ETV Bharat / city

Top News: టాప్​న్యూస్​ @7 PM - టాప్​న్యూస్​ @7 PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు..

TELANGANA LATEST TOP NEWS
TELANGANA LATEST TOP NEWS
author img

By

Published : Feb 16, 2022, 7:00 PM IST

  • ఆ తల్లీకూతుళ్ల పోరాటం.. చిరస్మరణీయం..

Medaram Jatara 2022: శివసత్తుల పూనకాలు, పొర్లు దండాలు, బెల్లం ఘుమఘుమలు, బంగారం(బెల్లం) మొక్కులు.. వెరసి గిరిజన సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టే వనదేవతల పండగే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర. కోరుకున్న కోర్కెలు తీర్చి భక్తుల కొంగు బంగారంగా విలసిల్లే ఈ జాతర వెనుక చరిత్రాత్మక కథ ప్రచారంలో ఉంది.

  • ఎమ్మెల్యే రాజాసింగ్‌కు ఈసీ నోటీసులు..

EC notice to Raja Singh: యూపీ ఓటర్లను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలతో వీడియో చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్​కు ఈసీ నోటీసులు జారీ చేసింది. వీడియోలో ఓటర్లను బెదిరించే విధంగా వ్యాఖ్యలు చేసినట్టు ఈసీ పేర్కొంది. దీనిపై 24 గంటల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

  • 'ఆ ఎమ్మెల్యేను సీఎం కొట్టారు' అంటూ పోస్టు..

Post against YSRCP MLA Vasanth Krishna Prasad : ఆయన అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే. 'ఆయనపై ముఖ్యమంత్రి చేయి చేసుకున్నాడు' అంటూ సోషల్ మీడియాలో దర్శనమిచ్చిన ఓ పోస్టు తెగ చక్కర్లు కొడుతుంది. ఈ వ్యవహారం కాస్త సదరు ఎమ్మెల్యే వరకూ చేరింది. ఏపీలోని కృష్ణా జిల్లాలో చర్చనీయాంశమైన ఈ పోస్టు వ్యవహారం వెనక ఉన్న వ్యక్తులను గుర్తించే వేటలో ఉన్నారు పోలీసులు.

  • పంజాబ్ చతుర్ముఖ పోరులో గెలిచేదెవరు?

Punjab elections 2022: పంజాబ్​లో అసెంబ్లీ ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. గతంలో కంటే భిన్నగా ఈసారి రాష్ట్రంలో చతుర్ముఖ పోటీ నెలకొంది. సంప్రదాయ పార్టీలైన కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్‌ అధికారం కుస్తీ పడుతున్నాయి. 2017లో మాదిరిగానే భారీ షాకివ్వాలని ఆప్​.. కూటమితో సత్తా చాటాలని భాజపా-పీఎప్​సీ భావిస్తున్నాయి.

  • భర్త కిడ్నాప్.. కూతురితో అడవిలోకి భార్య..

Chhattisgarh naxals news: నక్సల్స్ చెరలో ఉన్న తన భర్తను విడిపించుకునేందుకు ఓ మహిళ అడవి బాట పట్టింది. రెండున్నరేళ్ల కూతురితో దండకారణ్యంలోకి వెళ్లింది. అయితే, భర్తను మావోలు విడిచిపెట్టినా.. ఆమె అడవిలో నుంచి బయటకు రాకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

  • 19% తగ్గిన కరోనా కేసులు..

WHO New COVID cases: ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత వారంతో పోలిస్తే.. కేసులు 19 శాతం పడిపోయాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) పేర్కొంది. మరణాల సంఖ్య స్థిరంగా ఉందని వెల్లడించింది.

  • 'ఇగ్లూ టౌన్'​లా మారిపోయిన బీచ్..

Siberia igloo festival: సైబీరియాలోని ఓబీ సముద్ర తీరంలో నిర్వహించిన ఇగ్లూ ఫెస్టివల్ విశేషంగా ఆకట్టుకుంది. మంచు బ్లాకులతో ఇగ్లూలను నిర్మించేందుకు పోటీలు పడ్డారు పోటీదారులు. గత ఏడేళ్లుగా ఈ పోటీలను నిర్వహిస్తున్నారు నిర్వాహకులు.

  • ఎల్‌ఐసీ వద్ద భారీగా క్లెయిం చేయని నిధులు..

LIC IPO Unclaimed Funds: ఎల్​ఐసీ త్వరలోనే పబ్లిక్​ ఇష్యూకు రానుంది. ఇటీవలే.. సెబీకి ముసాయిదా పత్రాలు దాఖలు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో.. ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం వద్ద ఎవరూ క్లెయిం చేయని నిధులు రూ. 21 వేల కోట్లకుపైనే ఉన్నట్లు తెలిపింది.

  • వార్నర్ భావోద్వేగ ట్వీట్​..

David Warner IPL 2022: ఈ సారి ఐపీఎల్​లో కొత్త జట్టుకు ఆడనున్న నేపథ్యంలో సన్​రైజర్స్​తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నాడు వార్నర్. విలియమ్స్​న్​ కూతురుతో కలిసి బ్రేక్​ఫాస్ట్​ చేసిన ఫొటోతో భావోద్వేగ ట్వీట్​​​ చేశాడు. విలియమ్స్​న్​తో కలిసి ఆడే ఆవకాశం మిస్​ అవుతున్నానని అన్నాడు.

  • బప్పి సంగీతానికి మైకేల్ జాక్సన్​ వీరాభిమాని..

దిగ్గజ పాప్ సింగర్, డ్యాన్సర్ మైకేల్ జాక్సన్​.. బప్పి లహిరికి వీరాభిమాని. ఈయన కంపోజ్​ చేసిన 'జిమ్మీ జిమ్మీ' పాటను జాక్సన్, అప్పుడప్పుడూ పాడుతూ ఉండేవారు. 1989లో బీసీసీ లండన్​లో జరిగిన లైవ్​ ఫెర్ఫార్మెన్స్​ షోలో పాల్గొన్న ఏకైన భారతీయ మ్యూజిక్ డైరెక్టర్ బప్పి లహిరి. ఈయనను జొనాథన్ రాస్ ఆహ్వానించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.