ETV Bharat / city

MINISTER PRASANTH REDDY: 'గడువులోగా అమరుల స్మారక చిహ్నం, సెక్రటేరియట్​ పూర్తికావాలి' - telangana latest news

అమరుల స్మారక చిహ్నం, సెక్రటేరియట్ నిర్మాణాలు నిర్ణీత గడువులోగా పూర్తికావాలని ఆర్​ అండ్​ బీ శాఖ మంత్రి ప్రశాంత్​రెడ్డి అధికారులు, ఏజెన్సీలకు సూచించారు. సీఎం కేసీఆర్​ ఇది వరకే సూచించిన మార్పులకు అనుగుణంగా ప్లాన్స్​ను సిద్ధం చేసి సమర్పించాలని ఆదేశించారు.

MINISTER PRASANTH REDDY
MINISTER PRASANTH REDDY
author img

By

Published : Nov 2, 2021, 5:34 AM IST

సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నిర్ణీత గడువులోగా అమరుల స్మారక చిహ్నం, సెక్రటేరియట్ నిర్మాణం పూర్తి కావాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్​రెడ్డి నిర్మాణ సంస్థలను, అధికారులును ఆదేశించారు. వర్క్​ఛార్ట్​ ప్రకారం పనుల్లో మరింత వేగం పెంచాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా ఫ్లోర్​వైస్​ అంతర్గత నిర్మాణాలు జరగాలని సూచించారు. ఆర్​అండ్​బీ కార్యాలయంలో సోమవారం అమరుల స్మారక చిహ్నం, సెక్రటేరియట్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష నిర్వహించారు.

MINISTER PRASANTH REDDY
అధికారులతో మంత్రి ప్రశాంత్​రెడ్డి సమీక్ష

అమరవీరుల స్మారక చిహ్నం మీద నిరంతరం జ్వలించే జ్వాలలో అమరుల త్యాగం ప్రతిబింబించే విధంగా ఉండాలని.. దానిపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులు, వర్క్​ ఏజన్సీ, కన్సల్టెన్సీ, ఆర్కిటెక్ట్​లకు మంత్రి ప్రశాంత్ రెడ్డి సూచించారు. ఫ్లోర్​వైస్​ డిజైన్​ ప్లాన్స్​ను మంత్రి పరిశీలించారు.

స్మారక చిహ్నం భవనంలోకి ప్రవేశించే ముందు చిన్నారులతో అమరులకు నివాళులు అర్పిస్తున్నట్లు డిజైన్, ల్యాండ్ స్కేప్, ఆడియో -వీడియో విజువల్ రూమ్ కన్సల్టెన్సీ ప్రతినిధులు రూపొందించిన ప్లాన్​ను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రి తిలకించారు. ముఖద్వారం వద్ద తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం అని తెలుగులో ఉండాలని, ఆడియో -విజువల్​ రూమ్​లో సీటింగ్​ వరుసల మధ్యలో కింద నుంచి మీదకు ఆరు ఇంచుల ఎత్తు ఉండేలా చూడాలని మంత్రి సూచించారు. అమరుల త్యాగాలను కళ్లకు కట్టినట్టు చూపించే ఫొటో ఎగ్జిబిషన్, ఒక కాన్ఫరెన్స్ హాల్, రెస్టారెంట్ ప్లాన్స్​ను మంత్రి పరిశీలించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనల ప్రకారం మంత్రి ప్రశాంత్ రెడ్డి స్వల్ప మార్పులు సూచించారు. అమరుల త్యాగానికి ప్రతీకగా, భావితరాలకు ఆదర్శంగా నిలిచే ఈ కట్టడంపట్ల ప్రత్యేక శ్రద్ధతో పనిచేయాలని సూచించారు. సెక్రటేరియట్ నిర్మాణ పనులపట్ల మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. నిర్మాణాల్లో వేగం పెంచాలన్నారు. ఫ్లోర్​ వైస్​ప్లాన్స్​ పరిశీలించారు. మినిస్టర్ ఛాంబర్, ఆఫీసర్ ఛాంబర్స్, డిపార్ట్మెంట్ వారీగా సెక్షన్స్ ఛాంబర్స్ అంతర్గత నిర్మాణాలపై సమగ్రంగా చర్చించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇదివరకే చెప్పినట్లు స్వల్ప మార్పులతో ఫైనల్ ప్లాన్స్​ను వీలైనంత త్వరలో సమర్పించాలని ఆదేశించారు.

బ్లాక్​వారీగా స్లాబ్​ నిర్మాణాలు, వర్క్​ఛార్ట్​ ప్రకారం జరిగే పనులు మంత్రి ప్రశాంత్​రెడ్డికి అధికారులు వివరించారు. క్షేత్రస్థాయిలో పనులను ఆకస్మికంగా తనిఖీ చేస్తానని మంత్రి చెప్పారు.

ఇదీచూడండి: TRS Vijayagarjana: తెరాస విజయగర్జన సభ వాయిదా... ఎందుకంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.