ETV Bharat / city

Minister KTR on Nala Safety Audit : 'నాలాల ప్రమాదాలకు అధికారులే బాధ్యులు' - నాలాల ప్రమాదాలపై కేటీఆర్ సమీక్ష

Minister KTR on Nala Safety Audit : భవిష్యత్తులో నాలాలపై దురదృష్టకర ఘటనలు, ప్రమాదాలు జరిగితే ఉన్నతాధికారులనే ఇందుకు బాధ్యుల్ని చేస్తామని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. జోనల్ కమిషనర్ మొదలు కింది స్థాయి అధికారి వరకు ప్రతి ఒక్కరూ నాలాల వల్ల ప్రమాదాలు జరగకుండా సమగ్రమైన ప్రణాళికతో ముందుకెళ్లాలని ఆదేశించారు.

Minister KTR on Nala Safety Audit
Minister KTR on Nala Safety Audit
author img

By

Published : Feb 9, 2022, 7:36 AM IST

Minister KTR on Nala Safety Audit : రాష్ట్రంలో నగరాలు, పురపాలక పట్టణాల్లో రానున్న వర్షాకాలం నాటికి నాలాలకు సంబంధించిన రక్షణ చర్యలను, వాటి అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేయాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.టి.రామారావు ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా నాలాల రక్షణ ఆడిట్‌ కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. భవిష్యత్తులో వాటి కారణంగా దురదృష్టకర సంఘటనలు లేదా ప్రమాదాలు జరిగినా ఉన్నతాధికారులనే బాధ్యులను చేయనున్నట్లు స్పష్టం చేశారు. వ్యూహాత్మక నాలాల అభివృద్ధి పథకం - ఎస్ఎన్డీపీ కార్యక్రమాలపై అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.

అప్పటి వరకు అంతా రెడీ..

Nala Safety Audit in Hyderabad : జీహెచ్‌ఎంసీతో పాటు నగరం చుట్టుపక్కల ఉన్న పురపాలికల్లో ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకునేలా స్థానిక పురపాలక ఆధికారులకు ఆదేశాలను జారీ చేయాలంటూ ఆ శాఖ డైరెక్టర్‌ సత్యనారాయణను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. రానున్న వర్షాకాలం వరకు నాలాలకు సంబంధించిన రక్షణ చర్యలు, నాలా అభివృద్ధి కార్యక్రమాలను వేగంగా పూర్తి చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. సరిపడా సమయం ఉన్నందున నాలాలకు సంబంధించిన ఫెన్సింగ్, ఇతర రక్షణ కార్యక్రమాలను పూర్తిచేయాలని చెప్పారు. ప్రతి నగరపాలక సంస్థలో మురుగుకాల్వలపై రక్షణ చర్యలు చేపట్టేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు.

వారానికోసారి సమీక్ష..

Nala Safety Audit in GHMC : జీహెచ్‌ఎంసీలో జోనల్‌ కమిషనర్‌ నుంచి కిందిస్థాయి అధికారి వరకూ ప్రతి ఒక్కరూ నాలాలపై ప్రమాదాలు జరగకుండా సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్లాలన్నారు. వాటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన పురోగతిని ప్రతివారం సమీక్షించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్ కుమార్‌ను ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ మేయర్‌ కూడా నాలాల రక్షణ కార్యక్రమం అమలుపై సమీక్షించాలని కోరారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.