ETV Bharat / city

టాప్​ టెన్ న్యూస్ @11AM - today telangana news

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

telangana news today till now
టాప్​టెన్ న్యూస్ @11AM
author img

By

Published : Dec 29, 2020, 10:58 AM IST

1. తెలంగాణలో ఇద్దరికి కొత్తరకం కరోనా

బ్రిటన్‌లో వెలుగుచూసి ప్రపంచ దేశాలను భయపెడుతోన్న కరోనా 'కొత్త రకం' వైరస్‌ భారత్‌లోకి ప్రవేశించింది. ఇటీవల యూకే నుంచి వచ్చిన ఆరుగురిలో కొత్తగా మార్పు చెందిన కరోనా వైరస్‌ ఉన్నట్లు తాజాగా తేలింది. బెంగళూరులోని నింహన్స్‌లో మూడు, హైదరాబాద్‌లోని సీసీఎంబీలో రెండు, పుణెలోని ఎన్‌ఐవీలో ఒక కేసు నిర్ధరణ అయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం అధికారంగా వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

2. రాష్ట్రంలో కొత్తగా 397 కరోనా కేసులు

రాష్ట్రంలో కొత్తగా 397 కరోనా కేసులు, 2 మరణాలు నమోదైనట్టు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. దీంతో మొత్తం బాదితుల సంఖ్య 2,85,465కు చేరింది. ఇప్పటి వరకు వైరస్​తో 1,535 మంది మరణించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

3. అమెరికాలో మరిన్ని టీకాలు!

అమెరికాలో మరిన్ని టీకాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న టీకాలతో అందరికీ సత్వరమే వ్యాక్సిన్ అందించడం సాధ్యపడదని నిపుణులు చెబుతున్నారు. కరోనా కొత్త స్ట్రెయిన్​ను టీకా అడ్డుకుంటుందా అనే విషయంపై అధ్యయనాలు జరుగుతున్నాయని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

4. సాగు చట్టాల రద్దుపైనే మాట్లాడతాం

ఎముకలు కొరికే చలిలోనూ పట్టుసడలని రైతులు.. తమ నిరసనలను కొనసాగిస్తున్నారు. దిల్లీ సరిహద్దులో బైఠాయించారు. కొత్త సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. బుధవారం కేంద్రంతో చర్చలు జరగనుండగా.. సాగు చట్టాల రద్దుపైనే మాట్లాడతామని రైతులు స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

5. భర్తకు దేహశుద్ధి

భార్య దేన్నయినా భరిస్తుంది అనుకోవడం పొరపాటు. ఏదైనా ఓపిక పట్టిన్నంత కాలమే. తాగొచ్చి వేధిస్తున్న భర్తలో మార్పు వస్తుందేమోనని ఎదురుచూసింది. కానీ ఫలితం లేదని భావించిన ఆ ఇల్లాలు.. బజార్​లోకి లాక్కొచ్చి కట్టేసి చితకబాదింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

6. వివాహిత ఆత్మహత్య

వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం మాణిక్యపూర్​లో విషాదం చోటుచేసుకుంది. ప్రేమించిన వ్యక్తిని కాదని, మరొకరితో వివాహం చేశారని అత్తవారింట్లో ఉరి వేసుకొని ఓ నవవధువు ఆత్మహత్య చేసుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

7. ఇక ఏసీబీలో ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేటర్లు

ఏసీబీకి ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేటర్ సహా సైబర్ లా నిపుణుల సేవలు వినియోగించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

8. మార్కెట్లలో లాభాల జోరు-

స్టాక్ మార్కెట్లలో బుల్​ దూకుడు ప్రదర్శిస్తోంది. సెన్సెక్స్ 350 పాయింట్లకుపైగా లాభంతో సరికొత్త రికార్డు స్థాయి అయిన 47,707 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 90 పాయింట్లకుపైగా పెరిగి నూతన గరిష్ఠమైన 13,964 వద్ద కొనసాగుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

9. కోహ్లీ.. సీరియన్ ఆటగాడు

ఐసీసీ ప్రతిష్ఠాత్మక పురస్కారాలు గెలిచిన టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీకి వినూత్నంగా అభినందనలు తెలియజేశాడు ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్. అతడో సీరియస్ ఆటగాడని తెలిపాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

10. హీరో రామ్​చరణ్​కు కరోనా పాజిటివ్​

యువ కథానాయకుడు రామ్‌చరణ్‌ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన సోషల్‌ మీడియా ఖాతాల ద్వారా తెలియజేశారు. ఎటువంటి లక్షణాలు లేవని, ప్రస్తుతం సెల్ఫ్ ఐసోలేషన్​లో ఉన్నట్లు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.