ETV Bharat / city

Telangana Teachers Association: టీచర్ల పోస్టింగులకు ప్రత్యేక మార్గదర్శకాలివ్వాలి - ఉపాధ్యాయుల బదిలీలపై గందరగోళం

Telangana Teachers Association: సీనియారిటీ జాబితాలను సమగ్రంగా తయారు చేయకుండానే కొత్త జిల్లాల్లో పోస్టింగ్​ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేయడం అన్యాయమని ఉపాధ్యాయ సంఘాలు మండిపడ్డాయి. మహబూబ్​నగర్​, వరంగల్, కరీంనగర్, రంగారెడ్డి తదితర జిల్లాల్లో సీనియారిటీ జాబితాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపించాయి. జిల్లాల కేటాయింపులో జరిగిన అవకతవకలను సరిచేయకుండానే ఆదేశించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Telangana Teachers Association
Telangana Teachers Association
author img

By

Published : Dec 25, 2021, 7:25 AM IST

Telangana Teachers Association: జిల్లాలకు కేటాయించిన ఉపాధ్యాయులను పాఠశాలలకు ఇచ్చేందుకు ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేయాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్‌ చేశాయి. సీనియారిటీ జాబితాలను సమగ్రంగా తయారు చేయకుండా, జిల్లాల కేటాయింపులో జరిగిన అవకతవకలను సరిచేయకుండానే కొత్త జిల్లాల్లో పోస్టింగ్‌ ఇవ్వాలని హడావుడిగా ఆదేశించడం అన్యాయమని శుక్రవారం జరిగిన ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యూఎస్‌పీసీ) అత్యవసర సమావేశం విమర్శించింది.

సాధారణ బదిలీలు నిర్వహించాలి..

Telangana Teachers Association Demands : మహబూబ్‌నగర్‌, వరంగల్‌, కరీంనగర్‌, రంగారెడ్డి తదితర జిల్లాల్లో సీనియారిటీ జాబితాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపించింది. తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం తాత్కాలిక పోస్టింగులు ఇచ్చి.. అప్పీళ్లను పరిష్కరించిన అనంతరం స్టేషన్‌, సర్వీస్‌ సీనియారిటీకి పాయింట్లు కేటాయించాలని నేతలు సూచించారు. విద్యాశాఖ రూపొందించే బదిలీల మార్గదర్శకాలతో సాధారణ బదిలీలు నిర్వహించాలని అన్నారు. నేతలు జంగయ్య, చావ రవి, మైస శ్రీనివాసు, జాడి రాజన్న, షౌకత్‌ అలీ సమావేశంలో పాల్గొన్నారు.

పదోన్నతుల తర్వాతే బదిలీలు..

Telangana Teachers Transfers : ప్రత్యేక మార్గదర్శకాలను వెంటనే జారీ చేయాలని ఎస్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సదానందంగౌడ్‌, ప్రధాన కార్యదర్శి పర్వత్‌రెడ్డి శుక్రవారం రాత్రి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి సుల్తానియాకు వినతిపత్రం సమర్పించారు. ప్రస్తుతం తాత్కాలిక పద్ధతిలో పోస్టింగులిచ్చి.. ఉపాధ్యాయులకు మాన్యువల్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించాలని కోరారు. పదోన్నతుల తర్వాతే బదిలీలు చేపట్టాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్‌) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి హనుమంతురావు, నవాత్‌ సురేష్‌ ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. జోనల్‌ అలొకేషన్‌లో భాగంగా ఉపాధ్యాయుల బదిలీలపై హడావిడి ఉత్తర్వులతో ప్రభుత్వం గందరగోళం సృష్టిస్తోందని తెలంగాణ రాష్ట్ర టీచర్స్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు కావలి అశోక్‌కుమార్‌, ప్రధాన కార్యదర్శి కటకం రమేశ్‌లు అసంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాల విద్యాశాఖపరంగా షెడ్యూలు విడుదల లేకుండానే బదిలీలు చేపట్టడం సరికాదంటూ ఒక ప్రకటన విడుదల చేశారు.

విద్యా సంవత్సరం మధ్యలో బదిలీలు వద్దు: టీఎస్‌టీయూ

Telangana Teachers Transfers Issue : విద్యా సంవత్సరం మధ్యలో ఉపాధ్యాయులను బదిలీ చేయడం వల్ల విద్యార్థులకు నష్టం జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయుల సంఘం (టీఎస్‌టీయూ) రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్లా, ప్రధాన కార్యదర్శి చందూరి రాజిరెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉత్తర్వులను వెంటనే విరమించుకోవాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. పారదర్శకత కోసం సీనియారిటీ జాబితాలను ఆన్‌లైన్‌లో ఉంచాలని, తప్పులను పట్టించుకోకుండా జిల్లాల కేటాయింపు వల్ల అనేక మంది ఉపాధ్యాయులకు అన్యాయం జరిగిందని వారన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.