ETV Bharat / city

Minister Talasani : ఏపీ మంత్రులు ఎందుకు ఉలిక్కిపడుతున్నారు? - ఏపీ మంత్రులపై తలసాని ఫైర్

Talasani About AP Ministers : పక్క రాష్ట్రంలో కరెంట్‌ లేదంటూ మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలతో మొదలైన వివాదం ఇంకా కొనసాగుతోంది. హైదరాబాద్‌లోనే కరెంట్‌ లేదంటూ ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి తలసాని స్పందించారు. కేటీఆర్‌ వ్యాఖ్యలపై ఏపీ నేతలు ఎందుకు ఉలికిపాటుకు గురవుతున్నారని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో కరెంట్‌ లేకుంటే ఇక్కడెందుకు శుభకార్యాలు చేస్తున్నారని ప్రశ్నించారు.

Minister Talasani
Minister Talasani
author img

By

Published : Apr 30, 2022, 1:42 PM IST

Updated : Apr 30, 2022, 3:06 PM IST

ఏపీ మంత్రులు ఎందుకు ఉలికిపడుతున్నారు

Talasani About AP Ministers : ఏపీలో పరిస్థితులపై ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపాయి. ఆయన వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు ఒక్కొక్కరుగా కౌంటర్ ఇస్తున్నారు. తెలంగాణ ఎంపీలు, మంత్రులు కేటీఆర్‌కు మద్దతుగా ఏపీ ప్రజాప్రతినిధుల కౌంటర్‌ను తిప్పికొడుతున్నారు. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కూడా మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలను సమర్థించారు. ఆయన ఏపీలోని తన స్వగ్రామంలో రహదారుల దుస్థితిని చూపిస్తూ.. మంత్రి వ్యాఖ్యలు నిజమేనని నిరూపిస్తూ వీడియో రిలీజ్ చేశారు.

Talasani Supports KTR Statements : హైదరాబాద్‌లోనే కరెంట్‌ లేదంటూ ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి తలసాని స్పందించారు. కేటీఆర్ వ్యాఖ్యలపై ఏపీ నేతలు ఎందుకు ఉలికిపడుతున్నారని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో కరెంట్‌ లేకుంటే ఇక్కడెందుకు శుభకార్యాలు చేస్తున్నారని అడిగారు. సాధారణంగా సమావేశాల్లో అభివృద్ధి గురించి మాట్లాడేటప్పుడు గత పరిస్థితులను.. ఇతర ప్రాంతాల్లో పరిస్థితులను గురించి ప్రస్తావించడం సాధారణమని తెలిపారు. దీన్ని ఏపీ మంత్రులు ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారో అర్థం కావడం లేదని అన్నారు.

Talasani Reacts to Botsa Statements : కేటీఆర్ దేశంలో ఉన్న ప్రస్తుత పరిస్థితులపై మాట్లాడారని మంత్రి తలసాని అన్నారు. హైదరాబాద్‌లో తెరాస సర్కార్ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని వెల్లడించారు. భాగ్యనగర ప్రగతి గురించే కేటీఆర్ క్రెడాయ్ సమావేశంలో మాట్లాడారని చెప్పారు. ప్రతిపక్ష నేతలను విమర్శించినట్లుగా ఏపీ మంత్రులు స్పందించారని అన్నారు.

"సమావేశాల్లో మాట్లాడేటప్పుడు... గతంలో ఇలాంటి పరిస్థితులు ఉండేవి. పక్క రాష్ట్రంలో అలా ఉంది. మన వద్ద ఇలా ఉంది. ఆ దేశ పరిస్థితులు అలా ఉన్నాయి. మన దేశం అభివృద్ధి పథంలో సాగుతుంది అని ఇలా సాధారణంగా ప్రస్తావన వస్తుంది. దేశంలో ఉన్న ప్రస్తుత పరిస్థితులపై కేటీఆర్ మాట్లాడారు. మా కంటే అద్భుతంగా పాలన చేస్తే మంచిదే. హైదరాబాద్‌లో జనరేటర్ వాడామని బొత్స అనడం సరికాదు. ఇక్కడ కరెంట్ లేనప్పుడు ఫంక్షన్లు ఎందుకు చేస్తున్నారు. ఏపీ నేతలు ఎందుకు తొందరపడుతున్నారో అర్థం కావడం లేదు. కరోనా చికిత్స ఎవరు ఎక్కడ తీసుకున్నారో అందరికీ తెలుసు." - తలసాని శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర మంత్రి

సంబంధిత కథనాలు :

Last Updated : Apr 30, 2022, 3:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.