రాష్ట్రంలో కరోనా కేసులు కొనసాగుతున్నాయి. కొత్తగా 948 కరోనా కేసులు నమోదవగా... ఐదుగురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా కేసులు 2,59,776కు చేరాయి. కొవిడ్ బారినపడి ఇప్పటివరకు 1,415 మంది మృతి చెందారు. మహమ్మారి నుంచి మరో 1,607 మంది బాధితులు కోలుకోగా... వారి సంఖ్య 2,45,293కు చేరింది.
రాష్ట్రంలో ప్రస్తుతం 13,068 కరోనా యాక్టివ్ కేసులున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో 10,710 మంది బాధితులున్నట్లు ప్రకటించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో 154 కరోనా కేసులు నమోదు కాగా... మేడ్చల్ జిల్లాలో 83, రంగారెడ్డి జిల్లాలో 76 మంది కొవిడ్ బారిన పడ్డారు.