ETV Bharat / city

ఆబ్కారీ, అటవీ, అగ్నిమాపకశాఖల్లో ఖాళీల భర్తీకి గ్రీన్​ సిగ్నల్​ - తెలంగాణ ఉద్యోగ నోటిఫికేషన్​

telangana
telangana
author img

By

Published : Apr 13, 2022, 9:20 PM IST

Updated : Apr 13, 2022, 9:35 PM IST

21:18 April 13

ఆబ్కారీ, అటవీ, అగ్నిమాపకశాఖల్లో ఖాళీల భర్తీకి జీవోలు జారీ

రాష్ట్రంలో మరో 3,334 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ పచ్చజెండా ఊపింది. అబ్కారీ, అటవీ, అగ్నిమాపక శాఖల్లోని ఉద్యోగ నియామకాలకు అనుమతినిస్తూ ఆర్థిక శాఖ జీవోలు జారీ చేసింది. తొలి విడతలో 30,453 ఉద్యోగ ఖాళీల భర్తీకి ఇప్పటికే ఆర్థిక శాఖ అనుమతులు ఇచ్చింది. నియామక నోటిఫికేషన్లు జారీ చేసేందుకు టీఎస్పీఎస్సీ, పోలీసు నియామక సంస్థ, విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది. వివిధ శాఖల్లో 80,039 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ఇటీవల శాసనసభలో ప్రకటించారు.

నేరుగా నియామకాలు చేపట్టే అన్ని ఉద్యోగాలకు ఇంటర్వ్యూలను రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. నియామక ప్రక్రియ మరింత పారదర్శకంగా, ఎలాంటి పక్షపాతానికి ఆస్కారం లేకుండా... ఎంపిక ప్రక్రియపై అభ్యర్థులకు పూర్తి విశ్వాసం కలిగేలా ఈ నిర్ణయం తీసుకొంది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియామకాలు చేపట్టే అన్ని ఉద్యోగాలకు ముఖాముఖి రద్దు చేశారు. గ్రూప్ 1 సహా ఇక నుంచి వచ్చే నోటిఫికేషన్లకు చెందిన అన్ని ఉద్యోగాలకు ముఖాముఖిని తొలగించారు. ఇతర నియామక సంస్థల ద్వారా చేపట్టే నియామకాలకు సైతం ఇంటర్వ్యూలు రద్దయ్యాయి. శాఖాపరమైన కమిటీల ద్వారా ఎంపిక చేసే ఉద్యోగాలకు కూడా ఇంటర్వ్యూలు రద్దు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు సాధారణ పరిపాలనా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

రాష్ట్రంలో గ్రూప్-1 ప్రకటన జారీకి టీఎస్​పీఎస్సీ కసరత్తు ముమ్మరం చేసింది. గ్రూప్-1లో 503 పోస్టుల భర్తీకి వివిధ ప్రభుత్వ శాఖల నుంచి ప్రతిపాదనలు స్వీకరించిన కమిషన్ వాటిని క్రోడీకరిస్తోంది. మొత్తం 12 శాఖల నుంచి 19 రకాల పోస్టులకు ప్రతిపాదనలు అందగా వాటిలో నాలుగైదు రకాల పోస్టులకు ఆయా విభాగాల నుంచి సవరణ ప్రతిపాదనలు అందాల్సి ఉంది. అవి రాగానే ప్రకటన జారీ చేయాలని కమిషన్ భావిస్తోంది.

Last Updated : Apr 13, 2022, 9:35 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.