ETV Bharat / city

ప్రత్యేక నిఘా: మన్యంలో పహారా... సరిహద్దుల కట్టడి - చత్తీస్​గఢ్​

ఛత్తీస్‌గఢ్​ నుంచి రాష్ట్రంలోకి మావోయిస్టులు ప్రవేశించకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. దండకారణ్యంలో మావోయిస్టుల పని పట్టేందుకు ఛత్తీస్‌గఢ్​ ప్రభుత్వం 'ఆపరేషన్ ప్రహార్' పేరిట గాలింపు చర్యలను ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో మావోయిస్టులు సరిహద్దు దాటి రాష్ట్రంలోకి వచ్చే అవకాశముందని ప్రత్యేక నిఘా పెట్టారు. ఆయా ప్రాంతాల్లో సాయుధుల సంచారంపై దృష్టి సారించారు.

telangana
telangana
author img

By

Published : Mar 11, 2020, 10:28 AM IST

Updated : Mar 11, 2020, 12:42 PM IST

మావోయిస్టుల ఏరివేతలో భాగంగాఛత్తీస్‌గఢ్​ ​ పోలీసులు 'ఆపరేషన్ ప్రహార్' పేరిట గాలిపంపు చర్యలను ముమ్మరం చేశారు. అప్రత్తమైన రాష్ట్ర పోలీసులు సరిహద్దు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లోని సరిహద్దు అటవీ ప్రాంతాలపై నిఘా పెట్టారు. అవసరాన్ని బట్టి అనుభవమున్న క్షేత్రస్థాయి పోలీస్ అధికారులతో పాటు శిక్షణ ఐపీఎస్​లనూ రంగంలోకి దించారు.

సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తుండటంతోపాటు ఇన్ఫార్మర్ వ్యవస్థను వినియోగించుకుంటూ సాయుధుల కదలిక పసిగట్టే పనిలో నిమగ్నమయ్యారు. ఉనికి చాటుకునే ప్రయత్నంలో మావోయిస్టులు తరచూ గోదావరి నది దాటి తెలంగాణలోకి ప్రవేశించే అవకాశముందని ఇక్కడి పోలీస్ అధికారులు బలంగా విశ్వసిస్తున్నారు. దీనికితోడు వేసవికాలం కావడం వల్ల నదిలో నీటి ప్రవాహం తక్కువగా ఉండటంతో రాకపోకలు సులభం ఉంటుందని నిఘా విస్తృతం చేశారు.

నీలాద్రిపేట గుట్టను జల్లెడ పట్టిన బలగాలు

ఇటీవలి కాలంలో తొలిసారిగా తెలంగాణలోకి అడుగు పెట్టిన మావోయిస్టులకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలినట్లయింది. దళాల సంచారం ఉందనే పక్కా సమాచారంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం అటవీ ప్రాంతంలో గ్రేహౌండ్స్ బలగాలు సోమవారం కూంబింగ్ చేపట్టి నీలాద్రిపేట గుట్టను జల్లెడ పట్టాయి. కూంబింగ్ గురించి సమాచారం అందడం వల్ల మావోయిస్టులు అక్కడి నుంచి పారిపోయారు.

గుట్టపై మావోయిస్టులకు సంబంధించిన అలీవ్ గ్రీన్ దుస్తులతోపాటు సోలారు లాంతరు, వంట సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నీలాద్రిపేట గుట్టపై పది మంది వరకు సాయుధులు మకాం వేసి ఉంటారని పోలీస్ వర్గాలు అనుమానిస్తున్నాయి.

గాలింపు ముమ్మరం

చర్ల, శబరి, నర్సంపేట, వాజేడు-వెంకటాపూర్ ఏరియా కమిటీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న మావోయిస్టులు వచ్చి ఉంటారనే అనుమానంతో కూంబింగ్ విస్తృతం చేశాయి. ఈ కమిటీల కమాండర్లు ఉంటారనే కోణంలో గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి.

అయితే ఛత్తీస్‌గఢ్​ వాసులతో పాటు స్థానికులైన ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. కానీ ఈ విషయంపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ అధికారులు నోరు విప్పడం లేదు.

ఇవీ చూడండి: శిరస్త్రాణం​ ధరించకుంటే క్లిక్​మనిపిస్తారు..

Last Updated : Mar 11, 2020, 12:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.