నిత్యవసర సరకుల రవాణాలో కీలకపాత్ర పోషిస్తున్న లారీలు 36 రోజులుగా ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. లారీల యజమానులు, డ్రైవర్లు, క్లీనర్లు అవస్థలు పడుతున్నారు. ఒక వైపు కిస్తీలు చెల్లించాలని బ్యాంకర్లు.. మరోవైపు పన్ను కట్టాలని అధికారులు ఒత్తిడి చేస్తున్నారని లారీ యజమానులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వానికి ఎన్నో విజ్ఞప్తులు చేసిన సరైన స్పందన రాలేదని వాపోయారు.
రేపటి లోగా సర్కారు నుంచి సరైన ప్రకటన రాకపోతే నిత్యవసర సరకుల రవాణా లారీలు బంద్ చేసే ఆలోచన చేస్తామన్నారు. లారీల యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆటోనగర్ నుంచి తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డితో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి...
ఇవీచూడండి: తగ్గుతున్న కేసులు.. పలుచోట్ల కంటైన్మెంట్ జోన్లు ఎత్తివేత