ETV Bharat / state

శిరస్త్రాణం​ ధరించకుంటే క్లిక్​మనిపిస్తారు.. - hyd traffic police updates

హైదరాబాద్ రహదారులపై విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులు.. ట్రాఫిక్​ను క్రమబద్ధీకరించటమే కాకుండా చేతిలోని కెమెరాతో శిరస్త్రాణం లేకుండా వెళ్తున్నవారిని లక్ష్యంగా చేసుకున్నారు. రోజుకు పదివేలకు పైగా కేసులు నమోదు చేస్తున్నారు. హెల్మెట్​ ధరించడంపై చాలా వరకు అవగాహన వచ్చినా.. కొందరు మాత్రం శిరస్ర్రాణం లేకుండా దూసుకెళుతున్నారు. ప్రమాదాలను నియంత్రించేందుకు హెల్మెట్​ లేకుండా వెళ్తున్న వారిని లక్ష్యంగా చేసుకుని కేసులు నమోదు చేస్తున్నారు.

Traffic police fines issued if not wear a helmet
శిరస్త్రాణం​ ధరించకుంటే క్లిక్​మనిపిస్తారు
author img

By

Published : Mar 11, 2020, 5:58 AM IST

శిరస్త్రాణం​ ధరించకుంటే క్లిక్​మనిపిస్తారు..

హెల్మెట్​ ధరించకుండా వాహనాలు నడుపుతున్న వారిపై ట్రాఫిక్​ పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి ఫిబ్రవరి 29 వరకు 6.60 లక్షలకు పైగా కేసులు నమోదు చేశారు. శిరస్త్రాణం ధరించకుండా వాహనాలపై వెళ్తున్న వారిని గుర్తించి ఫొటోలు తీసేందుకు ట్రాఫిక్ పోలీసులు గల్లీలు, అనుసంధాన రహదారుల్లోనూ.. నిఘా ఉంచుతున్నారు. రహదారులపై నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారి వివరాలు, ప్రమాదాల గణాంకాలు, వివరాలను పోలీసు ఉన్నతాధికారులు పరిశీలించారు.

జరిమానా.. కౌన్సిలింగ్..

పోలీసులు ఎన్ని తనిఖీలు చేస్తున్నా... ప్రత్యేక డ్రైవ్​లు నిర్వహిస్తున్నా.. శిరస్త్రాణం ధరించకుండా వెళ్లేవారు పదుల సంఖ్యలో కనిపిస్తున్నారని గుర్తించారు. వీరిని కట్టడి చేయకపోతే ప్రమాదాలు మరిన్ని పెరిగే అవకాశాలున్నాయని అంచనా వేశారు. అందుకే జరిమానాలు విధించి వాహన చోదకులను గోషామహల్, బేగంపేట ట్రాఫిక్ శిక్షణ కేంద్రాలకు తీసుకెళ్లి కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. శిరస్త్రాణం ఎందుకు ధరించాలో వారికి అవగాహన కల్పిస్తున్నారు.

సుప్రీం మార్గదర్శకాల ప్రకారం..

ఒక్కో ఉల్లంఘన ఎలాంటి పరిణామాలకు దారితీస్తున్నాయన్న విషయాలను వారికి దృశ్య సహితంగా చూపిస్తున్నారు. కౌన్సిలింగ్​కు హాజరైనట్లు శిక్షణ కేంద్రం ఎస్సై ధ్రువీకరించాకే వారి వాహనాలను తిరిగి ఇస్తున్నారు. హెల్మెట్ ధరించకుండా బైక్​ నడుపుతూ మైనర్లు పట్టుబడితే వాహనం స్వాధీనం చేసుకుని తల్లిదండ్రులకూ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. హెల్మెట్​ లేకుండా మోటారు వాహన చట్టం ప్రకారం నేరం... సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం వీటన్నింటిపై ట్రాఫిక్ పోలీసు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

12 పాయింట్లు పడితే..

ప్రతి ఉల్లంఘనకు జరిమానాతో పాటు పాయింట్లు ఖాతాలోకి వెళ్తాయని, వీటి ద్వారా జైలు శిక్ష పడుతుందని హెచ్చరిస్తున్నారు. ఉల్లంఘనుల ఖాతాలో 12 పాయింట్లు పడగానే చట్టప్రకారం వారిపై చర్యలు చేపడుతున్నారు. శిరస్త్రాణం ధరించకుండా.. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతున్న వారిపై ట్రాఫిక్ పోలీసులు కేసులు నమోదు చేసి కోర్టులో వారిపై అభియోగపత్రాలను సమర్పిస్తున్నారు.

ముందు ట్రాఫిక్​ను పట్టించుకోండి..

పంజాగుట్ట, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, సికింద్రాబాద్, బేగంపేట ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్​ అవుతున్నా పట్టించుకోని ట్రాఫిక్ పోలీసులు... హెల్మెట్ లేకుండా వెళ్తున్న వారి ఫొటోలు తీసేందుకు మాత్రం ప్రతి రోడ్డులో ఉంటున్నారని వాహనచోదకులు ఆరోపిస్తున్నారు. శిరస్త్రాణం లేని కేసులు 2018లో 27లక్షల 10వేల 072 కాగా 2019లో 32 లక్షల 82 వేల 661 గా నమోదయ్యాయి. ఈఏడాది ఇప్పటి వరకూ 6 లక్షల 60 వేల 222 కేసులు నమోదయ్యాయి.

ఇదీ చూడండి: రాజీవ్ స్వగృహ ఆస్తుల అమ్మకానికి కమిటీ ఏర్పాటు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.