- 75వ స్వాతంత్య్ర వేడుకలకు..
75వ స్వాతంత్య్ర వేడుకల నేపథ్యంలో 259 మందితో ఉన్నత స్థాయి జాతీయ కమిటీని ఏర్పాటు చేసింది కేంద్రం. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వం వహించే ఈ కమిటీలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, నటులు అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, దర్శకుడు రాజమౌళి, క్రీడాకారిణిలు పీవీ సింధు, మిథాలి రాజ్‌కు చోటు కల్పించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- వందో రోజుకు రైతు ఉద్యమం
రైతు ఉద్యమం నేటితో 100 రోజులు పూర్తిచేసుకుంటుంది. భవిష్యత్తులో మరింత పటిష్ఠంగా ఉద్యమం చేపడతామని రైతు సంఘాల నేతలు పేర్కొన్నారు. ఆందోళనలకు 100 రోజులైన నేపథ్యంలో ఇవాళ బ్లాక్ డే పాటిస్తున్నారు. 5 గంటల పాటు దిల్లీలోని కుండ్లీ మనేసర్ పల్‌వాల్ ఎక్స్‌ప్రెస్ హైవేను దిగ్బంధిస్తామని సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఘన విజయం సాధించాల్సిందే..
నాగార్జున సాగర్ ఉపఎన్నికలో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని తెరాస శ్రేణులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఎర్రవల్లిలోని తన నివాసంలో పార్టీ ఇన్‌ఛార్జులతో సాగర్ ఉపఎన్నికపై.... సీఎం సమావేశం నిర్వహించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- గతేడాది హైదరాబాద్ వరదలపై ..
గతేడాది హైదరాబాద్‌లో భారీ వరదలకు ఆక్రమణలే కారణమని నీతి ఆయోగ్ తేల్చి చెప్పింది. జలవనరులను ఆక్రమించడం వల్లే గతేడాది అక్టోబరులో ఉత్పాతం సంభవించిందని పేర్కొంది. హుస్సేన్‌సాగర్ గట్లు, నాలాలన్నీ కబ్జాలకు గురవడమే సమస్యకు ప్రధాన కారణమని స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- నేడు ఎంసెట్ షెడ్యూల్!
ఎంసెట్ షెడ్యూల్ ఇవాళ ఖరారు కానుంది. నేడు జరగనున్న ఎంసెట్ కమిటీ కమిటీ సమావేశం అనంతరం... నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ, తదితర తేదీలను ప్రకటించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'చైనా దూకుడుకు నిదర్శనం'
భారత్-చైనా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా దూకుడుగా వ్యవహరిస్తోందన్నారు అమెరికా పెంటగాన్ చీఫ్‌గా బైడెన్ ఎంపిక చేసిన కొలిన్ కహల్. ఈ క్రమంలో తన మిత్రదేశాలకు అమెరికా అండగా నిలవాలన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రూ.44,000 దిగువకు బంగారం!
మేలిమి బంగారం ధర త్వరలో రూ.44,000 దిగువకు చేరవచ్చు! కిలో వెండి రూ.65,000కి దిగిరావచ్చు. అంతర్జాతీయ బలహీనతల వల్లే ఈ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని, ధరల్లో తేడాలను గమనించాలని విశ్లేషకులుచెబుతున్నారు. గతేడాది స్థాయిలో కాకున్నా, ఈ ఏడాదిలోనే ధరలు మళ్లీ పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- హద్దుమీరిన సుంకాలు..
సెస్సుల రూపంలో హద్దుమీరిన సుంకాలు విధించడమే కాక.. పన్నుల వాటాలో భారీ కోత విధిస్తూ కేంద్రం కొర్రీలు పెడుతోందని రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కొన్ని ప్రత్యేక అవసరాలు, కార్యక్రమాల పేరిట విధించే సెస్సుపై రాష్ట్రాలకు వాటా ఉండదు. అయితే.. అదనపు ఆదాయం కోసం కేంద్రం సెస్సులు విధించడం ఈ మధ్యకాలంలో పరిపాటైందనేది వాటి వాదన. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఆ క్రికెట్ దిగ్గజం అరంగేట్రానికి అర్ధ శతాబ్దం
భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్‌కు మార్చి 6తో ప్రత్యేక అనుబంధం ఉంది. సరిగ్గా 50 ఏళ్ల క్రితం ఇదే రోజున తన క్రికెట్ జీవితాన్ని ఆరంభించాడు సన్నీ. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- జీవితం బోర్ కొట్టేసింది
వరుసగా సినిమాలు చేయడం వల్ల తనకు తీరిక లేకుండా పోయిందని హీరోయిన్ సోనాక్షి సిన్హా అభిప్రాయపడింది. ఇకపై కాస్త నెమ్మదిగా చిత్రాలు చేయాలనుకుంటున్నానని తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.