ETV Bharat / city

కోటి వృక్షార్చనలో ప్రతి ఒక్కరు భాగమవ్వాలి : మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి

ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన కార్యక్రమానికి ప్రజలంతా మద్దతివ్వాలని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి కోరారు. ఫిబ్రవరి 17న ఒక గంటలో కోటి మొక్కలు నాటే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Telangana State Civil Supplies Corporation chairman Mareddy Srinivas
తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్
author img

By

Published : Feb 15, 2021, 5:40 PM IST

గ్రీన్ ఇండియా ఛాలెంజ్​లో భాగంగా చేపట్టిన కోటి వృక్షార్చనలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఈనెల 17న ఒక గంటలో కోటి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఎంపీ సంతోశ్ కుమార్ చేపట్టారని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలను కోరారు.

సీఎం జన్మదినాన్ని పురస్కరించుకుని.. ఫిబ్రవరి 17న మొక్కలు నాటి అన్నదానం నిర్వహించేందుకు అన్ని జిల్లాల రైస్ మిల్లర్లు, చౌక ధరల దుకాణాల డీలర్లు ముందుకు రావడంపై సంతోషం వ్యక్తం చేశారు. హరితహారం కింద పచ్చదనం పెంపొందించడం కోసం..' సమాజంలో ప్రతి ఒక్కరం మూడు మొక్కలు నాటుదాం... సీఎం కేసీఆర్‌కు జన్మదిన సందర్భంగా గొప్ప హరిత కానుక ఇద్ధాం' అని ఆయన సూచించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.