ETV Bharat / city

తెలంగాణ అభివృద్ధిపై 'యోజన' ప్రత్యేక సంచిక.. విడుదల చేసిన మంత్రి ఎర్రబెల్లి - telangana latest news

తెలంగాణ పంచాయతీరాజ్​, గ్రామీణాభివద్ధి శాఖలు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేకంగా రూపొందించిన యోజన మాస పత్రికను ఆ శాఖ మంత్రి ఎర్రబెల్లి విడుదల చేశారు. గంగదేవిపల్లి, ఇబ్రహీంపూర్‌, అంకాపూర్ లాంటి అనేక ఆదర్శ గ్రామాల వివరాలను ప్రత్యేకంగా ప్రచురించారని మంత్రి ఆనందం వ్యక్తం చేశారు.

telangana minister errabelli
yojana monthly magazine
author img

By

Published : Oct 31, 2021, 5:15 PM IST

దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ ఖ్యాతి, సీఎం కేసీఆర్ కృషిని దశదిశలా వ్యాప్తిచేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు సూచించారు. రాష్ట్రంలోని ప‌థ‌కాల‌కు దేశవ్యాప్తంగా ప్రచారం ఇవ్వాలని కోరుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని పంచాయ‌తీరాజ్ వ్యవ‌స్థ, గ్రామీణాభివృద్ధికి చేప‌డుతున్న ప‌లు అభివృద్ధి కార్యక్రమాల‌పై ప్రత్యేకంగా రూపొందించిన‌ కేంద్ర ప్రభుత్వ అధికారిక మాసప‌త్రిక యోజ‌న‌ న‌వంబ‌ర్ ప్రత్యేక సంచికను హైదరాబాద్​లోని మంత్రుల నివాస ప్రాంగణంలో ఎర్రబెల్లి ఆవిష్కరించారు.

అభివృద్ధి, సంక్షేమ పత్రికగా దేశంలో 'యోజన'కు మంచి పేరుందని ఎర్రబెల్లి కితాబిచ్చారు. సివిల్​ సర్వీసులకు సిద్ధమయ్యే విద్యార్థులకు ఈ పత్రిక మంచి సమాచార వాహికగా పనిచేస్తుందని మంత్రి పేర్కొన్నారు. యోజన పత్రిక నవంబర్ సంచికను రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి కోసం కేటాయించడం సంతోషకరమన్నారు. పత్రికలోని మొత్తం 72 పేజీల్లో తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి గురించే రాశారని మంత్రి తెలిపారు.

గంగదేవిపల్లి, ఇబ్రహీంపూర్‌, అంకాపూర్ లాంటి అనేక ఆదర్శ గ్రామాల వివరాలను ప్రత్యేకంగా ప్రచురించారని మంత్రి ఆనందం వ్యక్తం చేశారు. యోజ‌న మాస‌ ప‌త్రిక నిర్వాహ‌కులు, సంపాద‌క‌వ‌ర్గం, ప్రత్యేకంగా వ్యాసాలు రాసిన అధికారుల‌ను అభినందిస్తున్నట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు పేర్కొన్నారు.

ఇదీచూడండి: Hunters Killing Tigers: పులిని చంపిన వేటగాళ్లు.. చర్మాన్ని తరలిస్తుండగా...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.