ETV Bharat / city

TOP NEWS: టాప్ న్యూస్ @ 5PM - టీఎస్ టాప్ న్యూస్

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top news
టాప్ న్యూస్ @ 5PM
author img

By

Published : May 26, 2022, 4:57 PM IST

  • రెండు మూడు నెలల్లో సంచలన వార్త

రెండు మూడు నెలల్లో సంచలన వార్త చెప్తానని సీఎం కేసీఆర్​ అన్నారు. దేశంలో మానవ వనరులు పుష్కలంగా ఉన్నాయన్నారు. శ్రమించే యువతరం ఉందని తెలిపారు. ​

  • 'పాలసీ విధానాలు అమలైతేనే సార్థకత'

PM Modi Hyd Tour: ఐఎస్​బీ విద్యార్థులు ప్రముఖ కంపెనీల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారన్న ప్రధాని.. అనేక స్టార్టప్‌లు కూడా రూపొందించారని ప్రధాని మోదీ ప్రశంసించారు. ఐఎస్‌బీ హైదరాబాద్‌ మరో మైలురాయి అందుకుందని ఆయన తెలిపారు. ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ 20వ వార్షికోత్సవంలో పాల్గొన్న ప్రధాని.. ఐఎస్‌బీ 20వ వార్షికోత్సవ చిహ్నాన్ని ఆవిష్కరించారు.

  • ఆటోను ఢీకొట్టిన లారీ.. నలుగురు దుర్మరణం

సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం అలిరాజ్​పేట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న ఆటో, లారీ ఢీకొని నలుగురు మృతి చెందారు. ఆటోలో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు

  • హైదరాబాద్​లో ఈదురుగాలుల వర్షం..

Heavy Rain in Hyderabad: మూడు రోజులుగా భానుడు తన ప్రతాపం చూపిస్తుండగా.. నేడు వరుణుడి రాకతో హైదరాబాద్​ వాసులకు కొంత ఉపశమనం కలిగింది. నగరం​లోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది.

  • 'కాంగ్రెస్​ అంటేనే ఓ గతం....'

Harish Rao Comments: హైదరాబాద్​లోని అమీర్​పేటలో 50 పడకల ఆస్పత్రిని మంత్రి హరీశ్​రావు పరిశీలించారు. వైద్యసిబ్బంది పనితీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన మంత్రి.. వైద్యరంగంపై కాంగ్రెస్​ నేతలు జగ్గారెడ్డి, గీతారెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు.

  • రక్త మార్పిడితో నలుగురు పిల్లలకు హెచ్​ఐవీ..

HIV Blood Transfusion: బ్లడ్​ బ్యాంక్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా నలుగురు చిన్నారులు హెచ్​ఐవీ బారినపడ్డారు. వారిలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్ర నాగ్​పుర్​లో జరిగిందీ ఘటన.

  • 500కుపైగా కేసులు.. రూ.84 లక్షల రివార్డ్​

Maoist sandeep yadav: బిహార్​లోని గయా జిల్లా లుటువా పోలీస్​ స్టేషన్​ పరిధిలో టాప్​ మావోయిస్టు లీడర్ సందీప్​ అలియాస్​ విజయ్​​ అనుమానాస్పద రీతిలో మృతిచెందారు. సందీప్​పై 500కుపైగా కేసులు, రూ.84 లక్షల రివార్డు ఉన్నాయి. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు.. సమగ్ర దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు.

  • ఆస్పత్రిలో షార్ట్​ సర్క్యూట్.. 11 మంది చిన్నారులు మృతి

ఓ ఆస్పత్రిలో జరిగిన అగ్నిప్రమాదంలో 11 మంది నవజాత శిశువులు మరణించారు. ఆఫ్రికన్ దేశమైన సెనెగల్​లోని టివయూనే పట్టణంలో జరిగిందీ ఘటన.

  • తగ్గిన బంగారం, వెండి ధరలు

Gold Rate Today: బంగారం, వెండి ధరలు మళ్లీ స్వల్పంగా తగ్గాయి. గురువారం 10 గ్రాముల పసిడి రూ.52వేల 520 వద్ద ఉంది. కిలో వెండి ధర రూ.63 వేలకు చేరింది. మరోవైపు స్టాక్​ మార్కెట్లు 3 వరుస సెషన్ల నష్టాల అనంతరం పుంజుకున్నాయి.

  • మరోసారి నిర్మాతగా పవర్​ స్టార్​

'భ‌ర‌త్ అనే నేను', 'భీమ్లానాయ‌క్' చిత్రాల‌తో కెమెరామెన్​గా ప్ర‌తిభ‌ చాటుకున్న ర‌వి.కె.చంద్ర‌న్‌.. 'త‌మ‌రా' పేరుతో ఓ ఇంట‌ర్నేషనల్​ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ చిత్రానికి హీరో ప‌వ‌న్‌క‌ల్యాణ్​, త్రివిక్రమ్​ నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రించ‌బోతున్నారు. మరోవైపు.. హీరో సూర్యతో దర్శకుడు బాల తెరకెక్కిస్తున్న సినిమా ఆగిపోయినట్టు ఊహాగానాలు వచ్చాయి. వాటికి సూర్య చెక్​ పెట్టారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.