ETV Bharat / city

'దేశం కంటే రాష్ట్ర తలసరి ఆదాయం సుమారు రూ.లక్ష అధికం' - assembly sessions news in telugu

దేశ తలసరి ఆదాయంతో పోలిస్తే గతేడాది కంటే రాష్ట్రానిదే అధికమని మంత్రి హరీశ్​రావు పేర్కొన్నారు. గతేడాది కంటే 0.6 శాతం తలసరి ఆదాయం ఉంటుందని కేంద్ర గణాంక శాఖ అంచనా వేసిందని గుర్తు చేశారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ రాష్ట్ర ఎంతో పురోగతి సాధించి.. రాష్ట్ర ఆదాయం పెంచుకుందని వివరించారు.

telangana Per capita income higher than country

author img

By

Published : Mar 18, 2021, 1:22 PM IST

దేశంలో తెలంగాణ ఒక ప్రబల ఆర్థిక శక్తిగా ఎదుగుతోందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​రావు ఉద్ఘాటించారు. కొవిడ్​ ప్రతికూల పరిస్థితుల్లోనూ రాష్ట్ర పురోగతి ఎంతో మెరుగ్గా ఉందని వివరించారు. దేశ ఆదాయం తగ్గిన గడ్డు పరిస్థితుల్లోనూ... రాష్ట్ర ఆదాయం పెరగటమే దీనికి నిదర్శనమని పేర్కొన్నారు.

రాష్ట్ర తలసరి ఆదాయం 2020-21 సంవత్సరానికి రూ.2 లక్షల 27 వేల 145 ఉంటుందని కేంద్ర గణాంక శాఖ అంచనా వేసినట్లు తెలిపారు. ఇది గత ఏడాది కంటే 0.6 శాతం ఎక్కువ అని పేర్కొన్నారు. ఇదే సమయంలో దేశ తలసరి ఆదాయం లక్షా 27 వేల 768 ఉంటుందని అంచనా వేయగా... ఇది గతేడాది కంటే 4.8 శాతం తక్కువగా ఉందని తెలిపారు. దేశ తలసరి ఆదాయం కంటే రాష్ట్రానిది రూ. 99 వేల 377 అధికంగా ఉందని స్పష్టం మంత్రి చేశారు.

telangana Per capita income higher than country
telangana Per capita income higher than country

ఇదీ చూడండి: 2 లక్షల కోట్లను దాటిన తెలంగాణ వార్షిక బడ్జెట్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.