ETV Bharat / city

Telangana News Today: టాప్‌ న్యూస్ @7PM - టాప్‌ న్యూస్ 7పీఎం

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

7PM TOPNEWS
7PM TOPNEWS
author img

By

Published : Aug 3, 2022, 6:58 PM IST

  • 'గాంధీ'లకు ఈడీ బిగ్ షాక్.. ఆ ఆఫీస్​ సీజ్​..

నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్​ఫోర్స్​మెంట్​ డైరక్టరేట్ దూకుడు పెంచింది. దిల్లీలోని యంగ్ ఇండియన్​ సంస్థ కార్యాలయాన్ని తాత్కాలికంగా సీల్ చేసింది. మరోవైపు.. కాంగ్రెస్​ ప్రధాన కార్యాలయం, సోనియా గాంధీ నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించడం చర్చనీయాంశమైంది.

  • ఎన్నికల్లో ఉచిత హామీలు.. సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు..

ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల ఉచిత హామీలపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇది తీవ్రమైన ఆర్థిక సమస్యగా అభివర్ణించిన సీజేఐ జస్టిస్​ ఎన్​వీ రమణ.. దీనిని పరిశీలించేందుకు ఒక అత్యున్నత కమిటీ ఏర్పాటు దిశగా సూచనలు కోరారు.

  • 'కాంగ్రెస్‌లోనే ఉంటూ మూడేళ్లుగా భాజపా బ్రాండ్ అంబాసిడర్‌గా..'

రాజకీయ జన్మనిచ్చిన కాంగ్రెస్‌కు కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి వెన్నుపోటు పొడిచారని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి దుయ్యబట్టారు. ఆయన మాటలకు కాంగ్రెస్ శ్రేణులు ధీటుగా సమాధానం చెబుతాయని మల్లు రవి పేర్కొన్నారు.

  • 'సిద్ధం కండి.. ఏ క్షణమైనా పిడుగు లాంటి వార్త వినొచ్చు..'

రాష్ట్రంలో ఓవైపు మునుగోడు ఉపఎన్నిక.. మరోవైపు ముందస్తు ఎన్నికల గురించి ఆసక్తికర చర్చ నడుస్తోన్న నేపథ్యంలో.. మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో పర్యటించిన మాజీమంత్రి తుమ్మల.. ముందస్తు ఎన్నికల గురించి కార్యకర్తలకు చూచాయగా సిగ్నల్స్​ ఇచ్చారు.

  • 'కాళేశ్వరం ప్రాజెక్టు మూడేళ్లకే ముంపునకు ఎలా గురైందో సీఎం చెప్పాలి'

ప్రపంచంలోనే అద్భుతమైన కట్టడం కాళేశ్వరం ప్రాజెక్టు అని గొప్పలు చెప్పిన సీఎం కేసీఆర్‌ మూడేళ్లకే ఎలా ముంపునకు గురైందో చెప్పాలని వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ప్రశ్నించారు. కేవలం కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని ఆమె విమర్శించారు.

  • పాలేరులో పెద్ద ఎత్తున చనిపోయిన చేపలు..

నిండుగా నీళ్లలో కళకళలాడుతున్న పాలేరు జలాశయం ఇవాళ అందరిని అవాక్కైయేలా చేసింది. ఉదయం జలాశయం వద్దకు వెళ్లిన స్థానికులకు పెద్దఎత్తున చేపలు చనిపోయి కనిపించాయి. చిన్న సైజులో ఉన్న చేపలే ఎక్కువగా చనిపోయాయి. విషప్రయోగం వల్లే చేపలు చనిపోయి ఉంటాయని మత్స్యకారులు అనుమానిస్తున్నారు.

  • 'రాహుల్​ ప్రధాని అవుతారు'.. స్వామీజీ జోస్యం.. ఇంతలోనే..

కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీ ప్రధాని అవుతారని ఓ స్వామీజీ జోస్యం చెప్పారు. నానమ్మ ఇందిరా గాంధీ, తండ్రి రాజీవ్​ గాంధీ ప్రధాని అయ్యారని.. ఇప్పుడు రాహుల్​ కూడా అవుతారని అన్నారు హవేరీ హోసముట్​ స్వామీజి.

  • ఇంట్లోనే 'హిమాలయన్​ వయాగ్రా' సృష్టి.. కిలో రూ.25 లక్షలు..

సముద్ర మట్టానికి దాదాపు 5వేల మీటర్ల ఎత్తులో.. హిమాలయాల్లో దొరికే అరుదైన మూలిక అది. లైంగిక సామర్థ్యాన్ని పెంచుతుందని, అనేక ప్రాణాంతక వ్యాధుల చికిత్సకు ఉపయోగపడుతుందని అంతా భావిస్తారు. అందుకే అంతర్జాతీయ మార్కెట్​లో ఆ మూలిక కిలో రూ.25లక్షల వరకు పలుకుతుంది.

  • మళ్లీ వాయిదా పడిన 'కార్తికేయ 2'..

నిఖిల్‌ హీరోగా తెరకెక్కిన 'కార్తికేయ 2'ని మరోసారి వాయిదా వేసింది చిత్ర యూనిట్​. పరిశ్రమలో ఆరోగ్యకర వాతావరణం ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు నటుడు నిఖిల్​. ఈ నేపథ్యంలోనే ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో 'కార్తికేయ 2' టీమ్‌ చెప్పిన విశేషాలు తెలుసుకోండి.

  • 'దక్షిణాది చిత్రాలూ సరిగ్గా ఆడటం లేదు.. బాలీవుడ్​పై కాస్త దయ చూపించాలి'

సౌత్‌ సినిమా ఇండస్ట్రీపై బాలీవుడ్​ నటి ఆలియాభట్​ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దక్షిణాది పరిశ్రమ నుంచి వచ్చే అన్ని సినిమాలు విజయం అందుకోవడం లేదని.. అక్కడ కూడా మంచి కంటెంట్‌ ఉన్న సినిమాలే విజయం అందుకుంటున్నాయన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.