ETV Bharat / city

టాప్​టెన్ న్యూస్ @ 9AM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

telangana top ten news todaytill now
టాప్​టెన్ న్యూస్ @ 9AM
author img

By

Published : Feb 4, 2021, 8:59 AM IST

  • ప్రతిష్టంభనకు తెరపడేదెప్పుడు?

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీలో అన్నదాతలు ఆందోళన చేపట్టారు. ఓవైపు కొవిడ్​ ప్రమాదం, మరోవైపు ఎముకలు కొరికే చలిని లెక్కచేయకుండా రెండు నెలలకు పైగా తమ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. కేంద్రంతో రైతు సంఘాలు 11దఫాలుగా చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది. 'ఎద్దు ఎండకు- ఎనుబోతు నీడకు' చందంగా ఉన్న ఈ ప్రతిష్టంభనకు తెరపడేదెప్పుడు? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • అయోధ్యలో ఆ స్థలం మాదే..

అయోధ్యలో మసీదు నిర్మాణానికి ప్రభుత్వం కేటాయించిన ఐదెకరాల స్థలం తమదే అంటూ దిల్లీకి చెందిన ఇద్దరు మహిళలు అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దేశ విభజన సమయంలో తమ తండ్రికి ఈ స్థలాన్ని అప్పగించారని పేర్కొన్నారు. ఈ స్థలాన్ని బదిలీ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • అందులో.. తెలంగాణ వెనకబాటు

మారుతున్న ప్రపంచంలో కంప్యూటర్​ కీలక పాత్ర పోషిస్తోంది. కంప్యూటర్​, ల్యాప్​టాప్​ల్లో ఇంటర్నేట్​ ఉపయోగించి అనేక పనులు చేసుకుంటున్నాం. ఇలాంటి కంప్యూటర్​ విద్యలో తెలంగాణ వెనకబడింది. కంప్యూటర్‌ ప్రయోగశాలలున్న పాఠశాలల సంఖ్యలో రాష్ట్రం చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • చెంప చెళ్లుమంది

సరకులు తీసుకోడానికి వచ్చిన లబ్ధిదారుడిపై రేషన్​ డీలర్​ చేయిచేసుకున్నాడు. ఈ ఘటన భూపాలపల్లి జిల్లా మహదేవపూర్​ మండలం ఎలికేశ్వరంలో జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • చిరుత, శునకం.. వీడియో వైరల్​!

కర్ణాటకలో గమ్మత్తయిన ఘటన జరిగింది. అడవిలో ఉండాల్సిన చిరుత ఓ ఇంటి మరుగుదొడ్డిలో దర్శనమిచ్చింది. అక్కడే శునకం ఉన్నా.. ఆ పులి ఏం చేయలేకపోయింది. ఓ మూలన నక్కి కూర్చుంది. సంబంధిత దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అవుతున్నాయి. అసలు ఆ పులి ఇంట్లోకి ఎలా వచ్చింది. ఇది చదవండి మరి.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • ఇరు దేశాల మధ్య లోతైన బంధం

భారత్-నేపాల్ మధ్య సంబంధాలు క్షీణించలేదని నేపాల్ మంత్రి రామ్​బిర్ మనంధర్ తెలిపారు. కరోనా కారణంగా వర్తకానికి ఆటంకాలు ఎదురయ్యాయని, త్వరలోనే అదికూడా పునరుద్ధరణ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరుదేశాల మధ్య లోతైన బంధం ఉందన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • మరో కోటి కొవిషీల్డ్​ డోసులు ఆర్డర్​

దేశవ్యాప్తంగా కరోనా టీకా పంపిణీని కేంద్రం వేగవంతం చేస్తోంది. మరో కోటి డోసుల కోసం సీరం సంస్థకు ఆర్డర్​ పంపింది. ఈ మేరకు అధికార వర్గాలు వెల్లడించాయి. భారత్​లో ఇప్పటివరకు 41 లక్షలమందికిపైగా ఆరోగ్య కార్యకర్తలు టీకా పొందారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • సిరియాపై క్షిపణుల వర్షం!

దక్షిణ సిరియా ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్​ క్షిపణులతో విధ్వంసం సృష్టించింది. ఈ దాడిలో ప్రాణనష్టమేమీ జరగలేదని సిరియా సైనిక వర్గాలు తెలిపాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • బడ్జెట్‌ కేటాయింపుల సవరణ

ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్​లో క్రీడలకు కేటాయించిన మొత్తంపై కోత విధించడంపై క్రీడల మంత్రి కిరణ్​ రిజిజు స్పందించారు. అవసరమైతే కేటాయింపులను సవరించడానికి సిద్ధమని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • బాలీవుడ్​లో బెల్లంకొండ మకాం

టాలీవుడ్ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం బాలీవుడ్​లో 'ఛత్రపతి' రీమేక్​లో నటిస్తున్నాడు. తాజాగా ఇతడు ముంబయి జుహూలో ఓ ఖరీదైన ఫ్లాట్​ను అద్దెకు తీసుకుని అక్కడే నివాసముంటున్నాడని సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.