ETV Bharat / city

ఆర్టీసీ సమ్మె@ దీక్షలు, ఆందోళనలు, అరెస్టులు

కరవమంటే కప్పకు కోపం, వదలమంటే పాముకు కోపంలా తయారైంది తెలంగాణ ఆర్టీసీ సమ్మె. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం సాధ్యం కాదని సీఎం చెబుతుంటే... అది చేస్తే తప్ప విధులకు హాజరయ్యేది లేదని ఆర్టీసీ ఐకాస నేతలు తేల్చి చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు చేపట్టిన సమ్మె రోజురోజుకు ఉద్ధృతమవుతోంది.

author img

By

Published : Nov 13, 2019, 5:07 AM IST

ఆర్టీసీ సమ్మె@ దీక్షలు, ఆందోళనలు, అరెస్టులు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డిపోల ఎదుట ఆర్టీసీ కార్మికుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. సమ్మెలో భాగంగా రోడ్లపై బైఠాయించి బస్సులను అడ్డుకున్నారు. కొన్ని జిల్లాల్లో అన్ని రాజకీయ పార్టీలతో కలిసి ధర్నాలు నిర్వహించారు. ప్రతి జిల్లా, మండల కేంద్రంలోని బస్టాండ్లలో నిరాహార దీక్షా శిబిరాలు వెలిశాయి.

విలీనం చేస్తేనే.. విధులకు వస్తాం...
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే వరకు సమ్మె విరమించే ప్రసక్తే లేదని ఆర్టీసీ ఐకాస నేతలు స్పష్టం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇకనైనా మొండి వైఖరిని మానుకొని.. కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఆర్టీసీ జేఏసీ రాష్ట్ర కో- కన్వినర్ రాజిరెడ్డి కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఆందోళనలో ఆయన పాల్గొన్నారు.

ప్రభుత్వం బెదిరిస్తోంది..
సూర్యాపేటలో ఆర్టీసీ ఐకాస ఆధ్వర్యంలో అఖిలపక్ష, ప్రజా సంఘాలు ర్యాలీ నిర్వహించాయి. ఆర్టీసీ ఐకాస నేతలతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరపాలని డిమాండ్‌ చేశారు. తెరాస ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడటం హేయమైన చర్యగా అభివర్ణించారు.

కార్మికులకు ప్రయాణికుల సంఘీభావం
జగిత్యాల జిల్లా కేంద్రంలో కార్మికులు నిరాహార దీక్ష చేపట్టారు. సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్మికులకు మద్దతుగా సైదమ్మ అనే ప్రయాణికురాలు సంఘీభావం తెలుపుతూ దీక్షలో కూర్చుంది.

గంగిరెద్దులకు వినతి పత్రం
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆర్టీసీ సమ్మెకు రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. ఖమ్మం పట్టణంలో కార్మికులు వినూత్న పద్దతిలో నిరసన తెలిపారు. డిపో నుంచి బస్టాండ్ వరకు గంగిరెద్దులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం డిపో వద్ద వంటావార్పు నిర్వహించి భోజనాలు చేశారు.

దీక్షా శిబిరంలో కార్తిక పౌర్ణమి సంబురాలు
కరీంనగర్​లో మహిళా ఆర్టీసీ కండక్టర్లు కార్తీక దీపోత్సవం నిర్వహించారు. బస్టాండ్ ఆవరణలో దీపాలను వెలిగించి నిరసన ప్రదర్శన చేపట్టారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు.

పంతానికి పోకుండా పరిష్కరం ఆలోచించండి
నిజామాబాద్ ధర్నా చౌక్​లో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఆర్టీసీ ఉద్యోగులు సామూహిక దీక్షలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తూ చర్చలు జరపకుండా, హైకోర్టుకు తప్పుడు సమాచారం ఇస్తోందని ఆరోపించారు. ఇప్పటికైనా పంతానికి పోకుండా సమస్యపరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

సమ్మెకు మద్దతుగా నిలుస్తాం: కాంగ్రెస్
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​లో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు కాంగ్రెస్ నాయకులు మద్దతు పలికారు. బస్టాండ్ నుంచి అంబేడ్కర్ కూడలి వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. కార్మికుల సమస్యలు పరిష్కరించే వరకు సమ్మెకు మద్దతుగా నిలుస్తామని కాంగ్రెస్ నాయకులు ప్రకటించారు.

అఖిలపక్షం మద్దతు

  • సీఎం కేసీఆర్‌ అసమర్థ పాలన కారణంగా అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో రగిలిపోతున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. హైదరాబాద్‌లోని సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం మాట్లాడుతూ ఆర్టీసీ సమ్మెపై కోర్టు మాటలను వినకుండా న్యాయవ్యవస్థను ముఖ్యమంత్రి అవమానిస్తున్నారని ఆరోపించారు.
  • ఆర్టీసీ కార్మికుల సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకునేలా చూడాలని కేంద్ర సహాయమంత్రి కిషన్‌రెడ్డిని.. తెజస అధ్యక్షుడు కోదండరాం కోరారు. కార్మికులకు న్యాయం జరిగేందుకు తన వంతుగా ఏప్రయత్నమైనా చేస్తానని.. ఎవరినైనా కలిసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.

ఎమ్మార్పీఎస్‌ కార్యాచరణ

  1. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా ఈ నెల 17న సబ్బండ వర్గాల దీక్ష చేపడతామని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ప్రకటించారు.
  2. ఆర్టీసీ ఐకాస 18న పిలుపునిచ్చిన సడక్‌ బంద్‌లో పాల్గొనాలని నిర్ణయం.
  3. 20న గవర్నర్‌కు వినతిపత్రం అందజేత కార్యక్రమం
  4. 30న 20 లక్షల మందితో నగర దిగ్బంధం

ఇదీ చదవండి: ఆర్టీసీపై ముగిసిన ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.