ETV Bharat / city

Top news: టాప్ న్యూస్ @ 9PM - తెలంగాణ వార్తలు

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు...

TELANGANA TOP TEN NEWS
TELANGANA TOP TEN NEWS
author img

By

Published : Feb 10, 2022, 9:01 PM IST

  • రేపు జనగామలో కేసీఆర్​ బహిరంగ సభ..

CM KCR Jangaon Visit: రేపు(ఫిబ్రవరి 11న) జనగామ జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటించనున్న నేపథ్యంలో.. కేసీఆర్‌ కృషికి కృతజ్ఞతగా జనగామలో బహిరంగ సభ నిర్వహిస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు తెలిపారు. ఈ సభలో లక్షకు పైగా ప్రజలు హాజరవుతారని మంత్రి తెలిపారు.

  • ప్రధాని మోదీకి ఆ హక్కు లేదు..

TRS MPs on Modi: కోట్లాది తెలంగాణ ప్రజల పోరాటాన్ని ప్రధాని మోదీ అవమానించారని తెరాస ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ కొత్త వివాదాలకు తెర తీస్తున్నారని ఆరోపించారు. ప్రధానిపై చర్యలు తీసుకోవాలని ప్రివిలేజ్‌ నోటీసు ఇచ్చామని తెలిపారు.

  • అంబేడ్కర్​ విగ్రహ ఏర్పాటుకు అడుగులు..

Ambedkar Statue: హైదరాబాద్​లో 125 అడుగుల అంబేడ్కర్​ విగ్రహ ఏర్పాటుకు ఒడిఒడిగా అడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగా గుజరాత్​లోని నర్మదా వ్యాలీలో నెలకొల్పిన భారత తొలి ఉపప్రధాని సర్దార్​ వల్లబ్​బాయ్​ పటేల్​ (Statue Of Unity) విగ్రహాన్ని మంత్రి కొప్పుల ఈశ్వర్​ సందర్శించారు. విగ్రహ ఏర్పాటు, నిర్వహణ, ఇతర అంశాలను అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు.

  • జనగామలో రెండోరోజూ ఉద్రిక్త పరిస్థితులు..

Tensions are high in Jangaon :జనగామ జిల్లాలో తెరాస, భాజపా కార్యకర్తల మధ్య ఘర్షణలు ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. నర్మెట్ట చౌరస్తాలో భాజపా, తెరాస కార్యకర్తలు పరస్పరం కర్రలతో దాడి చేసుకోగా పలువురి గాయాలయ్యాయి. ఘర్షణలో గాయపడిన పార్టీ శ్రేణులను పరామర్శకు బయలుదేరిన ఈటల రాజేందర్‌, రాజాసింగ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిహసించేలా తెరాస సర్కార్‌ వ్యవహరిస్తోందని భాజపా నేతలు ధ్వజమెత్తారు.

  • యూపీ తొలి విడత ఎన్నికలు ప్రశాంతం..

UP assembly election 1st phase: ఉత్తర్​ప్రదేశ్ ఎన్నికల్లో తొలి విడత పోలింగ్ పూర్తైంది. పలు చోట్ల ఈవీఎంలు మొరాయించడం మినహా.. పోలింగ్ అంతా ప్రశాంతంగానే సాగింది. సాయంత్రం 5 గంటల వరకు 57.79 శాతం ఓటింగ్ నమోదైందని ఈసీ అధికారులు ప్రకటించారు.

  • ఆ రాష్ట్ర ఎన్నికల తేదీలు మార్పు..

Manipur poll dates revised: మణిపుర్​ శాసనసభ ఎన్నికల తేదీల్లో మార్పులు చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. కొత్త తేదీల వివరాలు ఇలా ఉన్నాయి...

  • హిజాబ్​ వివాదంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు..

Karnataka High Court Hijab: హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. భావోద్వేగాలను రెచ్చగొట్టే విధంగా విద్యార్థులు ఎవరూ మతపరమైన దుస్తులు(హిజాబ్, కాషాయ కండువాలు) ధరించొద్దని ఆదేశించింది. శుక్రవారమే విద్యా సంస్థలను తెరవాలని స్పష్టం చేసింది.

  • దేశంలో కరోనా తగ్గుముఖం..

Corona Update: కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు మినహా దేశంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టిందని కేంద్రం వెల్లడించింది. ఆ రాష్ట్రాల్లో 50వేలకు పైగా యాక్టివ్​ కేసులు ఉన్నాయని పేర్కొంది.

  • నా క్రెడిట్​ అతను లాగేసుకున్నాడు..

Ajinkya Rahane News: చూడచక్కని షాట్లు ఆడుతూ టెస్టు స్పెషలిస్ట్​గా గుర్తింపు పొందిన క్రికెటర్​.. ఆజింక్య రహానే. గత కొన్ని నెలలుగా ఫామ్​ కోల్పోయిన ఈ క్రికెటర్​.. 2020-21లో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్​కు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆ సమయంలో తాను తీసుకున్న నిర్ణయాలకు వేరే వాళ్లు క్రెడిట్​ తీసుకున్నారంటూ పేర్కొన్నాడు.

  • శుక్రవారం విడుదలయ్యే సినిమాలు ఇవే..

February 11 release movies: ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మాస్​ మహారాజా రవితేజ 'ఖిలాడి', 'సెహరి', 'ఎఫ్​ఐఆర్​' సహా పలు చిత్రాలు శుక్రవారం(ఫిబ్రవరి 11) థియేటర్లలో రిలీజ్​ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి. మరికొన్ని ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. అవేంటో చూసేద్దాం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.