ETV Bharat / city

Telangana Top News: టాప్​న్యూస్ @7PM - టాప్​న్యూస్ 7PM

ఇప్పటివరకు ఉన్న ప్రధానవార్తలు

7PM TOPNEWS
7PM TOPNEWS
author img

By

Published : Aug 7, 2022, 6:58 PM IST

  • చైనాపై నిఘా కోసం భారత్​ సరికొత్త అస్త్రం!

సరిహద్దుల్లో చైనాతో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ.. భారత్‌ సరికొత్త అస్త్రాన్ని సిద్ధం చేస్తోంది. వాస్తవాధీన రేఖ, హిందూ మహా సముద్రం వెంబడి చైనా కార్యకలాపాలపై నిఘా కోసం అధునాతన డ్రోన్లను హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ అభివృద్ధి చేస్తోంది.

  • నేతన్నకు మద్దతుగా ప్రభుత్వాధికారులు..

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా సోషల్​ మీడియాలో నేతన్నకు పూర్తి మద్దతు లభిస్తోంది. అటు సాధారణ ప్రజల నుంచి ఇటు ప్రజాప్రతినిధులే కాకుండా ప్రభుత్వ అధికారులు సైతం నేతన్నకు అండగా నిలబడుతూ.. తమ మద్దతు ప్రకటిస్తున్నారు.

  • 'నీతి ఆయోగ్‌ సమావేశాన్ని బహిష్కరించడం తెలంగాణకు మంచిది కాదు'

నీతి ఆయోగ్‌పై నిన్న సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పందించారు. సీఎం కేసీర్​ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టిన కిషన్​రెడ్డి.. నీతి ఆయోగ్‌ సమావేశాన్ని బహిష్కరించడం తెలంగాణకు మంచిది కాదని వ్యాఖ్యానించారు.

  • 'సీఎం కేసీఆర్​.. నెంబర్​ వన్​ తెలంగాణ ద్రోహి..'

మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని యాదాద్రి భువనగిరి జిల్లాలోని భూదాన్ పోచంపల్లిలో ఏర్పాటు చేసిన చేనేత కార్మికుల సమ్మేళనంలో బండి సంజయ్ పాల్గొన్నారు. తెరాస ప్రభుత్వంలో చేనేత పరిశ్రమ నిర్వీర్యమైందని బండి సంజయ్​ ఆరోపించారు.

  • ప్రపంచానికే భారత్​ దిక్సూచి..

నీతి ఆయోగ్​ పాలక మండలి సమావేశంలో అన్ని రాష్ట్రాలకు కీలక సూచనలు చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. పంటల్లో వైవిధ్యం కనబరచాలని, నూనెగింజల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. 2047 లక్ష్యాల గురించి వివరించారు.

  • రిపోర్టర్​గా మారిన స్టూడెంట్​.. స్కూల్ గుట్టు రట్టు..

చిన్న రిపోర్టర్​.. బెస్ట్​ కవరేజ్​.. దిగొచ్చిన అధికారులు.. ఇద్దరు టీచర్లు సస్పెండ్​.. ఇదంతా ఏంటి అనుకుంటున్నారా?.. ఝార్ఖండ్​కు చెందిన ఓ 12 ఏళ్ల విద్యార్థి రిపోర్టర్​గా మారి తన పాఠశాల దుస్థితిని వెలుగులోకి తీసుకొచ్చిన ప్రయత్నానికి ఫలితమిది. అసలేంటీ చిన్న రిపోర్టర్​ కథ? ఓసారి చూద్దాం రండి.

  • పసిడి' పోరులో భారత్ గెలిచేనా?..

కామన్వెల్త్‌ గేమ్స్‌లో తొలిసారి ప్రవేశపెట్టిన మహిళల క్రికెట్‌ విభాగంలో టీమ్‌ఇండియా.. ఫైనల్‌లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ నేపథ్యంలో భారత్‌, ఆసీస్‌ జట్ల బలాలు.. అనుకూలతలు ఏంటో ఓసారి పరిశీలిద్దాం..

  • బాక్సింగ్​, ట్రిపుల్​ జంప్​లో మూడు గోల్డ్​.. ఫైనల్​కు సింధు..

కామెన్వెల్త్​ క్రీడల్లో భాగంగా భారత్​ ఖాతాలో మరో ఏడు పతకాలు వచ్చి చేరాయి. బాక్సింగ్​లో పురుషుల ఫ్లైవెయిట్‌లో అమిత్‌ పంగల్‌, మహిళల మినిమమ్‌ వెయిట్‌లో నితూ గంఘాస్‌లు బంగారు పతకాలు సాధించారు. ప్రత్యర్థి ఇంగ్లీష్‌ బాక్సర్‌ కియరన్‌ మెక్‌డొనాల్డ్‌పై అమిత్‌ పూర్తి ఆధిపత్యం చలాయించాడు.

  • గూగుల్​ స్ట్రీట్​ వ్యూ మళ్లీ వచ్చేసింది.. మరి మీ ఇంటిని బ్లర్​ చేశారా?

చిన్న చిన్న రహదారులు, అక్కడున్న ఇళ్లు.. చిన్న చిన్న వీధులు.. 360 డిగ్రీల కోణంలో కళ్లకు కట్టినట్లుగా చూపించేందుకు గూగుల్​ స్ట్రీట్​ వ్యూ మళ్లీ వచ్చేసింది. దీంట్లో.. మీ ఇల్లు కూడా కనిపిస్తుంది. అది మీ వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించొచ్చు.

  • అద్దెకు ఉండాలా? ఇల్లు కొనాలా? ఏది బెటర్?

ఏళ్ల తరబడి అద్దె ఇంట్లోనే ఉండాలా? లేక రుణం తీసుకుని ఇల్లు కొనాలా? అనేక మందిని వేధించే ప్రశ్నకు సమాధానమే ఈ కథనం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.