రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. తాజాగా 602 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం బాధితుల సంఖ్య 2,64,128కి చేరింది. మహమ్మారి కారణంగా మరో ముగ్గురు మరణించారు. ఇప్పటి వరకూ మృతిచెందిన వారి సంఖ్య 1,433కు చేరింది. తాజాగా 1,015 మంది డిశ్చార్జ్ అయ్యారు. మొత్తంగా ఇప్పటి వరకూ 2,51,468 మంది కోలుకున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 11,227 యాక్టివ్ కేసులున్నాయి. హోం ఐసొలేషన్‌లో 8,942 మంది ఉన్నారు. తాజా ఫలితాల్లో జీహెచ్‌ఎంసీలో 129 కేసులు నమోదు కాగా రంగారెడ్డి జిల్లాలో 62, మేడ్చల్ జిల్లాలో 60 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఇదీ చదవండి : యాంటీబయాటిక్స్ వినియోగంపై డబ్ల్యూహెచ్‌వో హెచ్చరికలు