50 శాతం మాత్రమే
రాష్ట్రంలో కరోనా రెండో దశ విజృంభణ దృష్ట్యా సచివాలయం పనిదినాల్లో మార్పులు చేయాలని ఉద్యోగులు కోరారు. రోజు విడిచి రోజు 50 శాతం మంది ఉద్యోగులు విధులకు హాజర్యయ్యేలా అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
అవే ముఖ్యమా?
కరోనా నియంత్రణలో ప్రభుత్వం తీరుపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ఉన్నత న్యాయస్థానం విచారణ జరిపింది. జనసంచారం తగ్గించేందుకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ఎన్నికలు వాయిదా వేయండి
రాష్ట్రంలో నగరపాలక, పుర ఎన్నికలు వాయిదా వేయాలని కోరుతూ కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. కరోనా తీవ్రత దృష్ట్యా వాయిదా వేయాలని కోరారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
సిరిసిల్లలో కేటీఆర్
సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో మంత్రి కేటీఆర్ ఆకస్మిక పర్యటన చేశారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి, శంకుస్థాపన చేశారు. కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యేలు, తెరాస నేతలు, తదితరులు హాజరయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
రాగల మూడ్రోజులు వర్షాలు
రాష్ట్రంలో రాగల మూడ్రోజులు ఒకట్రెండు చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. అంతేగాక ఈ మూడ్రోజులు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
రైలుకు ఎదురెళ్లి
అదుపుతప్పి రైలుపట్టాలపై పడిపోయిన చిన్నారిని ప్రాణాలకు తెగించి మరీ కాపాడారు ఓ రైల్వే సిబ్బంది. మహారాష్ట్రలోని ముంబయి డివిజన్లో ఈ ఘటన జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ప్రభుత్వం చర్యలు
దేశంలో కరోనా తీవ్రత పెరిగిన నేపథ్యంలో కార్పొరేట్లు, పరిశ్రమ సంఘాలతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చర్చలు జరిపారు. ప్రస్తుత పరిస్థితిని ఎదుర్కొనేందుకు వారి నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ఆ పనిలో ఫడణవీస్
మహారాష్ట్ర విపక్ష నేత ఫడణవీస్.. రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లను అక్రమంగా నిల్వ చేస్తున్నారని ఆరోపించారు కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ. వాటిని ప్రజలకు అందుబాటులో ఉంచాలని అందరూ కోరుతుంటే.. భాజపా నేత ఈ ఔషధాలను దాచిపెట్టే పనిలో నిమగ్నమయ్యారని ధ్వజమెత్తారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
నాలుగు పతకాలు ఖాయం
పోలాండ్ వేదికగా జరుగుతోన్న ప్రపంచ యూత్ ఛాంపియన్షిప్ బాక్సింగ్ పోటీల్లో భారత బాక్సర్లు విజృంభిస్తున్నారు. నలుగురు మహిళా బాక్సర్లు సెమీస్‌లోకి దూసుకెళ్లారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
మాల్దీవుల్లో లవ్‌బర్డ్స్!
రూమర్ గర్ల్‌ఫ్రెండ్ ఆలియా భట్‌తో కలిసి హీరో రణ్‌బీర్ కపూర్, మాల్దీవులు విహారయాత్రకు వెళ్లినట్లు తెలుస్తోంది. వీరిద్దరూ కరోనా నుంచి ఇటీవలే కోలుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.