కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే, కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి.. పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి తన రాజీనామా లేఖను పంపించారు.
నూతన పీసీసీ అధ్యక్షుడు నియామకం సందర్భంగా.. కొత్త కమిటీ ఏర్పాటుకు వెసులుబాటు కల్పిస్తూ రాజీనామా చేసినట్లు సోనియాకు రాసిన లేఖలో కోదండ రెడ్డి స్పష్టం చేశారు. చాలా కాలంగా తాను క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్‌గా కొనసాగుతున్నట్లు చెప్పారు. కొత్త కమిటీ ఏర్పాటు కోసమే పదవి నుంచి తప్పుకుంటున్నట్లు పేర్కొన్నారు.
ఇదీచూడండి: అసెంబ్లీ వేదికగా పార్టీ నేతలకు సీఎం హెచ్చరిక