ETV Bharat / city

ఇవాళ ఆయన తెలంగాణను బెదిరించేందుకు వచ్చారు: కేటీఆర్‌ - తెలంగాణ విమోచన దినోత్సవం వేడుకలు

Telangana National Unity Vajrotsavam ktr speech: ఆనాటి అపూర్వ ఘట్టాలు జాతి జీవనంలో నిరంతరం సజీవంగా నిలిచి ఉంటాయని మంత్రి కేటీఆర్​ అన్నారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఎగురవేసి, నాటి ఉద్యమకారులను సన్మానించారు.

minister ktr
మంత్రి కేటీఆర్​
author img

By

Published : Sep 17, 2022, 12:41 PM IST

Telangana National Unity Vajrotsavam ktr speech: తెలంగాణ ప్రజాస్వామిక స్వేచ్చ పొందడానికి ఆనాటి యావత్ సమాజం ఉద్యమించిందని..ఆనాటి అపూర్వ ఘట్టాలు జాతి జీవనంలో నిరంతరం సజీవంగా నిలుస్తాయని ఐటీ, మున్సిపల్ శాఖమంత్రి కేటీఆర్ అన్నారు. జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా సిరిసిల్ల కలెక్టరేట్‌లో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

ఆనాటి ఉద్యమానికి నాయకత్వం వహించిన ఆదివాసి యోధుడు కుమురంభీం, తన అమరత్వంతో చరిత్రను వెలిగించిన దొడ్డి కొమురయ్యలతో పాటు నాటి పోరాటానికి నాయకత్వం వహించిన మహానీయులు రావి నారాయణరెడ్డి, స్వామి రామానంద తీర్ధ, భీంరెడ్డి నర్సింహారెడ్డి, వీరవనిత చాకలి ఐలమ్మ వంటి ప్రజానేతల త్యాగాలను స్మరించుకొందామని కేటీఆర్ గుర్తు చేశారు.

తమ అక్షరాలతో ప్రజల్లో ఉత్తేజాన్ని నెలకొల్పిన సురవరం ప్రతాపరెడ్డి,ప్రజాకవి కాళోజి, మగ్దూం మొహియోద్దీన్, షోయెబుల్లాఖాన్‌ వంటి సాహితీ మూర్తులకు ఘన నివాళులు అర్పిద్దామని అన్నారు. అనంతరం స్వాతంత్ర సమరయోధులను వేములవాడ ఎమ్మెల్యే రమేశ్‌బాబుతో కలిసి సన్మానించారు.

అనంతరం అమిత్‌ షా పర్యటనపై మంత్రి కేటీఆర్ ట్విటర్‌లో స్పందించారు. 74 ఏళ్ల క్రితం నాటి కేంద్ర హోంమంత్రి తెలంగాణను భారత్‌లో కలిపారని ఎద్దేవా చేశారు. ఇవాళ కేంద్ర హోంమంత్రి తెలంగాణను విభజించి, బెదిరించేందుకు వచ్చారని మండిపడ్డారు. దేశానికి కావల్సింది విభజన రాజకీయాలు కాదని సూచించారు. దేశానికి నిర్ణయాత్మక విధానాలు కావాలన్నారు.

  • 74 years ago, A Union Home Minister came to UNITE & INTEGRATE The People of
    Telangana into Indian union

    Today A Union Home Minister has come to DIVIDE & BULLY
    The People of Telangana & their state Govt

    That's why I say, India needs
    DECISIVE POLICIES Not
    DIVISIVE POLITICS

    — KTR (@KTRTRS) September 17, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.