యధికంగా జూన్​లో 1,59,13,901 మంది పర్యటించారు. జనవరిలో 17,82,269, ఫిబ్రవరిలో 64,56,354, మార్చిలో 68,24,552, ఏప్రిల్ 58,02,032, మేలో 53,62,112, జూలైలో 45,98,041 మంది, ఆగస్టులో 50,10,596, సెప్టెంబర్​లో 47,42,109, అక్టోబర్​లో 52,02,274, నవంబర్​లో 58,36,604, డిసెంబర్​లో 65,05,050 మంది పర్యటించినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో దాదాపు 30 శాతం మంది విదేశీయులున్నట్లు పేర్కొన్నారు.

ఇప్పటి వరకు రూ.27 కోట్ల నష్టం..

కరోనా ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ప్రయాణాలపై ఆంక్షలు విధించడం వల్ల రాష్ట్ర పర్యటక రంగం భారీ నష్టాలను చవిచూసింది. ఈ ఏడాది మార్చి నుంచి జూన్​ వరకు పూర్తిస్థాయి లాక్​డౌన్​ విధించారు. అనంతరం కొవిడ్​ నిబంధనల మధ్య పరిమిత సంఖ్యలో పర్యటకుల అనుసరిస్తున్నారు. కరోనా మహమ్మారి భయంతో పెద్దగా ఆసక్తి చూపలేదు.

జూన్​ నుంచి ఇప్పటి వరకు రూ.27 కోట్లు నష్టం వాటిల్లినట్లు అధికారులు వెల్లడించారు. మొత్తంగా పర్యటక రంగానికి రూ.30 కోట్లు గండి పడిందన్నారు. ఓ వైపు కరోనా భయం.. మరోవైపు ఆర్థిక పరిస్థితుల కారణంగా పర్యటక రంగం ఇప్పట్లో కోలుకునే పరిస్థితి లేదని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఇవీచూడండి: కరోనా నిబంధనలు మరిచి.. గుంపులు గుంపులుగా..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.