ETV Bharat / city

Top News: టాప్​న్యూస్​ @7 PM - top news

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

telangana latest top news
telangana latest top news
author img

By

Published : Feb 13, 2022, 6:59 PM IST

  • 'నేను ఊరుకోనూ.. దిల్లీలో పంచాయితీ పెడతా..'

విద్యుత్‌ సంస్థలు నిర్మించినా ఉత్పత్తి కానివ్వట్లేదని సీఎం ఆరోపించారు. విద్యుత్‌ లేక దేశంలో 60 శాతం అంధకారంలో ఉంటుందన్నారు. తెలంగాణ తప్ప 24 గంటల విద్యుత్‌ ఏ రాష్ట్రం ఇవ్వలేదని కేసీఆర్​ తెలిపారు.

  • 'దమ్ముంటే నన్ను జైలుకు పంపాలి'

భాజపా నేతలకు మీకు దమ్ముంటే జైలుకు పంపాలని సీఎం కేసీఆర్​ సవాల్​ విసిరారు. తాము మాత్రం వారిని జైలుకు పంపేది మాత్రం పక్కా అని స్పష్టం చేశారు. భాజపా పాలకుల అవినీతి చిట్టా తన వద్ద ఉందన్నారు. రఫేల్‌ జెట్‌ విమానాల కొనుగోలులో గోల్‌మాల్‌ జరిగిందన్నారు.

  • 'ముచ్చింతల్‌ ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా మారనుంది'

President Ramnath Unveiled Gold statue of Ramanuja: శ్రీరామ నగరంలోని సమతామూర్తి కేంద్రంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. రామానుజాచార్యుల 120 ఏళ్ల జీవితానికి గుర్తుగా 120 కిలోల స్వర్ణమూర్తి ప్రతిమను.. రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ ఆవిష్కరించి లోకార్పణం చేశారు.

  • ప్రేమికుల రోజు గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా..?

ప్రేమకు ప్రతిరూపంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకొనే ప్రేమ పండగే వాలంటైన్స్ డే. ఇష్టంతో ముడిపడిన రెండు హృదయాల్లో ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమను వ్యక్తీకరించడానికి ఇదో ప్రత్యేకమైన సందర్భం. ఈ క్రమంలో ప్రేమను తెలుపుకోవడంతో పాటు ఒకరికొకరు కానుకలిచ్చిపుచ్చుకోవడం కూడా మనకు తెలిసిందే. ఇదంతా బాగానే ఉంది కానీ అసలు ఈ వాలంటైన్స్ డే రోజున ఎర్ర గులాబీలనే ఎందుకు కానుకగా అందిస్తారు? ప్రేమకు ప్రతిరూపంగా చెప్పుకునే రోమియో-జూలియట్ ఎవరు? ఇలాంటి కొన్ని ఆసక్తికర అంశాల సమాహారం మీకోసం..

  • ముస్లింలు, రైతుల ఓట్లే కీలకం!

UP election second phase: ఉత్తర్​ప్రదేశ్​లో రెండో దశ ఎన్నికలు సోమవారం జరగనున్నాయి. ముస్లింలు, దళితులు, రైతులు ఈ దఫా ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనున్నారు. పోటీ ప్రధానంగా భాజపా, ఎస్పీ మధ్యే కనిపిస్తోంది. మరి ఈ సారి ఏ పార్టీని విజయం వరించనుంది? సానుకూలతలు, ప్రతికూలతలు ఏంటన్న విషయాలు పరిశీలిస్తే...

  • ఎమ్మెల్యేకు కరోనా .. అయినా మోదీ సభకు

covid positive mla modi meeting: ఉత్తర్​ప్రదేశ్​లో ప్రధాని మోదీ సభకు హాజరైన ఎమ్మెల్యేకు అంతకుముందే కొవిడ్ పాజిటివ్​గా నిర్ధరణ అయింది. రెండు రోజుల వ్యవధిలో రెండు భిన్నమైన ఫలితాలు వచ్చిన ఆ ఎమ్మెల్యే.. మోదీ సభకు హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది.

  • హీరోయిన్​గా హాలీవుడ్​ భామ!

Jatiratnalu director-Sivakarthikeyan movie: శివకార్తికేయన్ హీరోగా 'జాతిరత్నాలు' దర్శకుడు అనుదీప్​ తెరకెక్కిస్తున్న సినిమాలో హీరోయిన్​గా ఓ హాలీవుడ్​ భామ నటించబోతున్నట్లు ప్రస్తుతం ప్రచారం సాగుతోంది. ఇంతకీ ఆ ముద్దుగుమ్మ ఎవరంటే?

  • రామ్​చరణ్-శంకర్​ సినిమా అప్డేట్​​!

Sarkaru vaari pata song released: కొత్త సినిమా అప్డేట్స్​ వచ్చాయి. ఇందులో 'మహేశ్​ సర్కారు వారి పాట', రామ్​చరణ్​-శంకర్​ కాంబో సినిమా వివరాలు ఉన్నాయి.

  • కోట్లు కుమ్మరించిన ముంబయి ఇండియన్స్

IPL mega auction 2022 Mumbai indians: ఐపీఎల్​ వేలంలో ముంబయి ఇండియన్స్​ ఆచితూచి వ్యవహరించింది. తొలిరోజు పెద్దగా ప్లేయర్లపై ఆసక్తి చూపని ఈ ఫ్రాంఛైజీ రెండో రోజు చివర్లో ఇద్దరు, ముగ్గురు ఆటగాళ్లపై కాసుల వర్షం కురిపించింది. మిగతా జట్లకు దక్కకుండా.. వీరిని కొనుగోలు చేసింది. వారెవరో చూద్దాం.

  • ఖలీల్​, సకారియాకు, రాజ్​ బవాకు సూపర్​ రెస్పాన్స్​

IPL 2022 Mega auction: రెండో రోజు మధ్యాహ్నం తర్వాత జరిగిన వేలంలో.. ఖలీల్​ అహ్మద్​, చేతన్​ సకారియా పంట పండింది. వీరి కోసం వరుసగా రూ. 5.25 కోట్లు, రూ. 4.20 కోట్లు వెచ్చించింది దిల్లీ క్యాపిటల్స్​. అండర్​-19 వరల్డ్​కప్​లో అదరగొట్టిన భారత ఆల్​రౌండర్​ రాజ్​ బవా రూ. 2 కోట్లకు అమ్ముడయ్యాడు. కెప్టెన్​ యశ్​ ధుల్​కు రూ. 50 లక్షలే దక్కాయి.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.