కోకాపేట ముదిరాజ్ భవన్ శంకుస్థాపనలో తన వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వివరణ ఇచ్చారు. తాను గంగపుత్రులను బాధ పెట్టేలా మాట్లాడలేదని స్పష్టం చేశారు. తన మాటలు తప్పుగా అనిపిస్తే క్షమాపణ చెప్పేందుకు సిద్ధమని అన్నారు.
తెలంగాణ ఏర్పడే వరకు గంగపుత్రులను పట్టించుకున్న వారేలేరని మంత్రి తెలిపారు. గతంలో మత్స్యకార సొసైటీల్లో వివిధ వర్గాల వారు సభ్యులుగా ఉన్నారని చెప్పారు. గంగపుత్రులు, ముదిరాజ్‌లు, బెస్త వారికి మేలు చేయాలన్నదే సీఎం ఉద్దేశమని తలసాని స్పష్టం చేశారు.
- ఇదీ చూడండి : 'సభ్యత, సంస్కారం మరిచి మాట్లాడుతున్నారు.. సరికాదు'