ETV Bharat / city

7PM TOPNEWS: 7పీఎం తెలంగాణ టాప్​న్యూస్ - తెలంగాణ టాప్​న్యూస్

ఇప్పటివరకు ఉన్న ప్రధానవార్తలు

7PM TOPNEWS
7PM TOPNEWS
author img

By

Published : Aug 11, 2022, 6:58 PM IST

  • యమునా నదిలో పడవ మునక.. 50 మందితో వెళ్తుండగా..!

ఉత్తర్​ప్రదేశ్​ బాందా జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. యమునా నదిలో పడవ మునిగిపోగా.. ఇప్పటివరకు నాలుగు మృతదేహాలను వెలికితీశారు. కొందరు ఈత కొట్టుకుంటూ ఒడ్డుకు చేరుకున్నట్లు పోలీసులు తెలిపారు. మొత్తం బోట్​లో 50 మంది ఉన్నట్లు తెలుస్తోంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మర్కా పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఈ ఘటన జరిగింది.

  • ముగ్గురు బాలికలపై రేప్.. కూల్​డ్రింక్​లో మత్తుమందు కలిపి..

ముగ్గురు విద్యార్థినిలపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కిరాతకుడు. జులై 6న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై దిల్లీ మహిళా కమిషన్ ఛైర్​పర్సన్ సీరియస్ అయ్యారు. ఆగస్టు 14లోగా నిందితులపై.. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారో నివేదిక సమర్పించాలని ఆదేశించారు.

  • కొనసాగుతోన్న మంత్రివర్గ భేటీ.. వాటిపైనే చర్చ..!

సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో మంత్రివర్గం భేటీ కొనసాగుతోంది. రాష్ట్రానికి అదనపు ఆర్థిక వనరులు, ఇతర అంశాలపై మంత్రివర్గం చర్చిస్తున్నట్టు సమాచారం. కొత్త పెన్షన్లు, డయాలసిస్ రోగులకు ఆసరా పింఛన్లు, అనాథపిల్లల సంక్షేమం కోసం చర్యలు, స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా 75 మంది ఖైదీల విడుదల సహా ఇతర అంశాలపై కేబినెట్ చర్చిస్తున్నట్టు తెలుస్తోంది.

  • పొలాల్లో ఇసుక మేటలు.. అన్నదాతల ఆవేదన

అధిక వర్షాలతో జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా రైతులు తీవ్రంగా నష్టపోయారు. పలు చోట్ల చెరువులు, వాగులు వంకలు పొంగిపొర్లటంతో దిగువ ఉన్న పొలాల్లోని పంట కొట్టుకుపోయింది. దీనికి దోడు ఇసుక మేటలు వేయడంతో... వాటిని తొగించేందుకు రైతులు నానా అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం సాయం అందించాలని అభ్యర్థిస్తున్నారు.

  • 'నేను ఉపరాష్ట్రపతి కావాలనుకున్నానా?'..

భాజపా ఎంపీ సుశీల్​ కుమార్​ మోదీ చేసిన ఆరోపణల్ని ఖండించారు బిహార్​ ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్​. తనకు ఉపరాష్ట్రపతి కావాలన్న కోరికలేం లేవని, మోదీ చెప్పింది అవాస్తవమని అన్నారు.

  • రాష్ట్రంలో బూస్టర్​డోసుకు డిమాండ్..

రాష్ట్రంలో బూస్టర్​డోసుకు డిమాండ్ పెరిగింది. ఇదే సమయంలో.. రాష్ట్ర స్థాయి వ్యాక్సిన్ స్టోరీజీ కేంద్రంలో ఒక్క కొవిషీల్డ్ డోసుల నిల్వలు నిండుకున్నాయి. కేంద్రం నుంచి కొత్త డోసులు అందుబాటులోకి రాకపోతే ఒకటి రెండు రోజుల్లో రాష్ట్రంలో వ్యాక్సిన్ కొరత ఏర్పడే ప్రమాదం కూడా ఉంది.

  • దర్జాగా పడుకొని ఫ్లైట్​లో సిగరెట్ స్మోకింగ్..

స్పైస్‌ జెట్‌ విమానంలో సీట్లపై పడుకొని దర్జాగా సిగరెట్‌ కాల్చిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. దుబాయ్​ నుంచి దిల్లీకి వచ్చే విమానంలో ఈ ఘటన జరిగింది. గురుగ్రామ్‌కు చెందిన బల్విందర్‌ కటారియా అనే వ్యక్తి ఇలా చేశాడు.

  • రక్షాబంధన్‌.. ఏ గిఫ్ట్‌ ఇవ్వాలో ఆలోచిస్తే.. ఇది మీకోసమే!!

సోదర సోదరీమణుల మధ్య ప్రేమానురాగాలకు ప్రతీక ఈ రాఖీపౌర్ణమి. ప్రేమ అనే రాఖీను చేతికి కట్టి.. ఆప్యాయతానురాగాల తీపిని పంచి.. "నువ్వు నాకు రక్ష.. నేను నీకు రక్ష" అనే జీవితపు హామీ తీసుకునే పండగే ఈ రక్షాబంధన్​.

  • ఖర్చులు తగ్గించుకోవాలా? '30 డేస్ రూల్​' ట్రై చేయండి!

నెల‌కు రూ.50 వేల నుంచి రూ.70 వేలు సంపాదించే వారికి అదనంగా రూ. 1000 - రూ.1500 ఖ‌ర్చు చేయ‌డం పెద్ద‌గా అనిపించ‌దు. కానీ, ఇలాంటి చిన్న చిన్న కొనుగోళ్లు మీకు తెలియ‌కుండానే ఖర్చుల‌ను పెంచేస్తాయి. అటువంటి కొనుగోళ్లను నివారించేందుకు ఒక చ‌క్క‌టి పరిష్కారం 30-రోజుల నియమం.

  • నేను పోషించిన ఆ పాత్ర చూసి పెళ్లి కాదన్నారు: ఎమ్​సీఏ విలన్​

ఎమ్​సీఏ సినిమాతో ప్రతినాయకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న విజయ్‌ వర్మ నటించిన తాజా చిత్రం డార్లింగ్స్​. ఇందులో అతడి నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ సందర్భంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అతడు ఓ ఇంట్రెస్టింగ్​ విషయాన్ని చెప్పాడు. అదేంటంటే..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.