ETV Bharat / city

టాప్​టెన్ న్యూస్ @9AM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top ten telangana news
ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు
author img

By

Published : Dec 10, 2020, 8:59 AM IST

కొత్త పార్లమెంట్ భవనానికి శంకుస్థాపన

కొత్త పార్లమెంట్ భవనానికి నేడు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు, పలువురు ఇతర రాజకీయ పార్టీల నేతలు, పలు దేశాల రాయబారులు హాజరుకానున్నారు. రాష్ట్రాల గవర్నర్​లు, ముఖ్యమంత్రులు వర్చువల్​గా పాల్గొననున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

కశ్మీర్​ 'స్థానిక' పోలింగ్​ షురూ

కశ్మీర్​లో స్థానిక సంస్థల ఎన్నికల ఐదో విడత పోలింగ్​ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. అందులో భాగంగా 37 నియోజకవర్గాల్లో డిస్ట్రిక్ట్​ డెవెలెప్​మెంట్​ కౌన్సిల్​ (డీడీసీ) ఓటింగ్​ జరుగుతోంది. ఉదయం 7 గంటల నుంచి మధ్నాహ్నం 2 గంటల వరకు పోలింగ్​ జరగనుంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్​ కేకే శర్మ తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

సిద్దిపేట జిల్లాలో సీఎం కేసీఆర్‌

మఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ సిద్దిపేటలో పర్యటించనున్నారు. ఇళ్లు లేని పేదల కోసం దేశంలోనే ఆదర్శంగా నిర్మించిన రెండు పడక గదుల ఇళ్లతో పాటు... సుమారు రూ. 1200 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సీఎం ప్రారంభించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

నేడే నిర్ణయం

రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రారంభంపై ప్రభుత్వం ఇవాళ నిర్ణయం తీసుకోనుంది. సుమారు 3 నెలలుగా నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లను జాప్యం లేకుండా వెంటనే ప్రారంభించాలని భావిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

యువతపై గంజాయ్‌ వల..

రాష్ట్ర రాజధానిలో గంజాయి రవాణా, విక్రయ, వినియోగాలు పెద్ద ఎత్తున పెరిగిపోతున్నాయి. మద్యం స్థాయిని దాటి కొత్త తరహా మత్తును ఆస్వాదించడానికి.. సులువుగా డబ్బు సంపాదించేందుకు యువత గంజాయి బాట పడుతోంది. చేజేతులా భవిష్యత్తును నాశనం చేసుకోవడమే కాదు కన్నవారికీ తీరనిశోకం మిగులుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

వన్‌ నేషన్‌.. వన్‌ రేషన్‌కార్డు

'కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'వన్​ నేషన్​, వన్​ రేషన్​ కార్డు' విధానాన్ని దేశవ్యాప్తంగా 9 రాష్ట్రాలు అమలు చేశాయి. ఫలితంగా ఆయా రాష్ట్రాలు అదనపు రుణం తీసుకునే వెసులుబాటు కలిగింది. ఇందులో యూపీ ప్రభుత్వానికి అధిక లబ్ధి చేకూరనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

60 ఏళ్ల వయసులో ..

ఓ వైపు వృద్ధాప్యం. మరో వైపు అనారోగ్య సమస్యలు. ఎముకలు కొరికే చలి. ఆపై కాలుష్యం.. ఇవేవీ లెక్క చేయలేదు వారు. వారి తపనల్లా వ్యవసాయ రంగం భవిష్యత్తు పైనే. ఇప్పుడు కాక పోతే ఇంకెప్పుడు అనే నినాదంతో రైతులు దిల్లీ సరిహద్దుల్లో చెపట్టిన ఆందోళనలో భాగం అయ్యారు ఆ ముగ్గురు వృద్ధ రైతులు. కుటుంబాన్ని విడిచి పక్షం రోజులు కావస్తోన్నా.. వెనుదిరగకుండా సింఘు సరిహద్దులో నూతన వ్యవసాయ చట్టాల రద్దుకు డిమాండ్ చేస్తున్నారు. వారే గురుదేవ్​ సింగ్​, సజ్జన్​ సింగ్, ప్రీతం సింగ్​. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ఆ​ ఒక్కటే అడ్డుకోలేదు!

కరోనా ఒకరి నుంచి మరొకరికి సోకకుండా మాస్క్​లు ధరించడం ప్రస్తుతం తప్పనిసరిగా మారింది. అయితే మరింత రక్షణ కోసం చాలా మంది ఫేస్​ షీల్డ్​లను వినియోగిస్తున్నారు. అయితే షీల్డ్ పెట్టుకున్నప్పుడు మాస్క్ అవసరం లేదని భావిస్తుంటారు. అది తప్పని జపాన్​కు చెందిన ఓ అధ్యయనం స్పష్టం చేసింది. ఆ అధ్యయనం ద్వారా తెలిసిన మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

'హార్దిక్‌కు తోడెవరు?'

డెత్​ ఓవర్లలో హార్దిక్​ పాండ్యకు ఎవరో ఒక ఆటగాడు తోడుగా నిలవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు కామెంటేటర్​ ఆకాశ్​ చోప్రా. అతనొక్కడే ఫినిషర్​గా ఉంటే అతడి పాత్రలు, బాధ్యతలు మారుతాయని చెప్పాడు. ఆసీస్‌తో జరిగిన పరిమిత ఓవర్ల క్రికెట్లో పాండ్య చెలరేగిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశాడు చోప్రా. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

'క్రిష్​ 4'లో కియారాకు ఛాన్స్​!

బాలీవుడ్​ స్టార్​ హృతిక్​ రోషన్​ హీరోగా తెరకెక్కబోతున్న 'క్రిష్​ 4'లో హీరోయిన్​గా కియారా అద్వానీ ఎంపికైనట్లు సమాచారం. త్వరలోనే అధికార ప్రకటన వచ్చే అవకాశముంది. ఈ విషయాన్ని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.