ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె వల్ల.. ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నట్లు సగటు ప్రయాణికుడు ఆవేదన వ్యక్తం చేశాడు. తమను పట్టించుకునే నాథుడే లేడని వాపోయాడు. హైకోర్టు జోక్యం చేసుకొని ఈ సమస్యకు తక్షణమే పరిష్కారం చూపించాలని నగర పౌరుడు తుమ్మల సత్యప్రసాద్ కోరాడు. ప్రయాణికుల అవస్థలపై ఎర్రగడ్డలో జరిగిన ఓసమావేశంలో ప్రభుత్వానికి రాష్ట్ర పౌరులు (కామన్మ్యాన్) పలు వినతులు చేశారు. కొన్నివారాలుగా సమ్మె జరుగుతోందని... దీనివల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఎంతో నష్టం జరిగిందని తుమ్మల సత్యప్రసాద్ తెలిపారు. ప్రభుత్వం, కార్మికులు పంతాలకు పోకుండా తక్షణమే ఓ పరిష్కారానికి రావాలని సూచించాడు.
ఇదీ చదవండి: ప్రభుత్వం కమిటీ వేయడానికి సిద్ధంగా లేదు: హైకోర్టు