- నేడు డీసీజీఐ కీలక ప్రకటన
దేశంలో కరోనా టీకా వినియోగం, అనుమతుల విషయంపై నేడు కీలక ప్రకటన చేయనుంది డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ). ఉదయం 11 గంటలకు డీసీజీఐ డైరెక్టర్ జనరల్ మీడియాతో మాట్లాడనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- రాష్ట్రంలో వ్యాక్సినేషన్ విజయవంతం
రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ కోసం చేపట్టిన డ్రైరన్ విజయవంతంగా ముగిసింది. ప్రభుత్వం ముందుగా నిర్ణయించిన 7 కేంద్రాల్లో రెండు గంటల పాటు డ్రైరన్ సాగింది. వివరాలను అధికారులు కొవిన్ సాఫ్ట్‌వేర్‌లో పొందుపరిచిన అధికారులు... పూర్తివివరాలను కేంద్ర ప్రభుత్వానికి పంపించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- ఉద్యోగ సంఘాలతో సంప్రదింపులు
ఉద్యోగ సంఘాలతో రాష్ట్రప్రభుత్వం సంప్రదింపులకు సిద్ధమవుతోంది. వేతనసవరణ, పదవీవిరమణ వయస్సు పెంపు సహా.. ఉద్యోగుల సంబంధిత అంశాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ చర్చలు జరపనుంది. వచ్చే వారంలోనే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని.. అధికారులు భావిస్తున్నారు. అటు పదోన్నతుల ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- పెరిగిన భూగర్భ జలమట్టం
రాష్ట్రంలో భూగర్భ జలమట్టం పెరిగింది. 2019 డిసెంబరుతో పోలిస్తే 2020 చివరినెలలో సగటున 2.46 మీటర్ల మేర పెరిగింది. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురవడం, తుఫాన్లు రావడం, నదులు, వాగులు, చెరువుల్లో నీటి నిల్వలు పెరగడంతో జలమట్టం పెరుగుదల నమోదైంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- కార్యాలయాల్లో కునుకుతీస్తే ఇక వేటే!
కార్యాలయాల్లో విధులు నిర్వర్తిస్తున్నప్పుడు అప్పుడప్పుడూ కునుకు తీస్తున్నారా? పై అధికారులు, ఇతర సిబ్బందితో దురుసుగా ప్రవర్తిస్తున్నారా? అయితే.. ఇకపై అలాంటివి మానుకోవాల్సిందే. విధి నిర్వహణలో ఉద్యోగి నిద్రపోవడం దుష్ప్రవర్తన కిందకే వస్తుందని కేంద్ర కార్మిక శాఖ తెలిపింది. ఇలాంటి 23 వ్యవహారాలను ప్రవర్తనా నియమావళి కింద పేర్కొంటూ.. ముసాయిదా రూపొందించింది. ఆ ముసాయిదాలోని మరిన్ని అంశాలు ఎలా ఉన్నాయంటే.? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- ట్రిపుల్ తలాఖ్ కేసుల్లో ముందస్తు బెయిల్
ముమ్మారు తలాఖ్ కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేయొచ్చని సుప్రీం కోర్టు తెలిపింది. 2019 చట్టంలోని బెయిల్ నిషేధ నిబంధనలు తలాఖ్ చెప్పిన భర్తకు మాత్రమే వర్తిస్తాయని, బాధితురాలి అత్తకు వర్తించవని పేర్కొంది. అయితే.. బెయిలిచ్చే ముందు బాధితురాలి వాదన వినాలని స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- ఒకేసారి 3 మతాల కీర్తనలు
కశ్మీర్ పేరు వినగానే తుపాకీ చప్పుళ్లు, ఉగ్రమూకల దాడులు గుర్తొస్తాయి. అయితే అక్కడ ఓ ప్రాంతంలో ఐకమత్యం వెల్లివిరుస్తోంది. శాంతి, సోదర భావంతో కలిసి మెలుగుతూ.. ప్రశాంతమైన జీవనాన్ని ఆస్వాదిస్తున్నారు ప్రజలు. అంతేకాదు.. అక్కడి మసీదు నుంచి అజాన్, గుడి గంటలు, గురుద్వారా కీర్తనలు ఏకకాలంలో వినిపిస్తాయట. శ్రీనగర్- కొహి మరాన్లోని హజ్రత్ ముఖ్దూమ్ సాహెబ్ దీనికి నిలయం. అన్ని మతాల వారు క్యూ కట్టే ఈ దర్గాపై ప్రత్యేక కథనం... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- కోటీశ్వరుడిగా ఎలా మారాలో తెలుసా?
పొదుపు మార్గాల ద్వారా కోటి రూపాయలు సంపాదించాలని ఉందా? క్రమం తప్పకుండా పెట్టుబడులు పెట్టి కోటీశ్వరుల జాబితాలోకి చేరాలని ఉందా? మరి దీనికి ఏ అంశాలు దోహదం చేస్తాయి, ఎంత సమయంలో కోటీశ్వరులు అవుతారో తెలుసా? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- రోహిత్.. ఎక్కడ ఆడతాడు?
ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న టీమ్ఇండియాకు మరో చిక్కొచ్చిపడింది. క్వారంటైన్ ముగించుకుని, వైస్ కెప్టెన్‌గా నియమితుడైన రోహిత్ శర్మను ఏ స్థానంలో ఆడించాలా అని? ఈ విషయమై మేనేజ్మెంట్ ప్రస్తుతం ఆలోచన చేస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- మాకు అలాంటి పాత్ర వస్తే!
ప్రస్తుతం కథానాయికలుగా గుర్తింపు తెచ్చుకున్న కొందరు ముద్దుగుమ్మలు.. తమకు కొన్ని డ్రీమ్‌రోల్స్ ఉన్నాయని, అలాంటివి వస్తే పూర్తి న్యాయం చేస్తామని చెబుతున్నారు. వాటి గురించిన సంగతుల్ని పంచుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి