ETV Bharat / city

Top news: టాప్ న్యూస్ @9PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు...

TELANGANA TOP TEN NEWS
TELANGANA TOP TEN NEWS
author img

By

Published : Feb 11, 2022, 8:59 PM IST

  • దిల్లీ కోట బద్దలు కొట్టేందుకు సిద్ధం..

దిల్లీ కోట బద్దలు కొట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు సీఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో నీళ్లు లేక చాలా ఇబ్బందులు పడ్డామని.. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో 30 లక్షల బోర్లు వేసుకున్నట్లు స్పష్టం చేశారు. కానీ కేంద్రం అడ్డగోలుగా డీజిల్‌, ఎరువుల ధరలు పెంచి రైతులను ఆగం చేసిందని ఆరోపించారు.

  • జనగామకు సీఎం కేసీఆర్ వరాలు..

CM KCR Jangaon Tour Speech: జనగామ జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించారు. జిల్లాలోని యశ్వంతపూర్‌ వద్ద తెరాస కార్యాలయాన్ని ప్రారంభించిన కేసీఆర్... అనంతరం తెరాస బహిరంగ సభకు హాజరయ్యారు. సభలో ప్రసగించిన సీఎం.. జనగామ జిల్లాకు కొన్ని వరాలు కురిపించారు.

  • పదో తరగతి పరీక్షల షెడ్యూల్​..

పదో తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. మే 11 నుంచి 17 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్టు సెకండరీ ఎడ్యుకేషన్‌ బోర్డు శుక్రవారం ప్రకటించింది. అలాగే, మే 18 నుంచి 20 వరకు ఓఎస్‌ఎస్‌సీ, ఒకేషనల్‌ విద్యార్థులకు పరీక్షలు ఉంటాయని తెలిపింది. ఉదయం 9.30 గంటలకు పరీక్ష ప్రారంభమై మధ్యాహ్నం 12.45గంటల వరకు కొనసాగుతుందని తెలిపింది.

  • దేశంలో అమృతకాలం.. ఆ రాష్ట్రాల్లో రాహుకాలం..

Nirmala Sitharaman On Congress: దేశంలో అమృతకాలం కొనసాగుతుండగా.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో మాత్రం రాహుకాలం ఉందన్నారు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. 2014 నుంచి దేశంలో రాహుకాలం కొనసాగుతోందన్న కాంగ్రెస్ ఎంపీ కపిల్ సిబల్ వ్యాఖ్యలపై రాజ్యసభలో ఈమేరకు స్పందించారు నిర్మలా.

  • యూపీలో సంకీర్ణం తప్పదా..?

UP phase-1 assembly polls: ఉత్తర్​ప్రదేశ్ తొలి దశ ఎన్నికల్లో విజయం మాదేనంటూ అన్ని పక్షాలు ప్రకటించుకుంటున్నాయి. భాజపా జెండా అందనంత ఎత్తులో ఎగురుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. మరోవైపు, ఫలితాలు రాకముందే రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు విషయం స్పష్టమైందని సమాజ్​వాదీ అధినేత చెప్పుకొచ్చారు.

  • రైతు చట్టాలపై తోమర్​ వ్యాఖ్యలు..

Narendra Singh Tomar On Farm Laws: రద్దు చేసిన రైతుచట్టాలను భవిష్యత్తులో మళ్లీ తీసుకొచ్చే అవకాశం లేదని కేంద్ర వ్యయసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ వెల్లడించారు. మృతిచెందిన అన్నదాతల కుటుంబాలకు పరిహారం ఇచ్చే అంశం రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిందని అన్నారు.

  • కశ్మీర్​లో భద్రతా దళాలపై గ్రెనేడ్ దాడి..

Bandipora Grenade attack: జమ్ము కశ్మీర్​లో భద్రతా దళాలపై గ్రెనేడ్ దాడి జరిగింది. ఈ ఘటనలో ఓ పోలీసు తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురికి గాయాలయ్యాయి.

  • మెల్​బోర్న్​లో క్వాడ్​ దేశాల సమావేశం..

Quad news: ఇండో పసిఫిక్​లో స్వేచ్ఛాయుత వాతావరణం, శాంతి, స్థిరత్వమే లక్ష్యమని క్వాడ్ దేశాలు పునరుద్ఘాటించాయి. మెల్​బోర్న్​లో సమాశమైన క్వాడ్​ దేశాల విదేశాంగ మంత్రులు ఈ మేరకు ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. మరోవైపు చైనా మాత్రం ఎప్పటిలాగే అక్కసు వెళ్లగక్కింది.

  • టీ20 సిరీస్​కు కీలక ఆటగాళ్లు దూరం..

KL Rahul Axar patel injured: వెస్టిండీస్​తో ప్రస్తుతం జరుగుతున్న మూడో వన్డేలో టీమ్​ఇండియా కేఎల్​ రాహుల్ గాయపడ్డాడు. దీంతో అతడు టీ20 సిరీస్​కు దూరంకానున్నాడు. ఇక కరోనా నుంచి కోలుకున్న అక్సర్​ పటేల్ ఈ సిరీస్​కు అందుబాటులో ఉండట్లేదు. వీరిద్దరి స్థానాల్లో రుతురాజ్​ గైక్వాడ్​, దీపక్​ హూడా ఆడనున్నారు.

  • కొత్త సినిమాల ముచ్చట్లు..

Cinema updates: మెగాహీరో వరుణ్​తేజ్​ 'గని' సినిమా సెన్సార్​ పనులను పూర్తిచేసుకుని యూ/ఏ సర్టిఫికేట్​ను దక్కించుకుంది. కాగా, నాగార్జున, నాగచైతన్య నటించిన చిత్రం 'బంగార్రాజు' ఓటీటీ ట్రైలర్​ విడుదలైంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.