ETV Bharat / city

టాప్​టెన్ న్యూస్ @9AM - telangana today top news

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

telangana top ten news today till now
టాప్​టెన్ న్యూస్ @9AM
author img

By

Published : Jan 31, 2021, 8:58 AM IST

  • పోలియో చుక్కల కార్యక్రమం ప్రారంభం

రాష్ట్రవ్యాప్తంగా పల్స్‌ పోలియో కార్యక్రమం ప్రారంభమైంది. ఇవాళ్టి నుంచి మూడు రోజులపాటు పోలియో చుక్కలు వేయనున్నారు. హైదరాబాద్‌లో మాత్రం ఫిబ్రవరి 3న కూడా ఈ కార్యక్రమం కొనసాగించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • వాలంటీర్లా.. ఎస్​జీటీలా?

తెలంగాణ వ్యాప్తంగా ఫిబ్రవరి 1 నుంచి విద్యాసంస్థలు తెరుచుకోనున్నా.. పలు సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు. 9, 10 తరగతుల విద్యార్థులకు పాఠశాలలు ప్రారంభమవుతుండగా వాలంటీర్లను విధుల్లోకి తీసుకునేదీ లేనిదీ విద్యాశాఖ స్పష్టం చేయలేదు. వారికి బదులు ఈసారి ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో పనిచేసే సెకండరీ గ్రేడ్‌ టీచర్లను(ఎస్‌జీటీలను) వినియోగించుకోవాలని పాఠశాల విద్యాశాఖ యోచిస్తున్నా దానిపై నిర్ణయం తీసుకోలేదు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • కొత్త ప్రణాళిక

కొత్త ఏడాదిలో కాకతీయ విశ్వవిద్యాలయ దూర విద్యాకేంద్రం నూతన ప్రణాళికలతో ముందుకొస్తోంది. విద్యార్ధుల సంఖ్య పెంచుకునేందుకు ప్రత్యేక చర్యలు ప్రారంభించింది. యూట్యూబ్ ద్వారా ఆన్‌లైన్ పాఠాలు అందించేందుకు... అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. సబ్జెక్టు పరంగా నిష్ణాతులైన వారితో సీడీలనూ తయారు చేసి విద్యార్థులకు అందించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • యూపీలో మరో దారుణం

ఉత్తర్​ప్రదేశ్​లో మరో దారుణం వెలుగు చూసింది. మైనర్​పై ఓ క్రూరుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో నిందితుడికి బాలిక అత్త కూడా సహకరించగా.. వారిద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • రాబందులు

దేశవ్యాప్తంగా పిల్లల్ని ఎత్తుకెళ్లే రాబందులు క్రమంగా పుట్టుకొస్తూనే ఉన్నాయి. వాళ్ల ఆనుపానుల్ని పసిగట్టాల్సిన పోలీసులే ఆయా కేసులను మూసేస్తున్నారని ఆరోపిస్తూ.. తెలంగాణ హైకోర్టులో ఇటీవల ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. అలా మూసివేసిన కేసుల్ని పునఃపరిశీలించి విచారణ చేపట్టడం సహా.. ఇందులో కేంద్ర ప్రభుత్వాన్నీ భాగస్వామ్యం చేయాలని ఉన్నత న్యాయస్థానం తాజాగా సూచించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • రక్షణ బడ్జెట్‌పైనా కొవిడ్‌ ప్రభావం

ఎప్పటిలాగే వంకర బుద్ధి ప్రదర్శిస్తూ ఉన్న పాకిస్థాన్​.. మరోవైపు కయ్యాలమారి చైనా.. ఈ రెండు దేశాలను ఏకకాలంలో ఢీకొనడానికి భారత్​ సిద్ధంగా ఉండక తప్పడం లేదు. ఇందుకు భారీగానే వ్యయం చేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ ఏటి బడ్జెట్లో రక్షణ కేటాయింపులు పెంచుతారన్న అంచనాలు జోరుగా వినిపిస్తున్నాయి. అయితే.. ఈ కేటాయింపులపై 'కొవిడ్'‌ ప్రభావం తప్పక ఉంటుందని నిపుణులు అంటున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • లోగో మార్చిన మింత్రా..

మహిళల గౌరవానికి భంగం కలిగించే విధంగా లోగో ఉందంటూ వచ్చిన ఫిర్యాదుల అనంతరం.. స్వల్ప మార్పులు చేసింది ఆన్​లైన్​ దుస్తుల విక్రయ సంస్థ. కొత్త లోగోను మింత్రా వెబ్​సైట్​, యాప్​లోనూ మార్చింది. లోగో విషయంలో కంపెనీ తీసుకున్న నిర్ణయాన్ని నెటిజన్లు స్వాగతించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • వైరస్​ను హతమార్చే కొత్త సాధనం

గాల్లోని సూక్ష్మ తుంపర్లలో వైరస్ను హతమార్చే కొత్త సాధనాన్ని రూపొందించారు అమెరికన్​ శాస్త్రవేత్తలు. కరోనా వైరస్​ వ్యాప్తిని నియంత్రించే వినూత్న విధానాలకు ఇది తోడ్పడుతుందని వారు పేర్కొన్నారు. తాము రూపొందించిన సాధనం విజయవంతంగా పనిచేస్తే.. అతినీలలోహిత, రసాయన సాధనాల కన్నా వేగంగా శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టేందుకు సూక్ష్మతరంగాలను ఉపయోగించవచ్చని ఓ పరిశోధకుడు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • బోపన్నకు జోడీగా బెన్​

ఆస్ట్రేలియన్​ ఓపెన్​లో జోడీ కోసం ఎదురుచూస్తున్న భారత ప్లేయర్​ బోపన్నకు భాగస్వామి దొరికాడు. జపాన్​ ఆటగాడు బెన్​ మెక్​లాచ్లన్​తో కలిసి పురుషుల డబుల్స్​లో ఆడనున్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • ‌సెట్‌లో సేఫ్‌గా అనిపించలేదు

లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా ఇటీవల చిత్రీకరణలు పునఃప్రారంభమయ్యాయి. సెట్స్​లో అన్ని రకాల నిబంధనలు, జాగ్రత్తలు పాటిస్తూ షూటింగ్​లు జరుగుతున్నాయి. అయితే ఇవ్వన్ని పాటించినప్పటికీ చిత్రీకరణ జరిగే లొకేషన్స్​ను సురక్షితంగా భావించలేకపోతున్నానని అంటోంది బాలీవుడ్​ హీరోయిన్​ ప్రియాంకా చోప్రా. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.