- నేడు తెరాస రాష్ట్ర కార్యవర్గ భేటీ
తెరాస రాష్ట్ర కార్యవర్గ భేటీ నేడు జరగనుంది. తెలంగాణ భవన్‌లో మధ్యాహ్నం రెండు గంటలకు గులాబీ దళపతి, ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సమావేశం కానుంది. ఏప్రిల్ 27న తెరాస ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జరగనున్న ప్లీనరీ సమావేశాలు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికపైనా సమావేశంలో చర్చించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- ఖమ్మంలో కాంగ్రెస్ నేతల పర్యటన..
2018 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా తెరాస ప్రభంజనం సృష్టించినా.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. ఇదంతా గతం.. మారిన రాజకీయ పరిణామాలు, నలుగురు హస్తం ఎమ్మెల్యేలు తెరాస గూటికి చేరడం, అనంతరం జరిగిన ఎన్నికల్లోనూ పార్టీ ప్రభావం కోల్పోయింది. ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు, పట్టభద్రుల ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చే లక్ష్యంగా.. పీసీసీ అగ్రనేతలు నేడు ఖమ్మంలో పర్యటిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- కోఠిలో అగ్నిప్రమాదం..
హైదరాబాద్ కోఠిలో అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ వస్త్ర దుకాణంలో చెలరేగిన మంటలు.. పక్కనున్న దుకాణాల్లోకి వ్యాపించాయి. ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- నేడు బంగాల్‌కు మోదీ..
అసోం, బంగాల్లో ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. ఇందులో భాగంగా బంగాల్లో రూ.4,700కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. హల్దియాలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో రెండో యూనిట్‌కు శంకుస్థాపన చేయనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- అలా చేసి ఉండకూడదు
చక్కా జామ్‌ను ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో నిర్వహించకూడదన్న రైతు నేత టికాయత్ నిర్ణయం.. ఓ తొందరపాటు చర్య అని అభిప్రాయపడ్డారు సీనియర్ రైతు నేత దర్శన్ పాల్. మీడియాకు ప్రకటించే ముందు తమతో చర్చించి ఉండాల్సిందని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- ఆకర్షణీయమైన డిజైన్లతో బతుకమ్మ చీరలు
బతుకమ్మ పండుగకు ప్రభుత్వం ఆడపడుచులకు ఇచ్చే బతుకమ్మ చీరలు ఈ ఏడాది మరింత ఆకర్షణీయ డిజైన్లతో రాబోతున్నాయి. ఇందుకు సంబంధించి ఇప్పటికే రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో చీరలు తయారీ మొదలైంది. సిరిసిల్లలోని వస్త్రోత్పత్తి పరిశ్రమ ఈ ఏడాది 9 నెలల ముందు నుంచే చీరల ఉత్పత్తిని ప్రారంభించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- పెట్రో సెగ
దేశంలో ఇంధన రేట్లు రోజుకో స్థాయిలో పెరిగిపోతున్నాయి. సగటున లీటర్ పెట్రోల్ ధర రూ.93, డీజిల్ రేటు రూ.85కు చేరింది. వాస్తవ ధరకు భారీగా కేంద్ర, రాష్ట్రాల పన్నులు తోడు కావడం వల్ల.. అంతర్జాతీయంగా పెరుగుతున్నప్పుడల్లా ఇక్కడ ధరలు మండిపోతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు తగ్గించేందుకు విముఖత చూపడం వల్ల ఇప్పట్లో ధరలకు కళ్లెం వేయడం కష్టతరంగా మారింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- చొరబాటు
ఎయిర్‌ఫోర్స్ వన్‌గా పిలిచే అమెరికా.. దేశాధ్యక్షుడి విమానంలోకి ప్రవేశించేందుకు ఒక దుండగుడు విఫలయత్నం చేశాడు. అయితే ఉపాధ్యక్షురాలి విమానంలోకి ప్రవేశించిన అతన్ని అమెరికా రక్షణ శాఖ అదుపులోకి తీసుకుంది. ఈ ఘటన కలకలం సృష్టించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- ఏదీ కలిసి రావట్లేదు
చెన్నై వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న తొలి టెస్టులో ఆతిథ్య భారత్‌కు ఏదీ కలిసిరావట్లేదు. టాస్ దగ్గర్నుంచి ప్రతిదీ ప్రతికూలంగానే తయారైంది. వీటికి తోడు టీమ్ఇండియా ఆటగాళ్లు చేస్తున్న ఫీల్డింగ్ తప్పిదాలూ పర్యటక జట్టుకు లాభిస్తున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- మరో 'రంగస్థలం'
తన మేనల్లుడు వైష్ణవ్‌తేజ్ హీరోగా తెరకెక్కిన 'ఉప్పెన' చిత్రం మరో 'రంగస్థలం' అవుతుందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఈ సినిమా ఓ దృశ్యకావ్యం, అద్భుతం అని చెప్పడంలో అతిశయోక్తి లేదని ఆయన అన్నారు. శనివారం జరిగిన 'ఉప్పెన' సినిమా ముందస్తు వేడుకలో చిరు ఈ విధంగా మాట్లాడారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి