గాంధీభవనలో ఈనెల 29న పీసీసీ కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నట్లు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నట్లు తెలిపారు. ఆర్థిక మాంద్యం, పరిశ్రమలు మూతపడడం, నిరుద్యోగ సమస్య తదితర అంశాలపై పార్టీ నేతలకు అవగాహన కల్పించేందుకు ఏఐసీసీ ముఖ్య నాయకులు గౌరవ్ వల్లభ్, ఆర్థిక విశ్లేషకులు శ్రీనివాసరావు హైదరాబాద్ రానున్నట్లు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ పాలనపై ఉద్యమాలకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు.
ఇవీచూడండి: "చర్చలకు ఎప్పుడు పిలిచినా మేము సిద్ధం"